Home /News /business /

NEW RULES TO INVEST IN MUTUAL FUNDS FROM JULY 1ST UMG GH

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త రూల్స్.. నిపుణులు చెప్పే మాటలివే..!

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్

జులై 1 నుంచి పూల్ అకౌంట్‌ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వీలు కాదు. రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిర్దేశించిన ప్రకారం.. డబ్బు పెట్టుబడిదారుడి బ్యాంక్ అకౌంట్‌ నుంచి మ్యూచువల్ ఫండ్ హౌస్ బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లాలి. స్టాక్ ఎక్స్ఛేంజీల మద్దతు ఉన్న అన్ని లావాదేవీ ప్లాట్‌ఫారమ్‌లు దీన్ని అమలు చేస్తాయి.

ఇంకా చదవండి ...
జులై 1 నుంచి పూల్ అకౌంట్‌ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వీలు కాదు. రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిర్దేశించిన ప్రకారం.. డబ్బు పెట్టుబడిదారుడి బ్యాంక్ అకౌంట్‌ నుంచి మ్యూచువల్ ఫండ్ హౌస్ బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లాలి. స్టాక్ ఎక్స్ఛేంజీల మద్దతు ఉన్న అన్ని లావాదేవీ ప్లాట్‌ఫారమ్‌లు దీన్ని అమలు చేస్తాయి. పెట్టుబడిదారులకు, ఇతర వాటాదారులకు చిన్నపాటి సమస్యలు ఎదురవచ్చు. MF యుటిలిటీతో సహా అన్ని నాన్-ఎక్స్ఛేంజ్ లావాదేవీ ప్లాట్‌ఫారమ్‌లు కొన్ని అవాంతరాలతో జూన్ 1 నుంచి ఇప్పటికే దీనిని అమలు చేశాయి. అయితే పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. వాటాదారులందరూ కొత్త కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మార్పులు చేసిన నిబంధనలతో వచ్చిన మార్పులేంటి.. ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త రూల్స్ ఉపయోగాలేంటి.. వంటి విషయాలు తెలుసుకుందాం.

* ఇంతకు ముందు జరిగిన తప్పులు ఏంటి?
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు, పంపిణీదారులు.. యూనిట్ల కేటాయింపుపై డిలే కన్ఫర్మేషన్‌, చెక్‌, RTGS, NEFTని ఉపయోగించి పేమెంట్స్‌ చేయలేకపోవడం, SIP లావాదేవీలు విఫలం కావడం వంటి సమస్యల గురించి మాట్లాడారు. పెట్టుబడిదారుల నుంచి ఫండ్ హౌస్‌కి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయినప్పుడు, ట్రాన్సాక్షన్‌ ప్లాట్‌ఫారమ్‌లు మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిన డబ్బు, ఫండ్స్‌ సోర్స్‌ వంటి వివరాల కోసం పేమెంట్స్‌ ప్రాసెసింగ్ ఎంటిటీపై ఆధారపడాలి. ఫండ్ హౌస్ డబ్బును స్వీకరించినప్పుడు మాత్రమే పెట్టుబడిదారులకు యూనిట్లు కేటాయిస్తారు. అలాగే, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు థర్డ్-పార్టీ చెల్లింపులను అంగీకరించకపోవడంతో, అలా స్వీకరించిన డబ్బు, పెట్టుబడిదారుడి బ్యాంక్ అకౌంట్‌ నుంచి వచ్చినట్లు ధ్రువీకరించాలి.

ఇదీ చదవండి: వాట్సాప్ కొత్త ఫీచర్.. వీడియో కాల్స్‌లో లేటెస్ట్ అవతార్స్.. మాములుగా ఉండదు..!


ఈ సమస్యల కారణంగా యూనిట్ల కేటాయింపు నిర్ధారణ ఆలస్యం అయింది. ఏదేమైనప్పటికీ, రిజిస్ట్రార్లు, ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్ల వ్యవస్థలు ర్యాంప్ అయ్యాయని, పరిస్థితి మెరుగుపడిందని యూనిట్ల లావాదేవీల కోసం విస్తృతంగా ఉపయోగించే ప్లాట్‌ఫారమ్ MF యుటిలిటీస్ స్పష్టం చేసింది. నిబంధనలకు లోబడి ఉన్న యూనిట్ల కేటాయింపులో జాప్యం జరగదని పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ఆరు రోజుల వరకు లావాదేవీల నిర్ధారణలో డిలే అనేది ఒకటి లేదా రెండు రోజులకు తగ్గినట్లు సూచిస్తున్నాయి.

MF యుటిలిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గణేష్ రామ్ మాట్లాడుతూ..‘మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు చెక్ మోడ్ పేమెంట్స్ ఎనేబుల్ చేయడానికి నాన్-స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లను అనుమతించడానికి పెట్టుబడిదారులను అనుమతించడం కోసం సెబీని సంప్రదించాం. జులై 15న లేదా అంతకు ముందు చెల్లింపుల కోసం NEFT, RTGS సౌకర్యాలను అందించడాన్ని పునఃప్రారంభించాలని కోరుతున్నాం’ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి MF యుటిలిటీ ద్వారా ఈ మూడు పేమెంట్ మోడ్స్ నిలిచిపోయాయి. పెట్టుబడిదారుడి బ్యాంక్ అకౌంట్‌ నుంచి మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి నిధులను NEFT, RTGS బదిలీ చేసే పని జరుగుతోంది.

ఇదీ చదవండి: లాస్ట్ వర్కింగ్ డే నుంచి 2 రోజుల్లోనే ఉద్యోగులకు జీతాలు.. కొత్త వేతన కోడ్ మార్గదర్శకాలు ఇవే..!


* SIP వైఫల్యాలపై ఫిర్యాదు
కొంతమంది పెట్టుబడిదారులు SIP వైఫల్యాలపై ఫిర్యాదు చేశారు. పాత SIP రిజిస్ట్రేషన్‌లకు ఆ అవసరం లేనందున SIPలు డెబిట్ అవుతున్న కొన్ని బ్యాంకులు పెట్టుబడిదారుల వివరాలను సమర్పించలేకపోయాయి. కొన్ని సందర్భాల్లో ఫోలియోలో పేర్కొన్న పేరు, బ్యాంక్ అకౌంట్‌లో పేర్కొన్న పేరు మధ్య అసమతుల్యత ఉందని ప్రముఖ ఫండ్ హౌస్‌కి చెందిన సీనియర్ ఆపరేషన్స్ అధికారి ఒకరు చెప్పారు. చెల్లింపు ప్రాసెసర్‌లు సోర్సెస్‌ను నిర్ధారించలేకపోవడంతో, లావాదేవీలు పూర్తి కావడం లేదు. అలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే, SIPని మళ్లీ నమోదు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పేరు వివరాలను సక్రమంగా సెట్ చేయాల్సి రావచ్చు.

పెట్టుబడిదారుల వివరాలు-మొబైల్ నంబర్, ఇమెయిల్- కూడా కీలకమైన ఇన్‌పుట్‌లు, అవి ఫండ్ ఫోలియో స్థాయిలో సరిగ్గా ఉండాలి. రెగ్యులేటర్ వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఉపయోగించి డబుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ని తప్పనిసరి చేసినందున ఇది చాలా అవసరం. 2FA ఇప్పటికే జూన్ 1 నుండి నాన్-ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రారంభించారు. స్విచ్, రిడెంప్షన్, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్‌లు, సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్‌లకు ఇది తప్పనిసరి . లావాదేవీ చేయడానికి ఇది కీలకమైన ఇన్‌పుట్‌గా మారినందున, వివరాల కోసం మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. అప్‌డేట్ చేయడానికి ఫండ్ హౌస్ లేదా RTA కార్యాలయాలను సంప్రదించవచ్చు. సరైన రిడమ్షన్ ఫార్మాట్‌లో సంతకం చేసి, మ్యూచువల్ ఫండ్స్, RTA కార్యాలయాలకు సమర్పించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా లావాదేవీలు చేయవచ్చు.



* ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లో ఏం మారబోతోంది?
పైన పేర్కొన్న అన్ని సమస్యలను పెట్టుబడిదారులు ఎదుర్కొనే అవకాశం ఉంది. బ్రోకర్-పంపిణీదారులకు దీని గురించి బాగా తెలుసు. వీరు ఇప్పటికే తమ తమ క్లయింట్‌లకు కొత్త మార్పుల గురించి వివరించారు. ఇప్పటికే బ్యాక్ ఎండ్ సిస్టమ్‌లను మెరుగుపరిచామని, డేటాబేస్‌ను అప్‌డేట్‌ చేశామని, కానీ మ్యూచువల్ ఫండ్ ఫోలియో, బ్యాంక్ అకౌంట్‌, పంపిణీదారు వంటి వివిధ వాటాదారుల స్థాయిలలో డేటా సమస్యలు కొనసాగవచ్చని ప్రముఖ ఆన్‌లైన్ బ్రోకరేజీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. బ్రోకర్.. బ్రోకింగ్ అకౌంట్‌ బ్యాలెన్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి నిధులను బదిలీ చేసే చోట ఆ SIPలన్నీ ఆగిపోతాయి. క్లియరింగ్ కార్పొరేషన్‌కు అనుకూలంగా తాజా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) ఆదేశాల కోసం సైన్ అప్ చేయాలి, వీటిని ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

ఈ మొత్తం కసరత్తులో గమనించదగ్గ విషయం ఏంటంటే, సెబీ ఫ్రీజింగ్ ఇన్వెస్టర్ల ఫోలియోలను సూచించలేదు. కానీ ఇటీవలి సర్క్యులర్‌లో నామినేషన్లు వేయడం లేదా నామినేషన్ల నుంచి వైదొలగడం తప్పనిసరి చేయడం వంటి నిబంధనలు పాటించని ఫోలియోలకు అటువంటి నిబంధన ఉంది.
Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, Investments, Money savings, Mutual Funds

తదుపరి వార్తలు