Home /News /business /

Muhurat Trading: మూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఏడాది మూరత్ ట్రేడింగ్ సెషన్ సమయం ఏది ?

Muhurat Trading: మూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఏడాది మూరత్ ట్రేడింగ్ సెషన్ సమయం ఏది ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Muhurat Trading: దీపావళి సందర్భంగా రేపు.. అంటే నవంబర్ 4న గంట పాటు స్టాక్ మార్కెట్లు (BSE, NSE) మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తాయి. ఈ సెషన్ ఒక గంట పాటు ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో దీపావళి ప్రధానమైనది. అన్ని రంగాల్లోనూ దీపావళి సందడి కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాదు. దీపావళి నాడు స్టాక్ మార్కెట్లు నిర్ణీత వ్యవధిలో మాత్రమే ఓపెన్ అవుతాయి. ఈ సమయంలో నిర్వహించే ట్రేడింగ్‌ను మూరత్ ట్రేడింగ్ లేదా ముహూరత్ ట్రేడింగ్ (Muhurat Trading) అంటారు. దీపావళి సందర్భంగా రేపు.. అంటే నవంబర్ 4న గంట పాటు స్టాక్ మార్కెట్లు (BSE, NSE) మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తాయి. ఈ సెషన్ ఒక గంట పాటు ఉంటుంది. మూరత్ ట్రేడింగ్‌లో ఒక్క స్టాక్ అయినా కొనాలని ట్రేడర్లు సెంటిమెంటుగా పెట్టుకుంటారు. ఈ సమయంలో ట్రేడింగ్ చేస్తే కలిసొస్తుందనే నమ్మకంతో చాలామంది ట్రేడింగ్‌లో పాల్గొంటారు.

* మూరత్ ట్రేడింగ్ సెషన్
కొత్త స్టాక్ మార్కెట్ సంవత్సరం అయిన సంవత్ 2078 (Samvat 2078) ప్రారంభానికి గుర్తుగా మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. ఈ సమయాన్ని స్టాక్ మార్కెట్లే నిర్ణయిస్తాయి. ఈ సంవత్సరం మూరత్ ట్రేడింగ్ సెషన్ నవంబర్ 4, గురువారం సాయంత్రం 6:15 గంటలకు ప్రారంభమై రాత్రి 7:15 గంటలకు ముగుస్తుంది. ఆ తరువాత హిందూ పంచాంగం ప్రకారం ప్రత్యేక ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఇది కొత్త సంవత్ లేదా సంవత్ 2078 ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది దీపావళి నాడు ప్రారంభమయ్యే హిందూ క్యాలెండర్ సంవత్సరం. మూరత్ ట్రేడింగ్ ఏడాది పొడవునా సంపద సృష్టికి దారితీస్తుందని చాలామంది నమ్ముతారు.

* మూరత్ ట్రేడింగ్ సెషన్‌ను కొన్ని విభాగాలుగా గుర్తిస్తారు. అవేంటంటే..

ప్రీ ఓపెన్ సెషన్ (Pre Open): ఇది నవంబర్ 4న సాయంత్రం 6-6:15 వరకు ఉంటుంది.

నార్మల్ మార్కెట్ (Normal Market): ఈ సెషన్ సాయంత్రం 6:15-7:15 వరకు ఉంటుంది.

క్లోజింగ్ సెషన్ (Closing Session): ఈ సెషన్ సాయంత్రం 7:25 -7:35 వరకు కొనసాగుతుంది.

F&O, Currency (CDS), MCX ఎక్స్చేంజ్‌లలో కూడా సాయంత్రం 6:15-7:15 మధ్య ఈ సెషన్ ఉంటుంది.

* మూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి?
మూరత్ ట్రేడింగ్ అనేది దీపావళి నాడు ఒక గంట పాటు జరిగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. భారత స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు ఇది ఒక సంప్రదాయంగా వస్తోంది. ట్రేడింగ్ కమ్యూనిటీ మొత్తం మూరత్ ట్రేడింగ్ కోసం ఎదురు చూస్తుంది. మూరత్ ట్రేడింగ్ సంప్రదాయం BSEలో 1957లో.. NSEలో 1992లో ప్రారంభమైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?

గత సంవత్సరం స్పెషల్ మూరత్ ట్రేడింగ్ సెషన్ నవంబర్ 14న జరిగింది. ఆ ట్రేడింగ్ సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 43,638 వద్ద ముగియగా.. ఎన్‌ఎస్‌ఈ 12,771 వద్ద ముగిసింది. అయితే దీపావళి సందర్భంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు మూతపడనున్నాయి. BSE స్టాక్ మార్కెట్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ రోజుల్లో ఈక్విటీ, డెరివేటివ్, SLB విభాగాలలో ఎలాంటి ట్రేడింగ్ జరగదు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Diwali 2021, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు