హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2022: ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వృద్ధి రేటు అసాధ్యం కాదు...Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే...

Union Budget 2022: ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వృద్ధి రేటు అసాధ్యం కాదు...Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే...

 మోదీ ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నుంచి బీమా దిగ్గజం LIC , రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వరకు అనేక అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా ప్రత్యేకంగా సంభాషించారు.

  FM Nirmala Sitharaman Exclusive Interview With Rahul Joshi |  బడ్జెట్ 2022-23 ప్రవేశ పెట్టిన అనంతరం వివిధ వర్గాల నుంచి స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు సైతం బడ్జెట్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సంభాషించారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించిన ఒక రోజు తర్వాత ఈ ఇంటర్వ్యూ తీసుసుకున్నారు. మోదీ ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నుంచి బీమా దిగ్గజం LIC , రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వరకు అనేక అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా ప్రత్యేకంగా సంభాషించారు.

  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

  వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 శాతం జిడిపి వృద్ధిని సాధించగలమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు. ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, “ప్రస్తుతం జరుగుతున్న పనిని కొనసాగించి, ప్రభుత్వ మద్దతుతో అన్ని రంగాలు పునరుద్ధరణను కొనసాగిస్తే, 8 శాతం వృద్ధిని సాధించవచ్చు.” ఆమె తెలిపారు. 8 శాతం వృద్ధి రేటును సాధించడం పెద్ద కష్టం కాదని అంచనా వేశారు. “బలమైన , స్థిరమైన వృద్ధికి మద్దతు ఇచ్చామని. వృద్ధ విషయంలో ప్రభుత్వం దృష్టిలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికలు వస్తాయి , వెళ్తాయి, అయితే ముఖ్యంగా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతు అవసరం అని ఆమె అన్నారు.

  వృద్ధి అంచనా 8-8.5 శాతం: ఆర్థిక సర్వే

  2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వఅద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోందని. కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోనుందని సర్వే అంచనా వేసిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల ఆదాయ ఉత్పత్తి (జిడిపి) 9.2 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం బలమైన స్థితిలో ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. బడ్జెట్‌లో సమగ్ర ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు.

  First published:

  Tags: Budget 2022, Budget 2022-23, Union Budget 2022

  ఉత్తమ కథలు