NIRAV MODI BROTHER CHARGED WITH COMMITTING 2 6 MILLION DOLLAR FRAUD IN NEW YORK MK
Nirav Modi తమ్ముడు భారీ మోసం...అన్న ఇండియాను...తమ్ముడు అమెరికాను నాకించేశారుగా...
నీరవ్ మోడీ
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ ఇప్పుడు న్యూయార్క్‌లో భారీగా మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మల్టీ లేయర్డ్ పథకం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల కంపెనీలలో ఒకదాన్ని 2.6 మిలియన్ డాలర్లకు (రూ .19 కోట్లకు పైగా) మోసం చేసినట్లు నేహాల్ మోడీపై ఆరోపణలు ఉన్నాయి.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ ఇప్పుడు న్యూయార్క్‌లో భారీగా మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మల్టీ లేయర్డ్ పథకం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల కంపెనీలలో ఒకదాన్ని 2.6 మిలియన్ డాలర్లకు (రూ .19 కోట్లకు పైగా) మోసం చేసినట్లు నేహాల్ మోడీపై ఆరోపణలు ఉన్నాయి. మాన్ హట్టన్ లోని ఒక వజ్రాల టోకు సంస్థ నుండి 2.6 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన వజ్రాలను తీసుకొని మోసం చేసినందుకు గానూ న్యూయార్క్ సుప్రీంకోర్టులో ఫస్ట్-డిగ్రీ విచారణను ఎదుర్కోవలసి ఉంది. న్యూయార్క్ చట్టాల ప్రకారం, ఫస్ట్-డిగ్రీ ఘోరమైన దొంగతనం అంటే $ 1 మిలియన్ కంటే ఎక్కువ దొంగిలించడం అని అర్థం. వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఎల్ఎల్డీ డైమండ్స్ నుంచి 2.6 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలను మోసపూరితంగా పొందినట్లు కేసు నమోదైంది. వజ్రాల కోసం రుణాన్ని పొంది. తర్వాత ఆ వజ్రాలను తన సొంత అవసరాల కోసం నగదుగా మార్చుకుని, వాడుకున్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి.
ప్రాసిక్యూషన్ ప్రకారం, మార్చి 2015 లో, నేహల్ మోదీ ఎల్ఎల్డీ డైమండ్స్ సంస్థను తన బుట్టలో వేసుకున్నాడు, కాస్ట్కో హోల్‌సేల్ కార్పొరేషన్‌తో అనే సంస్థతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అబద్ధం చెప్పి, సుమారు. 8 లక్షల డాలర్ల విలువైన వజ్రాలను అమ్మకం కోసం కాస్ట్‌కోకు ఇవ్వాలని కోరాడు. నిజానికి కాస్ట్ కో సంస్థతో నేహల్ మోడీకి ఎలాంటి సంబంధం లేదు. కాస్ట్కో అనేది సభ్యులుగా చేరిన వినియోగదారులకు వజ్రాలను తక్కువ ధరలకు విక్రయించే చెయిన్ సంస్థ. అంతేకాదు ఈ డీల్‌కు కాస్ట్కో అంగీకరించిందని నేహల్ ఎల్ఎల్డీ సంస్థకు అబద్ధం చెప్పాడు. ఎల్ఎల్డీ నుంచి వజ్రాలను రుణంపై తీసుకొని, ఈ వజ్రాలను స్వల్పకాలిక రుణం తీసుకునేందుకు తాకట్టుపెట్టి, ఆ సొమ్మును వ్యక్తిగతంగా వాడుకున్నాడనే ఆరోపణల్లో పేర్కొంది.
నేహల్ మోడీ మోసాన్ని ఎల్ఎల్డీ ఆలస్యంగా గుర్తించింది. తమ సొమ్మును చెల్లించాలని లేదంటే వజ్రాలను తిరిగి ఇచ్చేయాలని కోరింది. అయితే అప్పటికే మోదీ ఆ వజ్రాలను తాకట్టు పెట్టి, తద్వారా వచ్చిన సొమ్మును వాడుకోవడం కూడా జరిగిపోయింది. దీంతో ఎల్ఎల్డీ మన్హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. న్యూయార్క్ సుప్రీంకోర్టు నెహల్ మోదీపై ఆరోపణలు నమోదు చేసింది.
నేహాల్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించి 13,500 కోట్ల రూపాయలు (సుమారు 1.9 బిలియన్ డాలర్లు) మోసం కేసు ఉందని నేను మీకు చెప్తాను. నేహాల్‌ను తిరిగి భారత్‌కు తీసుకురావడంలో భారత్ నిరంతరం నిమగ్నమై ఉంది. భారతదేశం అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ కూడా నేహాల్‌పై రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే, నేహాల్ రప్పించడం ఇంకా పెండింగ్‌లో ఉంది. అన్న నీరవ్ , తమ్ముడు నేహాల్ వీరిద్దరిపైనా అటు ఇండియాలో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. నెహల్ మోదీ దుబాయ్‌లో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.