Home /News /business /

NEWS INCOME TAX RETURN FILING LATE FILING FEES RS 5000 FILE ITR BY THIS DATE HERE IS HOW GH VB

Income Tax Return Filing: ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆ రోజే చివరి తేదీ.. లేదంటే భారీ ఫైన్​.. ఆన్​లైన్​లో ఇలా దాఖలు చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Income Tax Return Filing: ఆదాయపు పన్ను రిటర్న్స్(Income Tax Return Filing) దాఖలు గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా దాఖలు చేయనివారికి సెప్టెంబర్ (September) 30 వరకు అవకాశం ఇచ్చింది. ఈ లోపు ఐటీ రిటర్న్(IT Returns)​ దాఖలు చేస్తే ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయ శాఖ తెలిపింది.

ఇంకా చదవండి ...
ఆదాయపు పన్ను రిటర్న్స్(Income Tax Return Filing) దాఖలు గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా దాఖలు చేయనివారికి సెప్టెంబర్ (September) 30 వరకు అవకాశం ఇచ్చింది. ఈ లోపు ఐటీ రిటర్న్(IT Returns)​ దాఖలు చేస్తే ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయ శాఖ తెలిపింది. అయితే, గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయడంలో విఫలమైతే, సెక్షన్ 139 (1) ప్రకారం రూ. 5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో వ్యక్తి ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉంటే,, వారు ఆలస్యంగా ఐటీఆర్​ దాఖలు చేసినందుకు గాను రూ .1,000 చెల్లిస్తే సరిపోతుంది.

Etala Rajender: అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రా.. నేనే అన్ని ఏర్పాట్లు చేస్తానన్న ఈటల వెనుక అంతర్యం ఏమిటి..?

రూ. 5 లక్షలకు మించి ఆదాయం(Income) పొందే వ్యక్తులకు మాత్రమే రూ. 5,000 ఆలస్యపు రుసుము వర్తిస్తుంది. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐటీఆర్​ దాఖలు కోసం కొత్త ఈ–ఫైలింగ్​ పోర్టల్​ను ప్రారంభించింది. దానిలో వ్యక్తులు స్వయంగా ఐటీఆర్​ దాఖలు చేయవచ్చు.

Income Source: ప్రతీ నెల రూ.200 పొదుపుతో.. రూ.28 లక్షల వరకు పొందొచ్చు.. వివరాలిలా..

ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆదాయ రిటర్న్ ఫైల్ చేయడం ఎలా కింది పద్దతులను ఫాలో అవ్వండి..

1. ఆదాయ రిటర్న్ ఈ–ఫైలింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in ను సందర్శించండి.
2. యూజర్ ఐడి (PAN), పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్​ చేయడం ద్వారా ఈ–ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత 'లాగిన్'పై క్లిక్ చేయండి.
3. 'ఈ–ఫైల్' మెనూలోకి వెళ్లండి. అందులోని 'ఆదాయపు పన్ను రిటర్న్' లింక్‌పై క్లిక్ చేయండి.

Smart Air-purifier: భారతీయుల ప్రతిభ.. మొక్కతో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ తయారీ.. ఎలా పని చేస్తుందంటే? 

4. ఆదాయపు పన్ను రిటర్న్ పేజీలో మీ పాన్ వివరాలు ఆటోమేటిక్​గా కనిపిస్తాయి. ఆ తర్వాత 'అసెస్‌మెంట్ ఇయర్'ను ఎంచుకోండి, 'ITR ఫారం నంబర్'ను సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ'ఫైలింగ్ టైప్'ను 'ఒరిజినల్/రివైజ్డ్ రిటర్న్' గా ఎంచుకోండి.
5. ఆ తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి.
6. సూచనలు జాగ్రత్తగా చదవండి. ఆన్​లైన్​ ఐటీఆర్​ ఫారమ్​లోని అన్ని తప్పనిసరి ఫీల్డ్​లను పూరించండి.

Airlines: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే విమాన టికెట్.. ఎలా పొందాలంటే..

7. ‘టాక్స్​పెయిడ్​ అండ్​ వెరిఫికేషన్’ ట్యాబ్​లో తగిన వెరిఫికేషన్​ ఆప్షన్లను ఎంచుకోండి.
8. ప్రివ్యూ అండ్​ సబ్​మిట్​ బటన్​పై క్లిక్​ చేయండి. మీ ఐటీఆర్​లో నమోదు చేసిన మొత్తం డేటాను ధృవీకరించండి.
9. ఐటీఆర్​ను సబ్​మిట్​ చేయండి.
Published by:Veera Babu
First published:

Tags: Income, Income tax, ITR

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు