NEW UTON ENERGIA COMES UP WITH LOW COST EV FOR SHORT TRAVEL MK
Electric Bike: రూ.2 లతో 65 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్ లోకి ఉటన్ ఎనర్జియా బైక్..
ప్రతీకాత్మకచిత్రం
అతి తక్కువ ఖర్చుతో చాలా ఎలక్ట్రికల్ బైక్ లు ఇప్పటికే మార్కెట్ లో వచ్చినప్పటికీ ఇంకా చాలా సౌకర్యవంతంగా ఎక్కువ కీలోమీటర్లు ప్రయాణించడానికి వీలుగా బైక్ ను నగరానికి చెందిన స్టార్ట్ఫ్ ఉటన్ ఎనర్జియా అనే సంస్థ రూపొందించింది. కేవలం ఒక గంటపాటు చార్జ్ చేస్తే దాదాపు 65 కిలోమీటర్ల వరకు ఈ బైక్ పై ప్రయాణించడానికి వీలవుతుందని అంటున్నారు సంస్థ ప్రతినిధులు.
ముఖ్యంగా ఇంట్లో అవసరాల కోసం ఉపయోగించే విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించడమే లక్ష్యంగా వాహనాలను రూపొందిస్తున్నాయి. నగరానికి చెందిన పలు స్టార్టప్ కంపెనీలు. ఇప్పటికే అతి తక్కువ ఖర్చుతో చాలా ఎలక్ట్రికల్ బైక్ లు ఇప్పటికే మార్కెట్ లో వచ్చినప్పటికీ ఇంకా చాలా సౌకర్యవంతంగా ఎక్కువ కీలోమీటర్లు ప్రయాణించడానికి వీలుగా బైక్ ను నగరానికి చెందిన స్టార్ట్ఫ్ ఉటన్ ఎనర్జియా అనే సంస్థ రూపొందించింది. కేవలం ఒక గంటపాటు చార్జ్ చేస్తే దాదాపు 65 కిలోమీటర్ల వరకు ఈ బైక్ పై ప్రయాణించడానికి వీలవుతుందని అంటున్నారు సంస్థ ప్రతినిధులు. పొర్టీఫైవ్(Forty five)అనే పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ బైక్ కి ఇప్పుడు ఆన్ లైన్ లో బుకింగ్స్ కూడా మొదలైయ్యాయి. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్ ఒక్కసారి చార్జీ చేస్తే దాదాపు 65 నుంచి 70 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో పాటు చార్జీ చేయాడానికి కేవలం ఒక్కటి లేదా రెండు యూనిట్ పవర్ మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధిలు. అంటే కేవలం 5 రూపాయిల లోపే అన్న మాట.
ఐదు రూపాయిలతో దాదాపు 65 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి వీలవుతుందని. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఏ బైక్ కూడా ఇంత సౌకర్యవంతంగా ఇంత తక్కువ ధరలో లేదని ఉటన్ ఎనర్జిజా సంస్థ లోని ఈ బైక్ ను తయారు చేసిన హర్షవర్దన్ తెలిపారు. 20x4 సైజ్ లో ఉండే ఈ బైక్ టైర్లు మనం రోజు వాడే బైక్ టైర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. అందువలన ఈ బైక్ ఎలాంటి ప్రతికూల మార్గాల్లో అయిన ఈజీ ప్రయాణించడానికి కుదురుతుందని అంటున్నారు. పూర్తీ స్థాయి బ్యాటరీ బేకఫ్ తో వచ్చే ఈ బైక్ ప్రస్తుతం 35 వేల రూపాయిలకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. కంపెనీకి చెందిన వెబ్ సైట్ లో 9,999 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించారు సంస్థ ప్రతినిధులు.
మార్కెట్లోకి కొత్తగా విడుదలైన ఫోర్టీ ఫైవ్ (Fortyfive) ఎలక్ట్రిక్ బైక్
ప్రస్తుతానికి రెండు కలర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని భవిష్యత్ లో మరిన్నికలర్స్ అందుబాటులో ఉంటాయిని అంటున్నారు. ఈ బైక్ లో 675 వాల్ట్ బ్యాటరీని పొందుపర్చారు. బైకర్ చార్జ్ చేయాడానికి ప్రత్యేకమైక ఫ్లగ్ లాంటిది అవసరం లేకుండానే మనం నిత్యం ఫోన్ చార్జింగ్ చేసుకునే సాకెట్ నుంచే చార్జ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.