హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2022: LIC IPO ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుంది..పెట్టుబడుల ఉపసంహరణపై Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్..

Union Budget 2022: LIC IPO ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుంది..పెట్టుబడుల ఉపసంహరణపై Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్..

Fin Min Nirmala Sitharaman speaks to Network18

Fin Min Nirmala Sitharaman speaks to Network18

FM Nirmala Sitharaman Exclusive Interview With Rahul Joshi | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇంకా చదవండి ...

  FM Nirmala Sitharaman Exclusive Interview With Rahul Joshi |  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. LIC IPO కోసం ప్రిపరేషన్ బాగానే ఉంది, ఈ సంవత్సరమే పూర్తవుతుందని సీతారామన్ అన్నారు. జీవిత బీమా సంస్థ రెండు వారాల్లోగా డ్రాఫ్ట్ IPO పేపర్‌లను ఫైల్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు భారత్ పెట్రోలియం కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ , కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రధాన వాటా విక్రయం వంటి మునుపటి బడ్జెట్‌లలో నిర్దేశించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. 2022-23కి సంబంధించి డిజిన్వెస్ట్‌మెంట్‌పై బడ్జెట్ అంచనాను రూ. 65,000 కోట్లకు తగ్గించడం, గత బడ్జెట్‌లలో నిర్దేశించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం , దృష్టి సారించిందని ఆమె తెలిపారు. "గత సంవత్సరం బడ్జెట్ లక్ష్యాల పట్ల నా నిబద్ధత కొనసాగుతోంది. పెట్టుబడుల ఉపసంహరణకు మరింత సమయం ఉంద"ని సీతారామన్ అన్నారు.

  ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యకలాపాలు, దేశీయ లేదా ప్రపంచ స్టాక్ మార్కెట్ల పనితీరును బట్టి మాత్రమే నడవవని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.

  ప్రభుత్వం తన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని అమలు చేయడానికి 2020, 2021లో స్టాక్ మార్కెట్‌లో బూమ్‌ను ఉపయోగించుకోవాలి అనే అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, ఆర్థిక మంత్రి ఇలా అన్నారు: " సమయాన్ని నిర్ణయించేది స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు. బోర్డులోని నేను ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోవాలని ఆమె తెలిపారు "

  ఇదిలా ఉంటే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జీవిత బీమా భీమా IPO దేశంలోనే అతిపెద్దదిగా అంచనా వేస్తున్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్సరంలో కేవ‌లం రూ.32,835 కోట్ల మేర‌కు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా కేంద్రం స‌మ‌కూర్చుకుంది. ఈ ఏడాది బ‌డ్జెట్‌లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా రూ.1.75 ల‌క్షల కోట్లు సేక‌రించాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. రూ.1.75 ల‌క్షల కోట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. ల‌క్ష కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహ‌ర‌ణ ద్వారా రూ.75 వేల కోట్లు సేకరించాల‌ని కేంద్రం ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వానికి వివిధ రంగ సంస్థల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా రూ.9,330 కోట్లు మాత్రమే వ‌చ్చాయి. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా రెండవ-అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా చేస్తుంది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Union Budget 2022

  ఉత్తమ కథలు