Home /News /business /

NISSAN MAGNITE BOOKINGS BEGINS PAY RS 11000 AND BOOK THIS CAR SS GH

Nissan Magnite: కేవలం రూ.11,000 ఇచ్చి ఈ కారు బుక్ చేసుకోవచ్చు

Nissan Magnite: కేవలం రూ.11,000 ఇచ్చి ఈ కారు బుక్ చేసుకోవచ్చు

Nissan Magnite: కేవలం రూ.11,000 ఇచ్చి ఈ కారు బుక్ చేసుకోవచ్చు

Nissan Magnite booking | మాగ్నెట్ ను మొత్తం 9 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తేనుండగా, వీటిలో 5 మోనోటోన్ రంగుల్లో ఉండగా మరో 4 రెండు రంగుల్లో ఉన్నాయి. ఫ్లేర్ గార్నెట్ రెడ్ (టింట్-కోట్)తో ఈ కొత్త ఎస్ యూవీ ఆటోమొబైల్ లవర్స్ ను మురిపిస్తోంది. ఇందులోని టెక్ పార్క్ లో వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, పడల్ ల్యాంప్స్, మూడ్ లైటింగ్, ప్రీమియం స్పీకర్స్ (జేబీఎల్ పవర్డ్ బై హర్మాన్) వంటి ఫీచర్స్ తో వావ్ అనేలా మాగ్నెట్ నిజంగా మాగ్నెటిజం ప్రదర్శిస్తోంది.

ఇంకా చదవండి ...
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త మోడల్స్ కార్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో SUVలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో SUVల మ్యానుఫాక్చరర్స్ వీటిని మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా సరమైన ధరలతో సరికొత్త వేరియంట్స్ ను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే అదిరిపోయే ఫీచర్లతో నిస్సాన్ నిస్సాన్ మాగ్నైట్ కార్ లవర్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ కాగా అనధికారికంగా వీటి బుకింగ్స్ ను కూడా భారత డీలర్లు మొదలుపెట్టేశారు. కేవలం రూ.11,000 టోకన్ గా చెల్లిస్తే నిస్సాన్ మాగ్నెట్ ను బుక్ చేసుకోవచ్చు. అతి త్వరలో నిస్సాన్ అధికారికంగా కూడా ఈ బుకింగ్స్ మొదలుపెట్టనుంది.

జపాన్ కార్స్ హాట్ కేక్స్


జపాన్ కార్ల సంస్థ నిస్సాన్ రూపొందించిన మాగ్నెట్ సబ్-కాంపాక్ట్ ఎస్ యూవి సెగ్మెంట్ లో అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉండబోతోంది. సాధారణంగా జపాన్ కార్లంటేనే హాట్ కేక్స్‌లా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుబోతాయి. ఇటీవలే లాంచ్ అయిన కియా సోనెట్, హ్యూండాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజా, టయోటా న్యూ అర్బన్ క్రూజర్ కు పోటీగా మాగ్నెట్ మన విపణిలోకి అడుగుపెట్టనుంది.

SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు తీసుకుంటే రూ.6500 బెనిఫిట్స్

EPF Balance: రెండు రోజుల్లో ఈపీఎఫ్ వడ్డీ మీ అకౌంట్‌లోకి... బ్యాలెన్స్ చెక్ చేయండి ఇలా

భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా


ఆధునిక ఎక్స్ టీరియర్స్ తో, ఫీచర్డ్ ప్యాక్డ్ క్యాబిన్ తో నిస్సాన్ మాగ్నెట్ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా జపాన్ లో దీన్ని డిజైన్ చేయడం విశేషం. వర్చువల్ ఈవెంట్ ద్వారా గ్లోబల్ గా రిలీజ్ అయిన మాగ్నెట్ భారత కస్టమర్ల అవసరాలను, ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్టు నిస్సాన్ వెల్లడించింది. త్వరలో అందుబాటులోకి రానున్న మాగ్నెట్ పై ఇప్పటికే మన ఆటోమొబైల్ మార్కెట్లో మంచి బజ్ వచ్చింది.

