త్వరలో Nissan Magnite Compact SUV రిలీజ్... ఫీచర్స్ ఇవే

Nissan Magnite Compact SUV | సరికొత్త నిసాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీలో 7-అంగుళాల టీఎఫ్టీ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్, వెల్కమ్ యానిమేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 8-అంగుళాల ఇంఫోటైన్మెంట్ సిస్టం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

news18-telugu
Updated: October 22, 2020, 4:47 PM IST
త్వరలో Nissan Magnite Compact SUV రిలీజ్... ఫీచర్స్ ఇవే
త్వరలో Nissan Magnite Compact SUV రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Nissan India)
  • Share this:
ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న నిసాన్ మ్యాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది ప్రముఖ వాహన సంస్థ నిసాన్. నిసాన్ ఎన్ఈఎక్స్టీ స్ట్రాటజీతో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ వాహనం వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో విడుదల కానుంది. మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ లో భాగంగా నిర్మించిన ఈ ఎస్ యూవీ లేటెస్ట్ టెక్నాలజీని పొందుపరిచారు. నిసాన్ ఇంటిలిజెంట్ మొబిలిటి(ఎన్ఐఎం)లో భాగంగా జపాన్ లో డిజైన్ చేశారు. నిసాన్ మ్యాగ్నైట్ 9 బాడీ కలర్స్, 5 మోనోటోన్, 4 డ్యూయల్ టోన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా స్లీక్ హెడ్ ల్యాంపులు, ఎల్-షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు(డీఆర్ఎల్), డామినేటింగ్ ఫ్రంట్ గ్రిల్ తో అదరగొడుతోంది.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

నిసాన్ మ్యాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రత్యేకతలు


ఈ సరికొత్త నిసాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీలో 7-అంగుళాల టీఎఫ్టీ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్, వెల్కమ్ యానిమేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 8-అంగుళాల ఇంఫోటైన్మెంట్ సిస్టం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఫ్లష్ టచ్ స్క్రీన్, వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్ ఇన్ వాయిస్ రికగ్నేషన్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. నిసాన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, నిసాన్ కనెక్ట్ ద్వారా 50 రకాల ఫీచర్లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో జియో ఫెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, స్మార్ట్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్ అవసరానికి తగినట్లు వీటిని మార్చుకోవచ్చు.

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

Amazon Great India Festival: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇవి కాకుండా ఈ కారులో వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైర్, ప్యాడిల్ ల్యాంపులు, యాంబియంట్ మూడ్ లైటింగ్, ప్రీమియం స్పీకర్లు(జేబీఎల్) లాంటి ఫీచర్లు ఉన్నాయి. నిసాన్ టాప్ సపోర్ట్ టెక్నాలజీ, అరౌండ్ వ్యూ మానిటర్(ఏవీఎం), వర్చువల్ బర్డ్స్ ఐ లాంటివి ఉన్నాయి. 60-40 ఫోల్డబుల్ రియర్ సీట్లు, మోస్ట్ స్పేసియస్ బీ-ఎస్ యూవీ,700 ఎంఎం కపుల్ డిస్టెన్స్ రియర్ నీ హెడ్ రూం, 336 లీటర్ల లగేజ్ రూం లాంటి ప్రత్యేకతలు దీని సొంతం. అంతేకాకుండా మైలేజి వచ్చేసి లీటరుకు గరిష్ఠంగా 20 కిలోమీటర్లు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 1.0-లీటర్ టర్బో ఇంజిన్ ను కలిగి ఉండి 5-స్పీడ్ ఎక్స్-ట్రోనిక్ సీవీటీ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: October 22, 2020, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading