Home /News /business /

NIRAV MODI THREATENS SELF IMMOLATION IF EXTRADITED TO INDIA REPORT BA

ఇండియాకు పంపిస్తే నిప్పంటించుకుంటా.. నీరవ్ మోదీ

నీరవ్ మోదీ

నీరవ్ మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,500 కోట్ల మేర ముంచిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయారు.

    తనను ఇండియాకు పంపిస్తే నిప్పు అంటించుకుంటానని నీరవ్ మోదీ బెదిరించారు. యూకే కోర్టులో నిన్న నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు. ఆయన బెయిల్ పిటిషన్ రద్దు కావడం ఇది నాలుగోసారి. జమానత్ కింద నాలుగు మిలియన్ పౌండ్ల చెల్లిస్తానని చెప్పినా కూడా కోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ సందర్భంగా నీరవ్ మోదీ పైవ్యాఖ్యలు చేసినట్టు ఓ వెబ్‌సైట్ తెలిపింది.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,500 కోట్ల మేర ముంచిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయారు. యూకేలో తలదాచుకుంటున్నారు. అయితే, అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి పోలీసులు నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. అనంతరం అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు వరుసగా తిరస్కరణకు గురవుతున్నాయి.
    First published:

    Tags: Nirav Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు