Home /News /business /

Car Offers: కారు కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఆ ​మోడల్ పై రూ. 75 వేల వరకు డిస్కౌంట్​.. వివరాలివే..

Car Offers: కారు కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఆ ​మోడల్ పై రూ. 75 వేల వరకు డిస్కౌంట్​.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nissan Car Offers: నిస్సాన్ తన కిక్స్​ ఎస్​యూవీపై బంపరాఫర్​ ప్రకటించింది. ఈ ఆఫర్​ కింద మొత్తం 75 వేల రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు.

ప్రస్తుతం ఆటో మొబైల్​ కంపెనీలన్నీ సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జపనీస్ వాహన తయారీ సంస్థ నిస్సాన్​ చేరింది. నిస్సాన్ తన కిక్స్​ ఎస్​యూవీపై బంపరాఫర్​ ప్రకటించింది. ఈ ఆఫర్​ కింద మొత్తం 75 వేల రూపాయల వరకు తగ్గింపు పొందే అవకాశాన్ని కల్పించింది. నిస్సాన్ ఇండియా డీలర్‌షిప్‌ సెంటర్లలో కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడం ద్వారా రూ.20 వేల వరకు క్యాష్​ బ్యాక్​, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5 వేల లాయల్టీ బెనిఫిట్స్​ పొందవచ్చు. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు, అధిక సిబిల్ స్కోరు ఉన్న కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను కూడా లభిస్తాయి. నిస్సాన్ కిక్స్ XL, XV, XV ప్రీమియం, XV ప్రీమియం (O) అనే మొత్తం నాలుగు ట్రిమ్ లెవల్స్​లో అందుబాటులో ఉంటుంది. వీటిలో 1.3 -లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5 -లీటర్ పెట్రోల్ ఇంజన్లను చేర్చింది. ఈ టర్బో మోటారు ఇంజిన్​ గరిష్టంగా 154 బిహెచ్‌పి, 254 ఎన్ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. మరో ఇంజిన్​ 105 బిహెచ్‌పి, 142 ఎన్‌ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు మొత్తం ఐదు- స్పీడ్ మాన్యువల్, సిక్స్- స్పీడ్ మాన్యువల్, సివిటి ఆటోమేటిక్ ఇంజిన్లను ఎంపిక చేసుకోవచ్చు.
Electric Two Wheelers: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ.. విస్తరణ పనుల్లో తయారీ సంస్థలు.. వివరాలివే..
Electric Cars : ఈ ఏడాది భారత మార్కెట్లోకి రానున్న విద్యుత్ కార్లు ఇవే..! ధర, ఫీచర్లు..పూర్తి వివరాలు..

నిస్సాన్ కిక్స్ ధర విషయానికి వస్తే.. ఈ వేరియంట్లు ప్రస్తుతం రూ. 9.5 లక్షల నుంచి రూ. 14.65 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య లభిస్తాయి. దీంతో పాటు నిస్సాన్ ఇటీవల తన డాట్సన్​, డాట్సన్​ గో వేరియంట్లపై ఆఫర్లను ప్రకటించింది. క్యాష్​బ్యాక్​, ఎక్స్​చేంజ్​ బెనిఫిట్స్​ వంటి వాటితో పాటు మెరుగైన సిబిల్​ స్కోర్​ ఉన్న కస్టమర్లకు అదనంగా రూ.7 వేల తగ్గింపు అందించింది. ఈ ఆఫర్లన్నీ నిస్సాన్​ అమ్మకాలు పెరగడానికి దోహదం చేశాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు..
ఇక, అదనపు ప్రయోజనాలు పొందేందుకు కొనుగోలుదారుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా 700 కంటే ఎక్కువ సిబిల్ రేటింగ్ కలిగి ఉండాలి. ఈ ఆఫర్లు ఎన్‌ఐసి ప్రారంభించిన డీలర్‌షిప్‌లో మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ధరలు వేరియంట్, కొనుగోలు చేసే ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి. ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సమీపంలోని తమ​ డీలర్​షిప్​ సెంటర్​ను సందర్శించాలని నిస్సాన్​ కోరింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR, Car loans, Cars

తదుపరి వార్తలు