Home /News /business /

NEW TDS RULE FROM JULY FIRST TO AFFECT DOCTORS SOCIAL MEDIA INFLUENCERS UMG GH

New TDS Rules: వైద్యులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు అలర్ట్.. జూలై 1 నుంచి వీరికి కూడా అది వర్తిస్తుంది..!

జూలై 1 నుంచి డాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్స్‌కి టీడీఎస్.

జూలై 1 నుంచి డాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్స్‌కి టీడీఎస్.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇటీవల కొత్త TDS నిబంధనలు, వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. జూలై 1 నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, డాక్టర్‌లకు సేల్స్ ప్రమోషన్ బిజినెస్‌ నుంచి పొందే ప్రయోజనాలపై ట్యాక్స్‌ డిడక్టెడ్ ఎట్‌ సోర్స్‌(TDS) వర్తిస్తుంది.

ఇంకా చదవండి ...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇటీవల కొత్త TDS నిబంధనలు, వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. జూలై 1 నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, డాక్టర్‌లకు సేల్స్ ప్రమోషన్ బిజినెస్‌ నుంచి పొందే ప్రయోజనాలపై ట్యాక్స్‌ డిడక్టెడ్ ఎట్‌ సోర్స్‌(TDS) వర్తిస్తుంది. ఆదాయపన్ను చట్టం, 1961లో కొత్త సెక్షన్, 194Rను చేర్చడం ద్వారా టాక్స్‌ రెవెన్యూ లీకేజీని చెక్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆదాయంపై TDS నిబంధనను తీసుకొచ్చింది. సంవత్సరంలో రూ.20,000 కంటే ఎక్కువ ప్రయోజనాన్ని అందించే ఏ వ్యక్తికైనా 10 శాతం TDS వర్తిస్తుంది.

ప్రయోజనాలు, పర్క్విసిట్(perquisite) కిందకి ఏవి వస్తాయి?
ఆర్థిక మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీ కమలేష్ సి వర్ష్నే ఈ ప్రయోజనాలను వివరించారు. డాక్టర్లు అందుకున్న ఉచిత మెడిసిన్ నమూనాలు, విదేశీ విమాన టిక్కెట్లు లేదా వ్యాపార సమయంలో ఉచిత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టిక్కెట్లు వంటివి మరెన్నో ఉన్నాయి. ఆదాయపన్ను రిటర్న్‌ దాఖలు చేసేటప్పుడు వీటిని బహిర్గతం చేయాలని, ఈ వస్తువులను విక్రయించడం లేదనే కారణంగా పేర్కొనకుండా ఉండకూడదని వర్ష్నే స్పష్టం చేశారు. కారు, టీవీ, కంప్యూటర్‌లు, బంగారు నాణేలు, మొబైల్ ఫోన్‌ల వంటి నగదు లేదా వస్తువులో ఉన్న డిస్కౌంట్ లేదా రిబేట్ కాకుండా ప్రోత్సాహకాలు ఇచ్చే విక్రేతకు కూడా సెక్షన్ 194R వర్తిస్తుంది.

ఇదీ చదవండి: అది అతిగా చేస్తే పురుషులకు ప్రమాదం.. మహిళలకు మాత్రం మాంచి ఎక్సర్‌సైజ్ అంటున్న పరిశోధనలు


ఒక వైద్యుడు ఆసుపత్రిలో పనిచేస్తుంటే ఎలా?
ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు వైద్యులు ఉచితంగా మందుల నమూనాలను స్వీకరిస్తే, ఆసుపత్రికి ఉచిత నమూనాల పంపిణీపై సెక్షన్ 194R వర్తిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ స్పష్టం చేసింది. ఒక యజమానిగా ఆసుపత్రి అటువంటి నమూనాలను ఉద్యోగులకు పన్ను విధించదగినదిగా పరిగణించవచ్చు, సెక్షన్ 192 కింద పన్ను మినహాయించవచ్చు. అటువంటి సందర్భాలలో ఆసుపత్రికి సంబంధించి రూ.20,000 థ్రెషోల్డ్‌ని చూడాలి. ఆసుపత్రిలో కన్సల్టెంట్‌లుగా పని చేస్తున్న వైద్యులు, ఉచిత నమూనాలను స్వీకరిస్తే.. TDS ముందుగా ఆసుపత్రికి విధిస్తారు. కన్సల్టెంట్ వైద్యులకు సంబంధించి సెక్షన్ 194R కింద పన్ను మినహాయించాల్సి ఉంటుంది.



అందిస్తున్న ఉపశమనం ఏంటి?
వ్యాపారం లేదా వృత్తిని కొనసాగించకుండా ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రభుత్వ సంస్థకు ప్రయోజనం లేదా అనుమతి అందిస్తే.. సెక్షన్ 194R వర్తించదని CBDT తెలిపింది. సేల్స్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, సెక్షన్ 194R పరిధి నుంచి కస్టమర్‌లను మినహాయించడం ద్వారా వారికి అందే రాయితీలపై కూడా ఇది వర్తిస్తుంది. వాటిని చేర్చడం వల్ల విక్రేతను ఇబ్బందుల్లోకి నెడుతుంది. మొబైల్ ఫోన్‌ల వంటి ప్రయోజనాలను రెండరింగ్ సేవ కోసం ఉపయోగించిన తర్వాత (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల విషయంలో) తయారీ కంపెనీకి తిరిగి ఇస్తే, అది కొత్త నిబంధన పరిధిలోకి రాదు.
Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, Doctors, Tax paying, Tds

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు