Car Sales | మార్కెట్‌లో చాలా కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి. అయితే అన్నీ కూడా ఒకే రకమైన పని తీరును నమోదు చేయలేవు. ఎందుకంటే కొన్ని కంపెనీల కార్లకు భలే డిమాండ్ ఉంటుంది. అలాగే మరికొన్ని కంపెనీల కార్లకు (Car) మాత్రం అంతంత మాత్రంగానే డిమాండ్ (Money) ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని మోడళ్లను కొనే వారు కూడా ఉండరు. ఇప్పుడు మనం ఇలాంటి మోడల్ గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ కారును కొనే వారు లేరు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ కారును కొనడం లేదు.
ఇంతకీ అది ఏ కారు అని అనుకుంటున్నారా? అదే నిస్సాన్ ఇండింయాకు చెందిన కిక్స్ మోడల్. ఈ కారును కొనే వారు కనబడటం లేదు. అందుకే కంపెనీ కూడా ఈ కారు బుకింగ్స్ నిలిపివేసింది. కంపెనీ కేవలం మ్యాగ్నైట్ కారుకు మాత్రమే బుకింగ్స్‌ను స్వీకరిస్తోంది. కంపెనీ వెబ్‌సైట్‌లో కిక్స్ కారును బుక్ చేసుకోవడం వీలు కాదు.
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ .. రూ.6,500 కడితే ఇంటికి తెచ్చుకోవచ్చు!
ఇండియన్ మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా గమనిస్తే.. నిస్సాన్ కిక్స్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కంపెనీ కేవలం 108 యూనిట్ల నిస్సాన్ కిక్స్ మోడళ్లను మాత్రమే విక్రయించింది. అక్టోబర్ నెలలో చూస్తే.. ఈ మోడల్ అమ్మకాలు 242 యూనిట్లు విక్రయం అయ్యాయి. అయితే నవంబర్ నెలలో మాత్రం కేవలం 3 యూనిట్ల కార్లను మాత్రమే కొన్నారు. ఇక డిసెంబర్ నెలలో అయితే ఒక్క యూనిట్ కారు కూడా విక్రయం కాలేదు. తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
కేంద్రం అదిరే స్కీమ్.. నెలకు రూ.200 కడితే ప్రతి నెలా చేతికి రూ.5 వేలు, ఒకేసారి రూ.8.5 లక్షలు!
ఈ క్రమంలోనే ఇప్పుడు నిస్సాన్ కంపెనీ ఈ కిక్స్ మోడల్ బుకింగ్స్‌ను బంద్ చేసింది. అదేసమయంలో నిస్సాన్ కిక్స్ మోడల్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. ఏకంగా రూ.59 వేల వరకు తగ్గింపు ఉంది. అయినా కూడా ఈ కారును కొనే వారు లేకపోవడం గమనార్హం. క్యాష్ డిస్కౌంట్ రూ. 30 వేల వరకు ఉంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 19 వేల వరకు లభిస్తుంది. కాగా దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 9.5 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఈ కారు మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. గరిష్టంగా ఎక్స్‌షోరూమ్ ధర రూ. 14.5 లక్షలుగా ఉంది. ఇది 1.5 లీటర్, 1.3 లీటర్ పెట్రోల్ ఇంజిన్ల ఆప్షన్లలో కస్టమర్లకు లభిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, E cars, Electric cars