TVS Apache RTR 180 | ప్రముఖ దేశీ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా అపాచీ ఆర్టీఆర్లో సరి కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2022 అపాచీ ఆర్టీఆర్ 160, అపాచీ ఆర్టీఆర్ 180 బైక్స్ అనేవి ఇవి. అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ మూడు వేరియంట్ల రూపంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. డ్రమ్, డిస్క్, డిస్క్ బీటీ అనేవి ఇవి. వీటి ధరలు వరుసగా రూ. 1.18 లక్షలు, రూ. 1.21 లక్షలు, రూ. 1.25 లక్షలుగా ఉన్నాయి. అలాగే అపాచీ ఆర్టీఆర్ 180 బైక్ మాత్రం డిస్క్ బీటీ వేరియంట్ రూపంలో కస్టమర్లకు లభించనుంది. దీని ధర రూ. 1.31 లక్షలు. ఈ ధరలు అన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ ఐదు రంగుల్లో లభ్యం కానుంది. గ్లాసీ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, బ్లూ, గ్రే కలర్స్‌లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. అలాగే 2022 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 బైక్ మాత్రం రెండు రంగుల్లో లభించనుంది. బ్లాక్, వైట్ రంగుల్లో ఈ బైక్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ బైక్స్‌ను స్టైలింగ్ అప్డేట్తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ రెండు టూవీలర్లలో ఆల్ న్యూ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
HDFC Bank శుభవార్త.. ఇక 10 సెకన్లలోనే వారికి లోన్?
కంపెనీ ఇంకా ఈ రెండు బైక్స్‌లో బ్లూటూత్ ఎనెబుల్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ అసిస్ట్‌తో కూడిన స్మార్ట్ఎక్స్కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లను పొందుపరిచింది. అలాగే వీటిల్లో రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. రెయిన్, అర్బన్, స్పోర్ట్ అనేవి ఇవి. ఇంకా ఈ బైక్స్‌లో చెప్పుకోదగ్గ ఫీచర్ల విషయానికి వస్తే ఎక్స్ రింగ్ చెయిన్, వైడర్ 120 ఎంఎం రియన్ టైర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, కొత్త యూఐ/యూఎక్స్తో కూడిన టీవీఎస్ కనెక్ట్ యాప్ వంటివి గమనించొచ్చు.
SBI గుడ్ న్యూస్.. పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు!
ఈ రెండు కొత్త మోడళ్లు గత మోడళ్ల కన్నా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే బరువు విషయంలో గత మోడళ్ల కన్నా తక్కువ వెయిట్ ఉన్నాయి. అపాచీ ఆర్టీఆర్ 160లో 159.7 సీసీ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అలాగే అపాచీ ఆర్టీఆర్ 180లో అయితే కంపెనీ 177.4 సీసీ ఇంజిన్ అమర్చింది. రెండింటిలోనూ 5 గేర్లు ఉంటాయి. కాగా కంపెనీ రేసింగ్ ఫ్లాట్‌ఫామ్ మీద అపాచీ ఆర్టీఆర్ బైక్స్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Bikes, New bike, Tvs, Two wheelers