Home /News /business /

Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించండి.. తీర్పు చెప్పిన యూకే కోర్టు

Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించండి.. తీర్పు చెప్పిన యూకే కోర్టు

నీరవ్ మోదీ (File)

నీరవ్ మోదీ (File)

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో కీలక నిందితుడు, విదేశాల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని యూకే కోర్టు తేల్చి చెప్పింది. నీరవ్ మోదీ భారత్‌లో సమాధానం చెప్పాల్సిన కేసులు ఉన్నాయని కాబట్టి ఆయన్ను ఇండియాకు పంపాలని స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
    పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో కీలక నిందితుడు, విదేశాల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని యూకే కోర్టు తేల్చి చెప్పింది. నీరవ్ మోదీ భారత్‌లో సమాధానం చెప్పాల్సిన కేసులు ఉన్నాయని కాబట్టి ఆయన్ను ఇండియాకు పంపాలని స్పష్టం చేసింది. దీంతో సుమారు రెండేళ్లుగా జరుగుతున్న న్యాయపోరాటానికి ఫుల్ స్టాప్ పడనుంది. పంజాబ్ నేషనల్ స్కాంలో నిందితుడు అయిన నీరవ్ మోదీ సాక్ష్యాలు నాశనం చేసేందుకు ప్రయత్నించారని కోర్టు అభిప్రాయపడింది. మనీలాండరింగ్ జరిగినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని యూకేలోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు జిల్లా జడ్జి సామ్యూల్ గూజీ అభిప్రాయపడ్డారు. ‘ఇందులో చాలా అంశాలు ఇండియాలో కోర్టు ట్రయల్స్‌లో ఉన్నాయి. ఆయన నేరం చేశాడనడానికి సరిపడిన ఆధారాలు ఉన్నాయని నేను మరోసారి విశ్వసిస్తున్నా.’ అని జడ్జి శామ్యూల్ అన్నారు. దీంతోపాటు భారత్‌లోని జైళ్లలో సరైన సదుపాయాలు లేవనే వాదనను కూడా ఆయన తిరస్కరించారు. నిందితులను జైల్లో ఉంచే ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని బ్యారెక్ నెంబర్ 12 అనేది డిటెన్షన్‌కు సరిపడిన విధంగానే ఉందన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న జైళ్ల కంటే ముంబై ఆర్ధర్ రోడ్డులో ఉన్న జైల్లో బ్యారెక్ నెంబర్ 12లో వసతులు మెరుగ్గానే ఉన్నాయని జడ్జి శామ్యైల్ గూజీ అన్నారు.

    సుమారు రూ.14 కోట్ల విలువైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నీరవ్ మోదీ నిందితుడు. ఆయన ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నారు. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, భారత్‌లో జైళ్ల గురించి, ఇతరత్రా అంశాలను లేవనెత్తుతూ పలుమార్లు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. కొన్నాళ్లు నీరవ్ మోదీకి పెద్దగా ఎదురుదెబ్బ తగలకపోయినా.. ఆ తర్వాత అక్కడి కోర్టు ఆయన్ను జైల్లో పెట్టింది. అనంతరం ఆయన్ను భారత్‌కు అప్పగించే ప్రక్రియ మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. భారత్‌లో జైళ్ల మీద నీరవ్ మోదీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ బ్యారెక్ నెంబర్ 12 బాగుందని స్పష్టం చేసింది. అయితే, దీనిపై నీరవ్ మోదీ స్థానిక హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు.

    నీరవ్ మోదీ మీద భారత్‌లో రెండు రకాలైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ కేసు కొనసాగుతోంది. అందులో ఒప్పంద పత్రాలు, లోన్ అగ్రిమెంట్లకు సంబంధించిన విచారణ జరుగుతోంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతోంది.

    నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విషయంలో కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఈ సమయంలో అప్పగింత సరికాదనే వాదనను లేవనెత్తారు. అయితే, అప్పగింత విషయంలో మోదీ మానసిక ఆరోగ్యం అనే పాయింట్ మోదీ పిటిషనర్ వాదిస్తున్న సెక్షన్ 91 కిందకు రాదని జడ్జి స్పష్టం చేశారు. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేను కూడా ఈ కారణంగానే అప్పగించలేదనే వాదన నీరవ్ మోదీ తరఫున వాదనలు వినిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. దీనికి సంబంధించి నిపుణులైన సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి ఆయన ఆరోగ్యాన్ని బాగా చూసుకునే అంశంపై భారత్‌తో చర్చించాలని సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Nirav Modi, PNB Scam, United Kingdom

    తదుపరి వార్తలు