Post Office Scheme: పోస్టాఫీస్ లో కొత్త పథకం.. డబ్బును డబుల్ చేసే స్కీమ్.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Post Office Scheme: ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ కోసం రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రిస్క్ (నష్టభయం) ఉండటంతో చాలామంది పెట్టుబడులు చేయడానికి భయపడుతుంటారు. అయితే రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ మెంట్ చేయాలనే ఆలోచనలో ఉంటే.. వారికి కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra- KVP) మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి.

 • Share this:
  ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ కోసం రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రిస్క్ (నష్టభయం) ఉండటంతో చాలామంది పెట్టుబడులు చేయడానికి భయపడుతుంటారు. అయితే రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ మెంట్ చేయాలనే ఆలోచనలో ఉంటే.. వారికి కిసాన్ వికాస్ పత్ర(Kisan Vikas Patra- KVP) మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఈ స్కీం కింద చేసిన ఇన్వెస్ట్‌మెంట్ 124 నెలల్లో.. అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో డబుల్ అవుతుంది. ఇండియన్ పోస్ట్ ఈ స్కీంను అమలు చేస్తుండగా.. దీనితో పాటు మరికొన్ని బ్యాంకులు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి.

  Post Office Schemes: పోస్టాఫీసులో అద్భుత పథకాలు.. ఏ పథకంలో తక్కువ పెట్టుబడి.. అధిక రాబడి.. అవేంటో తెలుసుకోండి..


  ఇండియన్ పోస్ట్ 1988లో ఈ స్కీంను తీసుకురాగా.. మనీ ల్యాండరింగ్‌కు ఈ పథకం కారణమవుతోందని కొన్నాళ్లు దీనిని నిలిపివేశారు. 2011లో ప్రభుత్వ కమిటీ దీనిపై ఆలోచించి పథకం అమలుకు కొన్ని మార్పులు చేసింది. రూ.50వేల పైచిలుకు ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారి పాన్ కార్డ్ వివరాలు సేకరించడం, రూ.10లక్షల ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వారి ఆదాయ మార్గాన్ని వెల్లడించడం లాంటి నిబంధనలతో ప్రస్తుతం ఈ స్కీంను ఇండియన్ పోస్ట్ అమలు చేస్తోంది.

  అర్హత & వడ్డీరేటు
  ఈ పథకం కింద పెట్టే పెట్టుబడులపై 6.9శాతం వడ్డీ రేటును పోస్టాఫీస్ అందిస్తుంది. దేశంలో నివాసముండే భారతీయులు అందరూ ఈ స్కీంకు అర్హులు. గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు (18సంవత్సరాల పైబడిన వారు) కలిసి కిసాన్ వికాస్ పత్ర జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. అలాగే 10 సంవత్సరాల వయస్సున్న మైనర్ లేదా అతడి సంరక్షకుడు లేదా మానసికంగా ఎదగని పిల్లల సంరక్షులు మైనర్ల పేరుతో ఈ స్కీంలో భాగస్వాములు కావచ్చు. ఇందులో కనిష్టంగా రూ.1000 ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక వ్యక్తిగతంగా 18 సంవత్సరాల పైబడిన వారు ఎన్ని అకౌంట్లనైనా తెరుచుకోవచ్చు, ఎంత ఇన్వెస్ట్ మెంట్ నైనా పెట్టుకోవచ్చు.

  Photo Viral: ఆ బామ్మ చేసే పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇంతకు ఆమె ఏం చేస్తుందో తెలుసా..


  KVP (కిసాన్ వికాస్ పత్ర)ని తనఖా పెట్టడం లేదా బదిలీ చేయడం
  KVPని కలిగిన వ్యక్తి వద్ద నుంచి వచ్చే దరఖాస్తు లేఖను పోస్టాఫీసులో సమర్పించడం ద్వారా.. KVPని తనఖా పెట్టడం లేదా బదిలీ చేయడం కుదురుతుంది. కొందరు అధికారులకు, ప్రముఖులకు KVPని బదిలీ చేయవచ్చు. భారత రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్.. బ్యాంకులు, పబ్లిక్ లేదా ప్రైవేట్ కార్పోరేషన్లు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కేవీపీలను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

  అకౌంట్ ట్రాన్స్ ఫర్..
  ప్రత్యేక పరిస్థితులు/ సందర్భాల్లో KVP అకౌంట్ ఒకరి నుంచి వేరే వారి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అకౌంట్ హోల్డర్ చనిపోతే, సదరు అకౌంట్ నామినీ లేదా చట్టపరంగా హక్కుదారులకు ట్రాన్స్ ఫర్ అవుతుంది. జాయింట్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే, అకౌంట్ ను కలిగిన మిగిలిన వారికి బదిలీ అవుతుంది. కోర్టు ఆర్డర్ ద్వారా లేదా ప్రత్యేక సంస్థల ద్వారా సైతం ఇలా చేసుకోవచ్చు.

  ఆంటీని హగ్ చేసుకోవాలి.. పర్మిషన్ ఇవ్వండి.. అంటూ ఆ పసిపాప ఏం చేసిందో చూడండి.. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా..


  ప్రీమెచ్యూర్ విత్ డ్రా ..
  KVP అనేది 30 నెలల లాక్-ఇన్ పీరియడ్ తో వస్తుంది. అంటే ఈ 30 నెలల కాలంలో అకౌంట్ హోల్డర్ తన ఇన్వెస్ట్ మెంట్ ని విత్ డ్రా చేసుకోలేడు. 30 నెలలు గడిచాక ఆరు నెలల బ్లాక్ లలో తన డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రీమెచ్యూర్ విత్ డ్రా కోసమైతే అకౌంట్ హోల్డర్ పెట్టిన పెట్టుబడిలో కొంత భాగం, అకౌంట్ ని తెరిచిన కాలానికి వడ్డీని పొందగలుగుతారు.
  Published by:Veera Babu
  First published: