Home /News /business /

NEW RULES IN AUGUST LPG GAS CYLINDER PRICE TO CHEQUE CLEARANCE KNOW ABOUT NEW RULES WILL IMPLEMENT IN NEXT MONTH SS

New Rules in August: అలర్ట్... మీ డబ్బుకు సంబంధించి ఆగస్టులో అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

New Rules in August: అలర్ట్... మీ డబ్బుకు సంబంధించి ఆగస్టులో అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules in August: అలర్ట్... మీ డబ్బుకు సంబంధించి ఆగస్టులో అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules in August | ఆగస్టులో సామాన్యులపై ప్రభావం చూపించబోయే కొత్త నియమనిబంధనలు (New Rules) అమలులోకి రానున్నాయి. ఆ కొత్త రూల్స్ ఆర్థిక అంశాలను ప్రభావితం చేయనున్నాయి.

కొత్త నెల వస్తే కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తుంటాయి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆ రూల్స్ నిత్యం ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారిని ఈ రూల్స్ ప్రభావితం చేస్తుంటాయి. ఆగస్టులో కూడా కొత్త రూల్స్ (New Rules in August) అమలులోకి రానున్నాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, వడ్డీ రేట్లు, ఎల్‍‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర (LPG Gas Cylinder Price)... ఇలా అన్నీ సామాన్యులపై ప్రభావం చూపే నియమనిబంధనలే ఉన్నాయి. మరి ఆగస్టులో అమలులోకి రాబోయే రూల్స్ ఏంటీ? తెలుసుకోండి.

ITR FIling: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈ గడువు పొడిగించే ఆలోచన లేదని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆగస్ట్ 1 నుంచి రిటర్న్స్ ఫైల్ చేసేవారంతా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 ఫైన్ చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. వార్షికాదాయం రూ.5,00,000 కన్నా ఎక్కువ ఉన్నవారికి రూ.5,000 జరిమానా వర్తిస్తుంది.

Gift Tax: గిఫ్ట్ తీసుకున్నా ట్యాక్స్ చెల్లించాలి... ఎంతో తెలుసుకోండి

Cheque Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ 2022 ఆగస్ట్ 1న అమలులోకి రానున్నాయి. రూ.5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన చెక్స్‌ని ఎన్‌క్యాష్ చేయడానికి పాజిటీవ్ పే సిస్టమ్ తప్పనిసరి. కస్టమర్లు ఎవరికైనా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్ ఇస్తే ఇమెయిల్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆ వివరాలను బ్యాంకుకు కూడా తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా అన్ని బ్యాంకులు కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నాయి.

LPG Gas Cylinder Price: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చు, తగ్గొచ్చు, లేదా స్థిరంగా ఉండొచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలపై గ్యాస్ సిలిండర్ ధర ఆధారపడి ఉంటుంది.

Money Matters: ఈ డేట్ గుర్తుంచుకోండి... సామాన్యులకు మరోసారి షాక్ తప్పదు



Interest Rates: బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఆగస్ట్ 5న ఆర్‌బీఐ మరోసారి రెపో రేట్ పెంచబోతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈసారి వడ్డీ రేట్లు 35 బేసిస్ పాయింట్స్ అంటే 35 పైసలు పెరిగే అవకాశం ఉంది. ఆర్‍బీఐ ఇప్పటికే మే 4న రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్, జూన్ 8న 50 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ మొదటివారంలో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Interest rates, ITR Filing, LPG Cylinder, Lpg Cylinder Price, Personal Finance, Rbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు