Home /News /business /

NISSAN ANNOUNCED YEAR END OFFER ON NISSAN KICK SUV GET BENEFITS UPTO RS 65000 SS GH

Nissan YearEnd offer: నిస్సాన్ కిక్ ఎస్‌యూవీ మోడల్‌పై రూ.65,000 డిస్కౌంట్

Nissan YearEnd offer: నిస్సాన్ కిక్ ఎస్‌యూవీ మోడల్‌పై రూ.65,000 డిస్కౌంట్
(Image: Nissan)

Nissan YearEnd offer: నిస్సాన్ కిక్ ఎస్‌యూవీ మోడల్‌పై రూ.65,000 డిస్కౌంట్ (Image: Nissan)

Nissan year end offer | కొత్త కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. నిస్సాన్ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించింది. రూ.65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది.

జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్(Nissan) ఇటీవలే భారత మార్కెట్లోకి మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ వాహనాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే దసరా, దీపావళి పండుగ సీజన్లో భారీ ఆఫర్లను ప్రకటించిన నిస్సాన్.. ‘ఇయర్ ఎండ్ డిస్కౌంట్ సేల్’ పేరుతో మరోసారి ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొస్తుంది. ఆఫర్లలో భాగంగా వినియోగదారులు డిసెంబర్ 31 వరకు ఎంపిక చేసిన నిస్సాన్ కిక్ ఎస్యూవీ మోడల్‌పై రూ.65,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. డీలర్లు, తయారీదారులు తమ వద్ద ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవడానికి ఈ డిస్కౌంట్ను అందుబాటులోకి తెస్తున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. కోవిడ్–19తో ఈ ఏడాది ఆశించిన మేర కార్ల అమ్మకాలు జరగలేదు. దీంతో ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూసింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు అనేక కార్ల తయారీ సంస్థలు దసరా, దీపావళి సీజన్లో భారీ ఆఫర్లను ప్రకటించాయి. అయినప్పటికీ, తయరీదారులు, డీలర్ల వద్ద ఇంకా స్టాక్ మిగిలే ఉంది. దీంతో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ‘ఇయర్ ఎండ్ సేల్’లో భాగంగా భారీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకొస్తున్నాయి.

SBI Credit Card Limit: మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోండి ఇలా

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్... మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

కిక్ ఎస్‌యూవీ మోడల్‌పై రూ.65,000 డిస్కౌంట్...


నిస్సాన్ ఎస్‌యూవీ కిక్‌ వేరియంట్లపై రూ.65000 వరకు స్పెషల్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్‌లో భాగంగా కొనుగోలుదారులకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కింద రూ.50 వేల డిస్కౌంట్‌తో పాటు ఇయర్ ఎండ్ సేల్ కింద రూ.15000 డిస్కౌంట్ లభిస్తుంది. కాగా, ఎన్ఐసి ఎనేబుల్డ్ డీలర్షిప్‌లలో మాత్రమే ఈ ఆఫర్లను పొందవచ్చని నిస్సాన్ స్పష్టం చేసింది. ఈ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ వేరియంట్లు, నగరాలను బట్టి కూడా మారవచ్చని నిస్సాన్ పేర్కొంది. కాగా, నిస్సాన్ కిక్ వేరియంట్లు రెండు పెట్రోల్ ఇంజిన్ల ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. 1.5 -లీటర్ పెట్రోల్ ఇంజన్ ఐదు -స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. ఇది 105 బిహెచ్‌పి, 142 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా, 1.3- లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 154bhp, 254Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్, సివిటి గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో కూడా వస్తుందని నిస్సాన్ తెలిపింది. అయితే, Nissan GT-R మోడల్‌పై, ఇటీవలే నూతనంగా వచ్చిన Nissan Magnite మోడల్‌పై మాత్రం ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto, Automobile, Automobiles, CAR, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు