• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • NEW TAX REGIME KNOW INCOME TAX SLABS AND RATES AND OTHER DETAILS SU GH

New Tax Regime: కొత్త పన్ను పాలసీని ఎంచుకుంటున్నారా?.. ఆదాయపు పన్ను స్లాబ్‌లు, రేట్ల వివరాలను తెలుసుకోండి..

New Tax Regime: కొత్త పన్ను పాలసీని ఎంచుకుంటున్నారా?.. ఆదాయపు పన్ను స్లాబ్‌లు, రేట్ల వివరాలను తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో, పన్ను చెల్లింపు విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

  • Share this:
ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో, పన్ను చెల్లింపు విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే, గత ఏడాది బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ఎక్కువ పన్ను స్లాబ్‌లు, తక్కువ పన్ను రేట్లతో కూడిన పన్ను పాలసీని ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ప్రజల చేతుల్లో నగదు ఎక్కువగా ఉండేలా పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. 2021 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్​ సమావేశాల్లో మాత్రం తక్కువ పన్ను స్లాబ్​లను ప్రకటించారు. అయితే, రెండు బడ్జెట్లలోనూ రూ.2.5 లక్షల వరకు ఎటువంటి పన్ను విధించలేదు. 2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను విధించారు. పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త చెల్లింపు విధానంలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఏ విధానంతో ఎక్కువ ప్రయోజనాలు ఉంటానేది సందేహం ప్రతి పన్ను చెల్లింపుదారుడిలో ఉంటుంది.

పన్ను పాలసీని మార్చుకోవచ్చా?
కొత్త పన్ను విధానంలో తక్కువ స్లాబ్ రేట్లను ప్రకటించారు. కానీ, పన్ను చెల్లింపుదారుడు కొత్త విధానాన్ని ఎంచుకుంటే అతనికి మినహాయింపులు, ఇతర ప్రయోజనాలు లభించవు. మీరు పాత లేదా కొత్త పన్ను విధానాల్లో దేన్ని ఎంచుకున్నా సరే, మధ్యలో పన్ను విధానాన్ని మార్చుకునేందుకు అనుమతి ఉంటుంది. కొన్ని కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో మారడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

పన్ను స్లాబ్​లు ఇలా..
కొత్త పన్ను విధానంలో 5, 10, 15, 20, 25 30 శాతం పన్ను స్లాబ్​లలో పెంపును అందుబాటులోకి తెచ్చారు. 15 లక్షలకు పైగా ఆదాయం సంపాదించే వారికి 30 శాతం పన్ను విధించారు. అదే పాత విధానం ప్రకారం 5, 20, 30 శాతం పన్ను పెంపును మాత్రమే చేర్చారు. పన్ను చెల్లింపుదారుడు డిడక్షన్లను, మినహాయింపులను సద్వినియోగం చేసుకోకపోతే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడమే మంచింది. ఎందుకంటే, అలాంటి వారికి తక్కువ పన్ను రేటు వర్తిస్తుందని ట్యాక్స్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. పాత పన్ను విధానంలో పన్ను రేట్లు చాలా ఎక్కువని, మినహాయింపులు కూడా లేవని పేర్కొంటున్నారు.

కాగా, పాత పన్ను విధానంలో 2.5 నుండి 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 5 శాతం, 5 నుండి 10 లక్షల ఆదాయం ఉన్న వారికి 20 శాతం, 10 లక్షలకు పైబడిన వారికి 30 శాతం పన్ను విధించబడుతుంది. కానీ, పన్ను చెల్లింపుదారుడు కొత్త పన్ను వ్యవస్థను ఎంచుకుంటే, వారు 70 రకాల తగ్గింపులు, మినహాయింపులు వదులుకోవాల్సి ఉంటుంది. డిడెక్షన్ లిమిట్​ పెరిగే పన్ను చెల్లింపుదారులకు పాత పద్ధతితోనే మేలని నిపుణులు పేర్కొంటున్నారు. డిడెక్షన్​ రూపంలో రూ .50 వేల హెచ్‌ఆర్‌ఏ భత్యం తగ్గింపు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సహకారం కారణంగా సెక్షన్ 80 సి కింద తగ్గింపును పొందవచ్చు.

ఇవి మొత్తంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 80సి కింద 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, మీ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులతో లేదా మీ స్వంత ఇంటిలో ఉన్నప్పుడు, మీరు HRA తగ్గింపును క్లెయిమ్ చేయలేరని గుర్తించుకోండి.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు