హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2022: LIC IPO నుంచి డిజిటల్ యూనివర్సిటీ వరకూ...Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే...

Budget 2022: LIC IPO నుంచి డిజిటల్ యూనివర్సిటీ వరకూ...Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే...

Budget 2022

Budget 2022

నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సంభాషించారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించిన ఒక రోజు తర్వాత ఈ ఇంటర్వ్యూ తీసుసుకున్నారు. మోదీ ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నుంచి బీమా దిగ్గజం LIC , రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వరకు అనేక అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా ప్రత్యేకంగా సంభాషించారు.

ఇంకా చదవండి ...

    FM Nirmala Sitharaman Exclusive Interview With Rahul Joshi |   బడ్జెట్ 2022-23 ప్రవేశ పెట్టిన అనంతరం వివిధ వర్గాల నుంచి స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు సైతం బడ్జెట్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సంభాషించారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించిన ఒక రోజు తర్వాత ఈ ఇంటర్వ్యూ తీసుసుకున్నారు. మోదీ ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నుంచి బీమా దిగ్గజం LIC , రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వరకు అనేక అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా ప్రత్యేకంగా సంభాషించారు.

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

    >> ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కరోనా లాంట మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం బలంగా ముందుకు వెళ్లేందుకు బడ్జెట్ లో అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థలో ఊపును కొనసాగించాలని ,ఇన్‌ఫ్రాకు వీలైనంత సహాయం చేయాలనుకుంటున్నామని తెలిపారు.

    >> ప్రస్తుత కాలంలో ఆర్థిక వ్యవస్థకు బలమైన మద్దతు అవసరమని ఆర్థిక మంత్రి అన్నారు.

    >> ప్రధాని నరేంద్ర మోదీకి మొదటి నుంచీ వృద్ధిపై స్పష్టమైన ఆలోచన ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

    >> మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడులు మాత్రమే పెట్టుబడుల చక్రాన్ని ప్రభావితం చేస్తయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగా ఉంటే, ఇన్‌ఫ్రాపై ఖర్చును పెంచడానికి అనేక మార్గాలు ఉన్నాయని కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభుత్వమే నేరుగా డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా మాత్రమే ఈ పని చేయగలమన ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థపై ఇది మెరుగైన ప్రభావం చూపుతోందని నిర్మలా పేర్కొన్నారు.

    >> గత ఏడాది కేటాయించిన మూలధన వ్యయంలో 65-58% ఉపయోగించామని నిర్మలా సీతారామన్ చెప్పారు. Omicron రెండవ, మూడవ త్రైమాసికాల మొదటి త్రైమాసికానికి మూలధన వ్యయంపై ప్రభావం చూపిందన్నరు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ మూలధన వ్యయంలో 68% సాధించినట్లు తెలిపారు.

    >> పన్ను విషయంలో కూడా స్థిరత్వాన్ని అందించడం సాధ్యమవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు

    >> నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ "డిజిన్వెస్ట్‌మెంట్‌పై ప్రభుత్వ నిబద్ధత గతంలో లాగే ఉంది. ఎయిర్ ఇండియా సంక్లిష్టమైన అంశం అయిప్పటికీ పూర్తయ్యందని. ఇక LIC IPO ప్రణాళిక కూడా అతి త్వరలే మార్కెట్లోకి వస్తుందని, ఈ సంవత్సరమే లిస్టవుతుందని పేర్కొన్నారు.

    >> వ్యవసాయ చట్టంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ..పార్లమెంట్‌లో ఆమోదించినప్పటికీ చట్టాన్ని ఉపసంహరించుకున్న ఘనత ప్రధానికే దక్కుతుందన్నారు. సంస్కరణల గురించి మాట్లాడేటప్పుడు ఇది మనకు గుర్తుకు వస్తుంది.

    >> క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన చట్టం గురించి అడిగినప్పుడు, సీతారామన్ ఇలా సమాధానమిచ్చారు, "ఖచ్చితంగా సంప్రదింపుల తర్వాత బిల్లు వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో, క్రిప్టోను నియంత్రిస్తారో తెలియదు."అని అన్నారు.

    > డిజిటల్ యూనివర్సిటీని ప్రతిపాదించామని సీతారామన్ తెలిపారు. "ఈ అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండాలనే ఆలోచన నుంచి వచ్చందన్నారు." డిజిటల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులందరికీ ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

    >> 7-8 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది గుర్తించాలి. నిరంతరం పని చేస్తూ ఉంటే, ఖచ్చితంగా అనకున్న సమయంలో లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు తెలిపారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Budget 2022, Budget 2022-23, Union Budget 2022

    ఉత్తమ కథలు