హోమ్ /వార్తలు /బిజినెస్ /

Maruti Suzuki Ertiga: మారుతి సుజుకి ఎర్టిగా బుకింగ్స్ ప్రారంభం.. ఈ వెహికిల్ గురించి తెలుసుకోవాల్సినవి ఇవే..

Maruti Suzuki Ertiga: మారుతి సుజుకి ఎర్టిగా బుకింగ్స్ ప్రారంభం.. ఈ వెహికిల్ గురించి తెలుసుకోవాల్సినవి ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మారుతి సుజుకి(Maruti Suzuki) మరో కొత్త కారు విక్రయాలకు తెరలేపింది. కొత్త ఎర్టిగా(Ertiga) కారు బుకింగ్స్ ప్రారంభించినట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. కుటుంబం మొత్తం దూర ప్రయాణాలు చేపట్టేందుకు వీలుగా ఈ కారు ఉంటుందని తెలిపింది.

మారుతి సుజుకి(Maruti Suzuki) మరో కొత్త కారు విక్రయాలకు తెరలేపింది. కొత్త ఎర్టిగా(Ertiga) కారు బుకింగ్స్(Bookings) ప్రారంభించినట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. కుటుంబం మొత్తం దూర ప్రయాణాలు చేపట్టేందుకు వీలుగా ఈ కారు ఉంటుందని తెలిపింది. ఇంధన సామర్థ్యంతో పాటు స్టైలిష్‌ లుక్‌(Stylish Look), స్సేస్‌, అధునాత ఫీచర్లు(New Features) వినియోగదారుల అంచనాలను మించుతాయని వివరించింది. వివరాల్లోకి వెళ్తే.. మారుతి సుజుకి కంపెనీ (Maruti Suzuki Company) ఇండియాలో నెక్స్ట్‌ జనరేషన్‌(Generation) ఎర్టిగా కోసం బుకింగ్స్ ప్రారంభించింది. కొత్త ఎర్టిగా బ్రాండ్ నెక్స్ట్‌ జనరేషన్‌ జెన్ K-సిరీస్ 1.5L డ్యూయల్ జెట్, ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో డ్యూయల్ VVT ఇంజన్‌తో వస్తోంది. నెక్స్ట్ జనరేషన్‌ ఎర్టిగా ప్యాడిల్ షిఫ్టర్‌లతో అధునాతన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నడుస్తుంది. ఇంధన సామర్థ్యంలో అత్యుత్తమంగా ఉందని కంపెనీ పేర్కొంది. రూ.11,000 చెల్లించి ఈ కారును బుక్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఈ మోడల్‌ సీఎన్‌జీ విభాగంలోనే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

* న్యూ జనరేషన్ ఎర్టిగా ఫీచర్లు

కొత్త ఎర్టిగా కారులో 17.78cm (7 inch) స్మార్ట్‌ఫ్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది. దీని S-CNG ఇప్పుడు ZXI వేరియంట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ జనరేషన్‌ ఎర్టిగా కోసం బుకింగ్స్‌ ప్రారంభించినట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శ్రీ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

eSIM: రెండు సిమ్‌కార్డులు ఒక్క‌దాంట్లోనే.. ఆండ్రాయ‌డ్ 13 కొత్త వ‌ర్ష‌న్‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌

ఆయన మాట్లాడుతూ.. ‘750,000 మందికి పైగా సంతోషకరమైన కస్టమర్‌లతో, ఎర్టిగా భారతదేశ MPV మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. స్టైల్, స్పేస్, టెక్నాలజీ, భద్రత, సౌకర్యం, కలిసి ప్రయాణించే సౌలభ్యాన్ని పునర్నిర్వచించే నెక్స్ట్ జనరేషన్‌ ఎర్టిగాను పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్‌ ఎర్టిగాలో ఆలోచనాత్మకమైన కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్ చేసిన పవర్‌ట్రెయిన్, అధునాతన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్‌ ఎర్టిగా కస్టమర్‌లను మరింత ఆహ్లాదాన్ని పంచుతుంది. వారి ప్రియమైన వారితో కలిసి సౌకర్యవంతంగా సుదీర్ఘ ప్రయాణాలు చేపట్టే అవకాశం కల్పిస్తుంది. మరింత ఇంధన సమర్థవంతమైన, శక్తివంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన, స్టైలిష్ ఉంటుందని విశ్వసిస్తున్నాం’ అని చెప్పారు.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో అత్యంత ఇష్టపడే MPVలలో ఒకటిగా మార్కెట్‌లో తిరుగులేని గుర్తింపు ఎర్టిగా సాధించిన విజయం. ప్రియమైన వారి భద్రతకు భరోసా నిస్తూ ఆనందదాయకమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి సరికొత్త K-సిరీస్ సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్, ఆధునిక ఫీచర్లతో చక్కగా రూపొందించాం. నెక్స్ట్ జనరేషన్‌ ఎర్టిగా కస్టమర్ అంచనాలను అందుకొంటుది. అనేక భారతీయ కుటుంబాల ప్రాధాన్య ఎంపికగా కొనసాగుతుందని కచ్చితంగా నమ్ముతున్నాం.’ అని వివరించారు.

First published:

Tags: Maruti cars, MARUTI SUZUKI, Motor Cycle, New cars

ఉత్తమ కథలు