పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నిలువునా ముంచి లండన్ పారిపోయినా నీరవ్ మోడీ వస్తువులను వేలం వేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ సిద్ధమవుతోంది. గత నెలలో ముంబైలో కొన్ని వస్తువులను వేలం వేసిన ఈడీ, ఈ సారి స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ పేరిట ఫిబ్రవరి 27, స్ప్రింగ్ ఆన్లైన్ ఆక్షన్ పేరుతో మార్చి 3, 4 తేదీల్లో మొత్తం 112 వస్తువులను అమ్మకానికి ఉంచింది. ఈ వస్తువులలో ప్రత్యేకమైన కళఖండాలు ఉన్నాయి. ఆధునిక, సమకాలీన భారతీయ కళల పెయింటింగ్స్, లగ్జరీ వాచీలు, హ్యాండ్ బ్యాగ్స్లు, కార్లను ఆక్షన్ కు ఈడీ అధికారులు ఉంచారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.