news18-telugu
Updated: November 17, 2020, 6:12 PM IST
ప్రతీకాత్మకచిత్రం
స్కోడా కార్లో రయ్ మని దూసుకుపోవడం మీ కలా? మీరు కూడా హై ఎండ్ స్కోడా కార్ సొంతం చేసుకునే చాన్స్ వచ్చింది. రోజూ మీరు స్కోడా కార్ లోనే ఆఫీసుకు వెళ్లచ్చు, షాపింగ్, ఔటింగ్ ఇలా ఎక్కడికైనా తిరగచ్చు. అదెలా అంత డబ్బు నాతో లేదే అని దిగులు పడకండి. మీలాంటి వారికోసమే కార్లు లీజుకు (leased cars) ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటికే లీజుకిచ్చే సేవల విధానాన్ని సుజుకితో పాటు పలు కంపెనీలు మనదేశంలో మొదలు పెట్టగా తాజాగా స్కోడా కూడా ఇదే బాటలో నడుస్తోంది. మంత్లీ రెంటల్ (monthly rental) కింద రూ.22.580 చెల్లిస్తే చాలు కనీసం 24-60 నెలల పాటు హ్యాపీగా మీరు స్కోడా కార్ లో షికార్లు కొట్టచ్చు. Skoda Rapid, Skoda superb modelsను లీజుకు ఇస్తున్నట్టు ఇది కార్పొరేట్, రీటైల్ కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటుందని సంస్థ ప్రకటించింది. నెలవారీ అద్దె చెల్లింపు కింద 24, 36, 48, 60 నెలల పాటు Rapid TSI , Superb modelsను Skoda పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తెచ్చింది. ఎండ్ టు ఎండ్ మెయిన్ టెనన్స్ కింద రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, బ్రేక్ డౌన్ అసిస్టెంట్, యాక్సిడెంటల్ రిపేర్స్ అన్నీ సంస్థనే చూసుకుంటుంది. INDIA 2.0 project కింద దీన్ని లాంచ్ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఓరిక్స్ ఇండియా సౌజన్యంతో స్కోడా ఆటో ఇండియా ఈ సేవలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
క్లెవర్ లీజ్clever lease పేరుతో మొత్తం 8 సిటీల్లో స్కోడా లీజు కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబై, పూనే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో మీరిక స్కోడా కార్లు లీజుకు తీసుకుని ఎంజాయ్ చేయచ్చు. మరో రెండేళ్లలో ఈ లీజింగ్ సంస్కృతి (leasing culture) మార్కెట్లో విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ వివరించారు.
తగ్గుతున్న కార్ సేల్స్
ఓవైపు ఎంత సూపర్ డూపర్ ఆఫర్లు పెట్టినా కార్ సేల్స్ మన మార్కెట్లో బాగా పడిపోతున్నాయి. ఈనేపథ్యంలో రెంటల్, లీజింగ్ కార్స్ కు అనూహ్యంగా డిమాండ్ పెరుగుతోంది. అది కూడా హైఎండ్ మోడల్స్ కు ఇలాంటి గిరాకీ బాగా ఉంటోంది. విదేశాల్లో ఇది ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఈ వ్యాపారం మనదేశంలో పుంజుకుంటోంది. ఓ మోడల్ కారు మీకు బోర్ కొట్టింది అనగానే మరో మోడల్ కారుకు అప్ గ్రేడ్ (car upgrade) కూడా అయ్యే సదుపాయం ఉండటంతో మార్కెట్లో కొత్తగా వచ్చిన మోడల్స్ ను మీరు కొంతకాలంపాటు సొంతం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు నచ్చిన మోడల్ డ్రైవ్ చేసే చాన్స్ దిరికే ఆప్షన్ ఇదే. హ్యూండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా సుజుకి ఈ రంగంలోకి దిగగా మరిన్ని సంస్థలు లీజింగ్ రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇలాంటి లీజింగ్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తూ, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా శరవేగంగా విస్తరిస్తే హయ్యర్ మిడిల్ క్లాస్ ను ఆకట్టుకోవచ్చని కార్ల కంపెనీలు దీర్ఘకాల ప్రణాళికలు సిద్ధం చేసాయి. రెంటల్ కార్లు, ట్యాక్సీల కంటే కార్లను లీజుకు తీసుకోవడం ఉత్తమమని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హోటల్ ఇండస్ట్రీని కూడా దీనికి అనుసంధానం చేస్తున్నారు.
Published by:
Krishna Adithya
First published:
November 17, 2020, 6:12 PM IST