Toyota Vellfire: మార్కెట్‌లోకి మరో లగ్జరీ వాహనం... 'టొయోటా వెల్‌ఫైర్' రిలీజ్

Toyota Vellfire | వచ్చే మూడు నెలల వరకు 'టొయోటా వెల్‌ఫైర్' బుకింగ్స్ పూర్తయ్యాయి. ప్రతీ నెల 60 యూనిట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేస్తోంది టొయోటా. భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్‌కు 'టొయోటా వెల్‌ఫైర్' గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

news18-telugu
Updated: February 26, 2020, 4:18 PM IST
Toyota Vellfire: మార్కెట్‌లోకి మరో లగ్జరీ వాహనం... 'టొయోటా వెల్‌ఫైర్' రిలీజ్
Toyota Vellfire: మార్కెట్‌లోకి మరో లగ్జరీ వాహనం... 'టొయోటా వెల్‌ఫైర్' రిలీజ్ (image: Toyota India)
  • Share this:
ఇండియన్ ఫోర్ వీలర్ మార్కెట్లోకి మరో లగ్జరీ వాహనం వచ్చేసింది. టొయోటా నుంచి లగ్జరీ ఎంపీవీ వెల్‌ఫైర్ రిలీజ్ అయింది. ఈ వాహనం ఎక్స్ షోరూమ్ ధర రూ.79.50 లక్షలు. హై స్పెసిఫికేషన్స్‌తో ఒకే వేరియంట్ రిలీజైంది. ఈ మల్టీపర్పస్ వెహికిల్‌లో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని ప్రయాణించొచ్చు. మిడిల్ రోలో వీఐపీ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రయాణికుల భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఉండటం విశేషం. 'టొయోటా వెల్‌ఫైర్' పెరల్ వైట్, బర్నింగ్ బ్లాక్, బ్లాక్, గ్రాఫైట్ కలర్స్‌లో రిలీజ్ అయింది. ఇండియాలోని అన్ని టొయోటా డీలర్‌షిప్స్ దగ్గర 'వెల్‌ఫైర్' బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే వచ్చే మూడు నెలల వరకు బుకింగ్స్ పూర్తయ్యాయి. ప్రతీ నెల 60 యూనిట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేస్తోంది టొయోటా. భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్‌కు 'టొయోటా వెల్‌ఫైర్' గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.




'టొయోటా వెల్‌ఫైర్' వాహనంలో 2.5 పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉన్నాయి. ఈ వాహనం మైలేజీ గరిష్టంగా లీటర్‌కు 16.35 కిలోమీటర్లు. ట్విన్ సన్‌రూఫ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్‌లో కూడా 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేస్తాయి. 'టొయోటా వెల్‌ఫైర్'లో ఎలీఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. వీటితో పాటు పనోరమిక్ వ్యూ మానిటర్, వెహికిల్ డైనమిక్ మేనేజ్‌మెంట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్ ఉండటం మరో విశేషం.ఇవి కూడా చదవండి:

Rs 2000 Notes: ఏటీఎంలో రూ.2000 నోట్లు బంద్... ఎందుకో తెలుసా?

Gold Discount: బంగారంపై రూ.6,000 డిస్కౌంట్... కొనండి ఇలా

EPF-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు