హోమ్ /వార్తలు /బిజినెస్ /

న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేన్ లోకి డిజిటల్ మీడియా.. NBDAగా మారిన NBA.. వివరాలివే..

న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేన్ లోకి డిజిటల్ మీడియా.. NBDAగా మారిన NBA.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్నాలజీ వినియోగం పెరగడంతో డిజిటల్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ఆ మీడియాకు ప్రాధాన్యం అధికమైంది. ఈ నేపథ్యంలో నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(NBA) న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్(NBDA)గా మారింది.

  న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేన్ (NBA) తన పేరును మార్చుకుంది. న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్(NBDA)గా దీనిని మార్చారు. NBA దేశంలోని టాప్ రేటింగ్ న్యూస్ ఛానల్స్ ను కలిగి ఉంది. 80 శాతం న్యూస్ టెలివిజన్ వ్యూయర్ షిప్ పై కంట్రోల్ NBA కు ఉంది. అయితే.. టెక్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా వీక్షకులు వివిధ మాధ్యమాల ద్వారా అనేక వార్తలు, సమాచారం, వివిధ అంశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నారు. దీంతో డిజిటల్ కు ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో NBA పేరును NBDA గా మార్చారు. దీంతో డిజిటల్ మీడియా న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ NBAలోకి చేరనుంది. ఈ అంశంపై NBA అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. NBA తన పరిధిలోకి డిజిటల్ న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ను చేర్చుకోవాలని నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో NBA పేరును NBDA గా మార్చినట్లు వివరించారు.

  NDBA బ్రాడ్ కాస్ట్, డిజిటల్ మీడియాకు ఉమ్మడి గొంతుక అవుతుందని తాను భావిస్తున్నానన్నారు. వాణిజ్య మరియు నియంత్రణ సమస్యలతో పాటు, భారత రాజ్యాంగంలో మీడియాకు హామీ ఇవ్వబడిన స్వేచ్ఛను పరిరక్షించడానికి అసోసియేషన్‌ పని చేస్తోందన్నారు. ఇదిలా ఉంటే 14 ఏళ్ల క్రితం స్వతంత్ర స్వీయ నియంత్రణ సంస్థ అయిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టండర్డ్స్ అథారిటీ(NBSA)ని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(NBA) స్థాపించింది. ప్రసార నాణ్యతను మెరుగుపరచడానికి కృషి చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు ప్రముఖ వ్యక్తుల నేతృత్వంలోని ఒక ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాన్ని మరియు ప్రక్రియను ఏర్పాటు చేసింది.

  బ్రాడ్ కాస్టింగ్ ప్రమాణాలు పెంచేందుకు ఇది కృషి చేస్తోంది.  ప్రస్తుతం డిజిటల్ మీడియా చేరికతో NBA పేరు NDBAగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూస్ బ్రాడ్ కస్టర్స్ స్టాండర్డ్ అథారిటీ(NBSA) పేరును సైతం మార్చారు. దీనిని న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ & డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ(NBDSA) గా మారింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Digital media, Google news, News18

  ఉత్తమ కథలు