హోమ్ /వార్తలు /బిజినెస్ /

TVS Jupiter Classic: మార్కెట్‌లోకి సరికొత్త టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతో తెలుసా? 

TVS Jupiter Classic: మార్కెట్‌లోకి సరికొత్త టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతో తెలుసా? 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ మార్కెట్‌లో జూపిటర్ స్కూటర్ల అమ్మకాలు 50 లక్షల మైలురాయిని దాటాయి. ఈ సందర్భంగా జూపిటర్ స్పెషల్ ఎడిషన్‌ను టీవీఎస్ మోటార్స్ (TVS Motors) లాంచ్ చేసింది. ఈ సరికొత్త వేరియంట్‌ ధర, ప్రత్యేకతలు చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ TVS నుంచి వచ్చే బైక్స్ (Bikes), స్కూటర్లకు (Scooters) ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్స్‌కు ఈ కంపెనీ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. అందుకే చాలామంది ఈ బ్రాండ్ వాహనాలపై ఆసక్తి చూపుతారు. కంపెనీ నుంచి వచ్చిన ఎన్నో మోడళ్లు లక్షల యూనిట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించాయి. తాజాగా ఇండియన్ మార్కెట్‌లో జూపిటర్ స్కూటర్ల (Jupiter Scooters) అమ్మకాలు 50 లక్షల మైలురాయిని దాటాయి. ఈ సందర్భంగా జూపిటర్ స్పెషల్ ఎడిషన్‌ను టీవీఎస్ మోటార్స్ (TVS Motors) లాంచ్ చేసింది. ఈ సరికొత్త వేరియంట్‌ ధర, ప్రత్యేకతలు చూద్దాం. టీవీఎస్ కంపెనీ నుంచి సరికొత్త జూపిటర్ క్లాసిక్ (Jupiter Classic) ఎడిషన్ స్కూటీ శుక్రవారం లాంచ్ అయింది. దీని ధర రూ.85,866(ఎక్స్-షో రూమ్) వరకు ఉంది. టీవీఎస్ జూపిటర్ స్కూటీ మార్కెట్‌లో సూపర్ సక్సెస్ అయింది. ఈ మోడల్‌ను కొనుగోలు చేసేందుకు చాలామంది వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే జూపిటర్‌ అమ్మకాలు 50 లక్షల యూనిట్లు దాటిపోయాయి.

సరికొత్త లుక్‌తో ‘క్లాసిక్’

టీవీఎస్ తీసుకొచ్చిన తాజా జూపిటర్ క్లాసిక్ ఎడిషన్‌ డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి సరికొత్తగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా స్కూటర్‌కు ‘క్లాసిక్’ వైబ్ తీసుకురావడం కోసం డైమండ్ కట్ అలాయ్-వీల్స్‌ను అమర్చారు. దాంతో పాటు వెనుక కూర్చునే వారికి వీలుగా ఉండేందుకు బ్యాక్‌రెస్ట్ సపోర్ట్ తీసుకొచ్చారు. మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయకుండా లుక్ పరంగా సరికొత్తగా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ నెక్స్ట్ జనరేషన్ అల్యూమినియం 110 సీసీ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

పెద్ద సూపర్‌బైక్‌లకు పోటీ ఇస్తున్నTVS Ronin 225..దీని ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి

నమ్మకాన్ని గౌరవిస్తూ

టీవీఎస్ జూపిటర్ అమ్మకాలు 50 లక్షలు పూర్తయిన క్రమంలో న్యూ జూపిటర్ ప్రీమియం క్లాసిక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్. టీవీఎస్ జూపిటర్ బ్రాండ్ ప్రామిస్ ‘జ్యాదా కా ఫైదా (ZYADA KA FAYDA)’కు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆధునాతనమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజన్‌తో మార్కెట్‌లోకి వచ్చిన టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ సేల్స్ మరింత కానున్నాయని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేరియంట్‌ను కూడా వినియోగదారులకు డెలివరీ చేయడంలో కచ్చితత్వం పాటిస్తామని కంపెనీ తెలిపింది.

ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లు

మార్కెట్‌లో ఈ జూపిటర్ క్లాసిక్ మిస్టిక్ గ్రే, రీగల్ పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. సాధారణ జూపిటర్ తరహాలో ఈ క్లాసిక్‌కు కూడా ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌లు ఎలక్ట్రిక్ స్టార్టర్, యుటిలిటీ బాక్స్, 21 లీటర్ల బూట్ స్పేస్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉన్నాయి. ఈ స్కూటీ థీమ్ ‘జ్యాదా కా ఫైదా’. ఈ థీమ్ ద్వారా రైడర్లకు మరింత భద్రత ఇచ్చేందుకు ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లు అందిస్తున్నారు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఇకపై స్కూటర్ పవర్ మోడ్ లేదా ఎక్ మోడ్‌లో ఉందా అనేది చూసుకోవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: New bikes, SCOOTER, Tvs

ఉత్తమ కథలు