NHB జాబ్స్... అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... శాలరీ రూ.42,000

NHB recruitment 2019 : అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. రిజిస్టర్ చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 28, 2019. అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఏప్రిల్ 12, 2019 వరకూ ఇవ్వవచ్చు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 10, 2019, 3:01 AM IST
NHB జాబ్స్... అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... శాలరీ రూ.42,000
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
NHB recruitment 2019 : అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందుకోసం బ్యాంక్ వెబ్‌సైట్‌కి nhb.org.in వెళ్లవచ్చు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజిస్టర్ చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 28, 2019. అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఏప్రిల్ 12, 2019 వరకూ ఇవ్వవచ్చు. ఈ జాబ్ కావాలంటే ముందుగా అభ్యర్థులు ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఏప్రిల్ 21, 2019 (ఆదివారం) నాడు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ జాబ్‌కి అప్లై చేసే అభ్యర్థుల వయసు 21 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే... మార్చి 1, 2019 నాటికి వారి వయస్సు 28 ఏళ్లు దాటకూడదు.

విద్యార్హతలు : 60 శాతం మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా 55 శాతం మార్కులతో ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం మార్కుల తగ్గింపు ఉంది.

ఎలా అప్లై చెయ్యాలి :
* ముందుగా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. nhb.org.in
* మెనూలో opportunities @NHB క్లిక్ చెయ్యాలి.
* తర్వాత ‘current vacancies’ క్లిక్ చెయ్యండి.
* నెక్ట్స్ ‘recruitment of assistant manager’ పై క్లిక్ చెయ్యాలి.* ఇప్పుడు ‘click here to apply online’ అనే దానిపై క్లిక్ చెయ్యాలి.
* ఫామ్ ఫిలప్ చేసి... మీ ఫొటోలు, ఇతరత్రా అడిగినవి అప్‌లోడ్ చెయ్యాలి.
* పేమెంట్ చెల్లించాలి.

ఫీజు : అప్లికేషన్ ఫీజు కింద రూ.600 చెల్లించాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

శాలరీ : అభ్యర్థులు రూ.23,700 నుంచీ రూ.42,020 మధ్య స్కేలులో శాలరీ పొందుతారు. అదనంగా HRA, DA, స్పెషల్ పే కూడా ఉంటుంది.

 

ఇవి కూడా చదవండి :

ఉదయాన్నే వెల్లుల్లి తింటే... అద్భుతమైన ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...

ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగండి... తేడా కనిపిస్తుంది... ప్రకృతి వరం

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...
First published: March 10, 2019, 3:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading