Home /News /business /

NIPPON INDIA ETF NIFTY IT TO SBI HEALTHCARE OPP FUND HUGE RETURNS ON THESE 10 MUTUAL FUNDS IN 2020 CHECK LIST HERE SS GH

Mutual Funds: 2020లో లాభాల వర్షం కురిపించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్

Mutual Funds: 2020లో లాభాల వర్షం కురిపించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Mutual Funds: 2020లో లాభాల వర్షం కురిపించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Funds | కరోనా సమయంలో మార్కెట్లు క్రాష్ అయితే మ్యూచువల్ ఫండ్స్ సిరులెలా కురిపించాయని ఆలోచించకండి. మార్కెట్ రిస్కులతో కూడుకున్న పెట్టుబడుల్లో ఉన్న రిటర్న్స్ ఇలానే ఉంటాయి.

2020లో 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పై 50శాతానికి పైగా రిటర్న్స్ వచ్చాయి. నిజానికి కోవిడ్-19 కారణంగా మార్కెట్లు పతనం కాగా దీని ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ పై కూడా చాలానే పడింది. కానీ ఈ మహమ్మారి సమయంలోనూ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొన్ని కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోని వారు మాత్రం అదృష్టవంతులుగా మిగిలారని మార్కెట్ చెబుతోంది. కొన్ని కంపెనీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ అనూహ్యంగా సగానికిపైగా లాభపడ్డాయంటే ఇవి 2020లో ఎలా సిరులు కురిపించాయో అర్థమవుతుంది. నిజానికి 2020లో పెట్టుబడుదారులు రోలర్ కోస్టర్ రైడ్ ను తలపించే జర్నీ చేశారు. కరోనా ధాటికి గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలగా అయినకాటికి డబ్బు తీసేసుకుందామని ఉపసంహరణలు జోరందుకున్నాయి. కొందరైతే తాము చేస్తున్న సిప్ (SIP)పెట్టుబడులను కూడా ఆపేశారు. కానీ ధైర్యంగా సిప్ కంటిన్యూ చేసినవారు, మ్యూచువల్ ఫండ్స్‌ను క్యాన్సిల్ చేసుకోని కొందరు బాగా లబ్ది పొందారు. 500 కోట్లకుపైగా మేనేజ్మెంట్ విలువ ఉన్న కంపెనీల్లో ఇలా లబ్దిపొందిన టాప్ 10 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలా ఉన్నాయి.

SBI Credit Card Limit: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువ ఉందా? పెంచుకోండి ఇలా

UPI Transaction: గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్

DSP Healthcare Fund-Reg(G): ఈ స్కీము 76శాతం గెయిన్ అయింది. 2020 డిసెంబరు 30 కల్లా 19.21 రూపాయల NAVతో ఇది లాభపడింది.

Mirae Asset Healthcare Fund-Reg (G): ఈ స్కీము 73శాతం గెయిన్ అయింది. 2020, డిసెంబరు 30 కల్లా 18.86 రూపాయలNAVతో ఇది లాభాలు ఆర్జించింది.

ICICI Pru Pharma Healthcare & Diagnostics (P.H.D) Fund -(G): ఈ స్కీము 2020లో 71శాతం గెయిన్ అయింది. 2020, డిసెంబరు 30 నాటికల్లా 17.64 రూపాయల NAVతో ఇది లాభపడింది.

ICICI Pru Technology Fund (G): ఈ స్కీము 71శాతం గెయిన్ అయింది. 2020, డిసెంబరు 30కల్లా 98.88 రూపాయల NAVతో ఇది లాభపడింది.

UTI Healthcare Fund-Reg (D): ఈ స్కీము 2020 సంవత్సరంలో 66శాతం గెయిన్ అయింది. 2020, డిసెంబర్ 30 కల్లా 186.37 రూపాయల NAVతో ఇది లాభపడింది.

Nippon India ETF Nifty IT: ఈ స్కీము 66శాతం గెయిన్ అయింది. 2020 డిసెంబరు 30 నాటికి రూ. 24.51 NAVతో ఇది లాభాలు ఆర్జించింది.

Nippon India Pharma Fund (G): ఈ స్కీము 65శాతం లాభపడింది. 2020, డిసెంబరు 30 నాటికి రూ.251.64 NAVతో ఇది లాభపడింది.

SBI Healthcare Opp Fund-Reg (D): ఈ స్కీము 2020 సంవత్సరంలో 65శాతం లాభపడింది. డిసెంబరు 30, 2020 నాటికి 254.98 రూపాయల NAVతో ఇది లాభపడింది.

Aditya Birla SL Digital India Fund (G): ఈ స్కీము 2020లో 59శాతం గెయిన్ అయింది. 2020 డిసెంబరు 30 నాటికి 87.16రూపాయల NAVతో ఇది లాభపడింది.

Tata Digital India Fund-Reg (G): ఈ స్కీము 2020లో 55 శాతం గెయిన్ కాగా, 2020, డిసెంబరు 30 నాటికి రూ.23.38 NAVతో ఇది లాభపడింది.

EPFO: ఈపీఎఫ్ వడ్డీపై కేంద్ర మంత్రి క్లారిటీ... వెంటనే బ్యాలెన్స్ చెక్ చేయండిలా

SBI: అలర్ట్... ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చేసింది

తెలివిగా ఎంచుకోండి


మనం ఎంచుకునే ఫండ్ రకాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంతేకాదు కావాలనుకున్నప్పుడు వీటిని ఉపసంహరించుకోవచ్చు కూడా. సింపుల్ సీక్రెట్ ఏంటంటే మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల రూపంలో మ్యూచువల్ ఫండ్స్ కొంటే అవి లాభదాయకంగా ఉండటం ఖాయం. కానీ మార్కెట్ రిస్కు కారణంగా కచ్ఛితంగా ఇంత మొత్తం మీకు మెచ్యూరిటీ సమయంలో అందుతుందని చెప్పే అవకాశాలు లేనందున ఈ మ్యూచువల్ ఫండ్స్ పై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది వెనకాడుతారు. మార్కెట్ రిస్కుకు అనుగుణంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఉంటాయి. అందుకే మార్కెట్లపై అవగాహన పెంచుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Investment Plans, Mutual Funds, Personal Finance, Save Money

తదుపరి వార్తలు