Stock Market Record: స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డుల మోత...తొలిసారి 11800 పాయింట్లను దాటిన నిఫ్టీ

Stock Market Records | స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత మోగుతోంది. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడంలో మార్కెట్లలో బుల్ రన్ జోరందుకుంది. నిఫ్టీ తొలిసారిగా 11800 స్థాయిని తాకడంతో మార్కట్లో కొత్త గరిష్టాలు నమోదయ్యాయి. అటు సెన్సెక్స్ సైతం 40 వేల పాయింట్ల దిశగా పరుగుపెడుతోంది. ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నిధుల వరద పారిచడంతో పాటు, ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయనే అంచనాలు కొనుగోళ్లకు ఉత్ర్పేరకంగా పనిచేస్తున్నాయి.

news18-telugu
Updated: April 16, 2019, 6:09 PM IST
Stock Market Record: స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డుల మోత...తొలిసారి 11800 పాయింట్లను దాటిన నిఫ్టీ
తొలిసారి 11800 పాయింట్లను దాటిన నిఫ్టీ
news18-telugu
Updated: April 16, 2019, 6:09 PM IST
స్టాక్ మార్కెట్ సరికొత్త ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేస్తోంది. నూతన రికార్డులను నెలకొల్పుతూ బుల్ రన్ కొనసాగుతోంది. మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ నిప్టీ మంగళవారం 11810 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ రికార్డు గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కాగా నిఫ్టీ 11800 పాయింట్లు స్థాయిని తాకడం ఇదే మొదటి సారి కావడం విశేషం. మరోవైపు సెన్సెక్స్ సైతం 39364 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదుచేసింది. ముఖ్యంగా సెక్టార్ పరంగా ప్రైవేట్ బ్యాంకులతో పాటు ఐటీ స్టాక్స్ ముందంజ వేయడం నిఫ్టీ 100 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ 400 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్ స్టాక్స్ అయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.84 శాతం లాభపడి టాప్ గెయినర్ గా నిలిస్తే మరో ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు సైతం 3.50 శాతం లాభపడి టాప్ గెయినర్ గా నిలిచింది. అలాగే హిందుస్తాన్ పెట్రోలియం, టైటాన్, ఓఎన్జీసీ స్టాక్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అలాగే సూచీలను బలపరిచిన హెవీ వెయిట్ స్టాక్స్ టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, మారుతి సుజుకి లాంటి స్టాక్స్ 1 శాతం మేర లాభపడటంతో మార్కెట్లలో ర్యాలీకి దోహదపడింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్ బీఐ, టాటా మోటార్స్, ఎస్ బ్యాంక్, ఎం అండ్ ఎం లాంటి స్టాక్స్ సైతం పాజిటివ్ గా ట్రేడవడంతో మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిని తాకేందుకు దోహదపడింది.

ముఖ్యంగా మార్కెట్లలో దూకుడుకు ప్రధానంగా క్యూ4లో ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ బలమైన రిజల్ట్స్ ఒక కారణంగా కనిపిస్తోంది. నూతన ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా టీసీఎస్ మొత్తం 5 శాతం పెరగడం విశేషం.

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా మొత్తం 3 శాతం ర్యాలీ నమోదు చేసింది. ముఖ్యంగా గోల్డ్ మ్యాన్ సాక్స్ సంస్థ టార్గెట్ ధరను రూ. 492గా నిర్ణయించడంతో మదుపరులు ఈ స్టాక్ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించారు. అలాగే దీని ప్రభావం ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ ఇండస్ ఇండ్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ల మీద కూడా పడటంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.

ముఖ్యంగా మెటిరోలాజికల్ డిపార్ట్ మెంట్ ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేసింది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. అలాగే అన్నింటి కన్నా ప్రధానంగా ఫారెన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 12000 కోట్లు భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పంప్ చేయడం కూడా మార్కెట్లలో సెంటిమెంట్ ను బలపరిచింది. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు, ఎర్నింగ్స్ స్థిరంగా ఉండటం, అలాగే ఎలక్షన్స్ కూడా మార్కెట్లపై మున్ముందు మరింత ప్రభావం చూపించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...