9 రంగుల్లో


మాగ్నెట్ ను మొత్తం 9 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తేనుండగా, వీటిలో 5 మోనోటోన్ రంగుల్లో ఉండగా మరో 4 రెండు రంగుల్లో ఉన్నాయి. ఫ్లేర్ గార్నెట్ రెడ్ (టింట్-కోట్)తో ఈ కొత్త ఎస్ యూవీ ఆటోమొబైల్ లవర్స్ ను మురిపిస్తోంది. ఇందులోని టెక్ పార్క్ లో వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, పడల్ ల్యాంప్స్, మూడ్ లైటింగ్, ప్రీమియం స్పీకర్స్ (జేబీఎల్ పవర్డ్ బై హర్మాన్) వంటి ఫీచర్స్ తో వావ్ అనేలా మాగ్నెట్ నిజంగా మాగ్నెటిజం ప్రదర్శిస్తోంది. వీటి ప్రారంభ ధరలు రూ.5.50 లక్షలు కాగా హై ఎండ్ మోడల్ XV Premium CVT వేరియంట్ రూ. 9.55 లక్షలు. XE, XL,XV, XV Premium అనే మల్టిపుల్ వేరియంట్స్ లో మాగ్నెట్ కాంపాక్ట్ SUV మోడల్స్ ఉండనున్నాయి. వీటిపైన రూ. 25,000-30,000 వరకు టెక్నాలజీ ప్యాక్ ఆఫర్ ను కూడా నిస్సాన్ అందిచనుంది. అతి త్వరలో వీటి ధరలను నిస్సాన్ అధికారికంగా ప్రకటించనుంది.

కపుల్ డిస్టెన్స్


కపుల్ డిస్టెన్స్ అనే సరికొత్త ఫీచర్ ను పరిచయం చేస్తున్న మాగ్నెట్ లో డ్రైవర్ కు సైడ్ ప్యాసింజరుకు మధ్య 700ఎంఎం డిస్టెన్స్ తోపాటు 593 ఎంఎంల రేర్ నీ రూం, 76ఎంఎం రేర్ హెడ్రూం కూడా ఉంటాయి. రేర్ సీట్స్ 60-40 స్ప్లిట్ ఫోల్డబుల్ గా ఉంటాయి. ఓపన్ ఇంటీరియర్ స్పేస్ ఉండేలా ముందు సీట్లు డిజైన్ చేయడం మరో విశేషం. ఇక అరౌండ్ వ్యూ మానిటర్ (ఏవీఎం) ద్వారా డ్రైవర్ కు వర్చువల్ బర్డ్స్ ఐ వ్యూ ఉండేలా మాగ్నెట్ ను డిజైన్ చేశారు.

Gold Scheme: ధంతేరాస్ రోజున గోల్డ్ స్కీమ్‌లో చేరుతున్నారా? ఈ విషయం మార్చిపోవద్దు

iPhone: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపే ఐఫోన్ సొంతం చేసుకోండి... ఇంకొన్ని గంటలే ఆఫర్

సేఫ్టీ ఫీచర్లు అదుర్స్


జపాన్ ఉత్పత్తులంటేనే భద్రతకు పెట్టింది పేరు. మాగ్నెట్ లో కూడా ఇండియన్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ను తూ.చ. అనుసరిస్తూ దృఢమైన బాడీతోపాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్), ఎలక్ర్టానిక్ బ్రేక్-పోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ (హెచ్ బీఏ), వెహికల్ డైనమిక్ కంట్రోల్ (హెచ్ ఎస్ఏ), స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్, సెంట్రల్ లాకింగ్, ఎస్ఆర్ఎస్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ సిస్టం, సీట్ బెల్టులతో రూపొందించారు.

హ్యాచ్ బ్యాక్ కస్టమర్స్ కు ఇది అప్ గ్రేడ్


మనదేశంలో బీ-ఎస్ యూవీలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. హ్యాచ్ బ్యాక్ కస్టమర్స్ ను అప్ గ్రేడ్ చేస్తూనే, వరల్డ్ క్లాస్ ఎస్ యూవీని సొంతంచేసుకోవాలనుకునే వారికి మాగ్నెట్ మంచి ఆప్షన్ గా దీన్ని నిస్సాన్ డిజైన్ చేసింది. కుటుంబం, స్నేహితులతో ప్రయాణించేందుకు బెస్ట్ క్లాస్ కారుగా దీన్ని రూపొందించారు. దీని డైనమిక్ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, థ్రిల్ అంటే ఇష్టపడే వారికి నచ్చేలా టర్బో ఇంజిన్ తో అడ్వాన్స్డ్ మోడల్ తో మాగ్నెట్ విపణిలోకి అడుగుపెడుతుండటం హైలైట్.

గేమ్ ఛేంజర్


ఇండియన్ మార్కెట్లో మాగ్నెట్ గేమ్ ఛేంజర్ అవుతుందని నిస్సాన్ అంచనా వేస్తోంది. నిస్సాన్ నెక్ట్స్ స్ట్రాటెజీలో ఇది అత్యంత కీలకం కానుంది. ఇప్పటివరకు కస్టమర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ గా మన మార్కెట్లో ఉన్న నిస్సాన్ సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త వేరియెంట్స్ తో మార్కెట్లో సందడి చేయనుందని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ సినాన్ ఓజ్ కాక్ వివరిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Automobile, Automobiles, CAR, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు