2018లో చివరి రోజు కూడా తగ్గిన పెట్రోలు ధర...
2018లో మనం కాస్త సంతోషపడే విషయం ఏదైనా ఉందా అంటే... అది పెట్రోల్ ధరలు తగ్గుతుండటమే. లక్కీగా ఈ చివరి రోజు కూడా కాస్త తగ్గింది. ఓవరాల్‌గా ఈ నెలలో రూ.4కు పైగా ధర తగ్గింది. న్యూఇయర్ వేడుకల్లో ఇంకో రెండు రౌండ్లు ఎక్కువ తిరగొచ్చన్నమాట.

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: December 31, 2018, 3:12 PM IST
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఫలితంగా దేశీయ పెట్రోల్ కంపెనీలు కూడా రేట్లు తగ్గిస్తున్నాయి. 2018లో ఇవాళ చివరి రోజు కదా. ఈ రోజు కూడా పెట్రోలు, డీజెల్ ధరలు తగ్గాయి. ఈ సంవత్సరంలోనే అత్యంత తక్కువ ధరకు 'పెట్రో' ఉత్పత్తులు దిగివచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.68.84 కాగా, డీజిల్ రేటు రూ.62.86కు తగ్గింది. ఇక ముంబైలో పెట్రోలు రూ. 74.47, డీజిల్ రూ. 65.76గా ఉంది. మూడు నెలల కిందట ముంబైలో పెట్రోలు ధర రూ.90ని దాటింది. అది అప్పుడు దేశంలోనే అత్యంత ఎక్కువగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో పెట్రో ధరలపై కేంద్రం కళ్లెం వేసింది. ఎన్నికల తర్వాత ఒపెక్ దేశాల మధ్య ఒప్పందాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. అందువల్ల చమురు కంపెనీలు ధరలను తగ్గిస్తున్నాయి. ఓవరాల్‌గా డిసెంబర్లో పెట్రోలు, డీజిల్ ధరలు రూ.4పైగానే తగ్గాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను సడలించాక, క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 23 పైసలు తగ్గి రూ.73.22కు లభిస్తోంది. అలాగే డీజిల్ 25 పైసలు తగ్గి రూ.68.57లుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.77 ఉండగా, డీజిల్ రూ.67.78గా చెబుతున్నారు. మొత్తానికి కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ ధరలు బాగా తగ్గాయి. ఆ తర్వాత విపరీతంగా పెరిగాయి కూడా. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో తగ్గుతున్నాయి. ఈ తగ్గింపు వెనక కేంద్రం చేసిందేమీ లేదు. అంతర్జాతీయ పరిణామాల వల్లే తగ్గుతున్నాయి.
మీ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?
ALERT: త్వరలో మీ డ్రైవింగ్ లైసెన్స్ మారనుంది తెలుసా?
నిరుద్యోగులకు శుభవార్త... బ్యాంకింగ్ రంగంలో లక్ష ఉద్యోగాలు

పెట్రోల్ బంక్ (ఫైల్ ఫొటో)
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 23 పైసలు తగ్గి రూ.73.22కు లభిస్తోంది. అలాగే డీజిల్ 25 పైసలు తగ్గి రూ.68.57లుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.77 ఉండగా, డీజిల్ రూ.67.78గా చెబుతున్నారు. మొత్తానికి కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ ధరలు బాగా తగ్గాయి. ఆ తర్వాత విపరీతంగా పెరిగాయి కూడా. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో తగ్గుతున్నాయి. ఈ తగ్గింపు వెనక కేంద్రం చేసిందేమీ లేదు. అంతర్జాతీయ పరిణామాల వల్లే తగ్గుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
విజయవాడలో దారుణం... భార్యను చంపబోయిన భర్తకు షాక్
Petrol Price today: వరుసగా 5వ రోజు మండిన పెట్రోల్ ధర...లీటర్ రూ.80 పై మాటే...
పెట్రోల్ ధరల పెంపులో కొత్త రికార్డు...వరుసగా నాలుగో రోజు కూడా..
Petrol Price: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...వినియోగదారులకు స్వల్ప ఊరట
లీటర్‌కు రూ.5 పెరగనున్న పెట్రోల్... సౌదీ సంక్షోభమే కారణం
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. రూ.7 పెరగనున్న పెట్రోల్ ధరలు..
ALERT: త్వరలో మీ డ్రైవింగ్ లైసెన్స్ మారనుంది తెలుసా?
నిరుద్యోగులకు శుభవార్త... బ్యాంకింగ్ రంగంలో లక్ష ఉద్యోగాలు
Loading...