Honda Activa: రాబోయే పండుగ సీజన్లో హోండా యాక్టివా నుంచి రెండు కొత్త వేరియంట్లు.. ధర, ఫీచర్ల వివరాలివే!

ప్రతీకాత్మకచిత్రం

హోండా యాక్టివా 6 జి రెండు కొత్త వేరియంట్లలో రానుండగా, డియో స్కూటర్ మాత్రం నాలుగు కొత్త వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ రెండు మోడల్స్​లో ఒకే రకమైన 109.51cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించడం విశేషం.

  • Share this:
Honda Activa: దసరా, దీపావళి పండుగ సీజన్ సమీపిస్తుండటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు పోటాపోటీగా వాహనాలను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నాయి.​ ఇందులో భాగంగానే ఆటో దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ స్కూటర్ ఇండియా (HMSI) సరికొత్త Honda Activa యాక్టివా, డియో స్కూటర్లను లాంచ్​ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఢిల్లీ ఆర్‌టిఓకు దాఖలు చేసిన టైప్ అప్రూవల్ డాక్యుమెంట్లను సబ్​మిట్​ చేసినట్లు సమాచారం. హోండా యాక్టివా 6 జి రెండు కొత్త వేరియంట్లలో రానుండగా, డియో స్కూటర్ మాత్రం నాలుగు కొత్త వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ రెండు మోడల్స్​లో ఒకే రకమైన 109.51cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించడం విశేషం. యాక్టివా 6జిలోని ఇంజిన్​ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 హెచ్‌పి, 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.79 ఎన్‌ఎమ్‌ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, డియో వేరియంట్​లో ఉపయోగించే ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.65 హెచ్‌పి, 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ని ఉత్పత్తి చేస్తుంది. టైప్ అప్రూవల్ డాక్యుమెంట్ ప్రకారం, యాక్టివా 6జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. యాక్టివా 6 జి, యాక్టివా 6 జి ఎల్‌ఈడి అనే రెండు కొత్త వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అలాగే, కంపెనీ ఇప్పటికే స్టీల్​ వీల్స్​ గల యాక్టివా 6G మోడల్​ను విక్రయిస్తోంది. ఇప్పుడు, కొత్తగా అల్లాయ్ వీల్స్‌ గల యాక్టివా 6జీ మోడల్​ను పరిచయం చేయనుంది.

ఇది చదవండి...Home Loan: ప్రముఖ బ్యాంకుల ఫెస్టివల్ బొనంజా.. తక్కువ వడ్డీకే గృహ రుణాలు.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అంటే?

పండుగ సీజన్​కు ముందే మార్కెట్​లోకి..

ఇక, హోండా యాక్టివా నుంచి డియో మోడల్​ కూడా విడుదల కానుంది. ఈ మోడల్​ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ డియో మోడల్​లో డియో విత్ - కాంపోజిట్ కాస్ట్ వీల్స్, డిజిటల్ స్పీడోమీటర్, కాంపోజిట్ కాస్ట్ వీల్, 3 డి ఎంబెల్మ్, డిజిటల్ స్పీడోమీటర్, 3 డి ఎంబెల్మ్ వంటి ఫీచర్లను చేర్చనుంది. కాగా, హోండా యాక్టివా ప్రస్తుతం విక్రయిస్తున్న మోడళ్లలో రెప్సోల్ హోండా ఎడిషన్ మాత్రమే అల్లాయ్ వీల్స్ కలిగి ఉన్న ఏకైక వేరియంట్​గా చెప్పవచ్చు. ఈ రెండు హోండా వేరియంట్లు రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్​లోకి విడుదలకానున్నాయని మార్కెట్​ విశ్లేషకులు చెబుతున్నారు. పండుగ సీజన్​కి ముందే ఇవి విడుదయ్యే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో వేరియంట్ల ధర, ఫీచర్లకు సంబంధిచిన అన్ని విషయాలు తెలుస్తాయి.
Published by:Krishna Adithya
First published: