Yamaha R15: భారత మార్కెట్​లోకి యమహా R15 స్పోర్ట్స్​ బైక్​, ఏరోక్స్ మాక్సి స్కూటర్​ లాంచ్..  ధర, ఫీచర్ల వివరాలివే!

ప్రతీకాత్మకచిత్రం

ఆర్​ 15తో పాటు ఏరోక్స్ స్కూటర్‌, మోటో జీపీ స్కూటర్లను కూడా యమహా ఆవిష్కరించింది. ఇతర కంపెనీలకు చెందిన స్పోర్ట్స్​ బైక్​, స్కూటర్లతో పోలిస్తే ఈ మోడల్స్​ ధర తక్కువగా ఉండటం విశేషం.

  • Share this:
స్పోర్ట్స్​ బైక్​ లవర్స్​ ఎంతగానో ఎదురుచూస్తోన్న యమహా R15 బైక్ భారత మార్కెట్​లోకి విడుదలైంది. ఈ​ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్, హై-స్పెక్ ఎం అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఆర్​ 15తో పాటు ఏరోక్స్ స్కూటర్‌, మోటో జీపీ స్కూటర్లను కూడా యమహా ఆవిష్కరించింది. ఇతర కంపెనీలకు చెందిన స్పోర్ట్స్​ బైక్​, స్కూటర్లతో పోలిస్తే ఈ మోడల్స్​ ధర తక్కువగా ఉండటం విశేషం.

యమహా ఆర్​ 15 మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుండగా.. R15 మెటాలిక్ రెడ్ మోడల్​ రూ. 1,67,800, R15 డార్క్​ నైట్​ మోడల్​ రూ. 1,68,800, R15 రేసింగ్​ బ్లూ మోడల్​ రూ. 1,72,800, R15 ఎమ్​ మోడల్​ రూ. 1,77,800, R15 ఎమ్​ మోటోజీపి ఎడిషన్​ రూ. 1,79,800 ధర వద్ద అందుబాటులో ఉంటాయి.

న్యూ యమహా ఏరోక్స్ మోడల్​ రూ. 1,29,000, ఏరాక్స్​ మోటోజీపీ ఎడిషన్​ రూ. 1,30,500 ధర వద్ద లభిస్తుంది. యమాహా మోటోజీపీ ఎడిషన్​ ధర విషయానికి వస్తే.. RayZR మోటోజీపీ ఎడిషన్​ రూ. 81,300, FZ-25 మోటోజీపీ ఎడిషన్​ రూ. 1,36,800, MT-15 మోటో జీపీ ఎడిషన్​ రూ. 1,48,900 ధర వద్ద అందుబాటులో ఉంటాయి.

యమహా R15 ఫీచర్లు
కొత్త యమహా R15 అవుట్‌గోయింగ్ మోడల్ కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇది LED హెచ్​ ల్యాంప్‌ సెటప్​తో వస్తుంది. దీనిలో ఫెయిరింగ్, మజిల్​ ఫ్యుయల్​ ట్యాంక్, పొడవైన విండ్‌స్క్రీన్‌ వంటివి చేర్చింది. R15 సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్​తో వస్తుందని, ఇది రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని యమహా పేర్కొంది.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం దీనిలో బ్లూటూత్‌, Y- కనెక్ట్ సిస్టమ్‌ను అందించింది. ఈ సూట్ కాల్, మెసేజ్ అలర్ట్​, ఇంధన వినియోగ వివరాలు, ఇంజిన్ ఆర్‌పిఎమ్, యాక్సలిరేషన్​ రేటు, రియల్ టైమ్ ఇంధన వినియోగం, మాల్​ఫంక్షన్​ నోటిఫికేషన్, బైక్‌ లొకేటర్​, పార్కింగ్ రికార్డు, రైడింగ్ హిస్టరీ వంటి అద్భుతమైన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. ఈ బైక్​లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను సంస్థ అమర్చింది. కొత్త R15 మోడల్​ 155 cc లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్​తో వస్తుంది. ఇది 14 Nm, 18 bhp టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఏరోక్స్ ఫీచర్లు
యమహా ఏరోక్స్ మాక్సీ స్కూటర్​ 155 cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్​తో వస్తుంది. ఈ ఇంజిన్​ 15 బిహెచ్‌పి, 14 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్‌, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్, స్వింగార్మ్‌ ఫీచర్లు దీని సొంతం. LED హెడ్‌ల్యాంప్, పెద్ద ఫ్లోర్‌బోర్డ్, పొడవాటి హ్యాండిల్‌బార్లు, విశాలమైన స్టెప్-అప్ సీటు, సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్‌ వంటి ఫీచర్లను ఈ మోడల్‌లో యమహా అందించింది.

వీటితోపాటు టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ట్రిప్ మీటర్, ఏబీఎస్ ఇండికేటర్ మొదలైన ఫీచర్లను కూడా చేర్చింది. మరోవైపు, దీనిలోని ఎల్ఈడీ డిస్‌ప్లే ప్రమాద హెచ్చరిక, పార్కింగ్ రికార్డ్, రైడింగ్ చరిత్ర మొదలైన వాటిని ఎప్పటిప్పుడు అప్​డేట్​ చేస్తాయి. ఈ ఫీచర్లన్నీ సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలంగా చేస్తాయి.
Published by:Krishna Adithya
First published: