Home /News /business /

NEW POLICIES FROM INSURANCE COMPANIES DO YOU KNOW HOW MANY BENEFITS UMG GH

Innovative Insurance: ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సరికొత్త పాలసీలు.. వీటి వల్ల ఎన్ని లాభాలో తెలుసా !

మోటార్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance) ప్రొడక్ట్స్ త్వరలో సరికొత్త ఫీచర్ల(Features)తో లాంచ్‌ కానున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరిన్ని అవుట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) ప్లాన్‌లు.. మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు పే-యాజ్-యు-డ్రైవ్, ఇతర వాల్యూ యాడెడ్-సర్వీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నాయి.

మోటార్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance) ప్రొడక్ట్స్ త్వరలో సరికొత్త ఫీచర్ల(Features)తో లాంచ్‌ కానున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరిన్ని అవుట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) ప్లాన్‌లు.. మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు పే-యాజ్-యు-డ్రైవ్, ఇతర వాల్యూ యాడెడ్-సర్వీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నాయి.

మోటార్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance) ప్రొడక్ట్స్ త్వరలో సరికొత్త ఫీచర్ల(Features)తో లాంచ్‌ కానున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరిన్ని అవుట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) ప్లాన్‌లు.. మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు పే-యాజ్-యు-డ్రైవ్, ఇతర వాల్యూ యాడెడ్-సర్వీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
మోటార్(Motors), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ త్వరలో సరికొత్త ఫీచర్లతో లాంచ్‌ కానున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్(Insurance) కంపెనీలు మరిన్ని అవుట్‌ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) ప్లాన్‌లు.. మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు పే-యాజ్-యు-డ్రైవ్, ఇతర వాల్యూ యాడెడ్-సర్వీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి రానున్న ఇన్నొవేటివ్ పాలసీ(Policy)లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ జూన్‌లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కొత్త ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అప్రూవల్స్‌కు సంబంధించి యూజ్ అండ్ ఫైల్ ఫ్రేమ్‌వర్క్‌కు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇన్నొవేటివ్ ప్రొడక్ట్స్‌పై ఇన్సూరెన్స్ కంపెనీలు, పాలసీదారులు దృష్టి పెడుతున్నారు.

కొత్త విధానంలో లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ముందు తమ ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసుకొని, ఆ తర్వాత రెగ్యులేటర్ నుంచి ఆమోదం పొందవచ్చు. ఈ ప్రకటన వెలువడి కేవలం రెండు నెలలే అయినప్పటికీ, కొత్త నిబంధనలు ప్రొడక్ట్ ఫైలింగ్, అప్రూవల్ విధానాలకు ఫ్లెక్సిబిలిటీని పెంచాయని బీమా సంస్థలు చెబుతున్నాయి. “ఇది బీమా కంపెనీలకు ప్రారంభ దశలోనే మార్కెట్‌లోకి వచ్చే వెసులుబాటును ఇస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆలోచించి, వినూత్న ఆలోచనలను ప్రవేశపెట్టేలా చేస్తుంది” అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ రాకేష్ జైన్ చెప్పారు.

యాడ్ ఆన్స్‌కు ఆమోదం
కొత్త ప్రొడక్ట్ అప్రూవల్ సిస్టమ్‌ను పరిచయం చేయడంతో పాటు పే-యాజ్-యు-డ్రైవ్, పే-హౌ-యు-డ్రైవ్, మోటర్ ఫ్లోటర్ వండి మోటార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లను అందించడానికి ఐఆర్‌డీఏఐ బీమా కంపెనీలను అనుమతించింది. దీంతో Bajaj Allianz, ICICI Lombard, Digit వంటి కంపెనీలు ఇప్పటికే ఇటువంటి యాడ్-ఆన్‌లను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్‌లో కూడా క్యాష్ లెస్ OPD, వెల్‌నెస్ లేదా ప్రివెంటివ్ కేర్ ఎలిమెంట్‌ వంటి కొత్త ఫీచర్లు ఉండవచ్చు. పాలసీదారులు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తే ప్రీమియం రెన్యువల్స్‌పై డిస్కౌంట్స్ పొందడం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. హెల్త్ పాలసీల్లో ఇలాంటి మార్పులు వేగంగా రానున్నాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లోకి రానున్న కొన్ని ఇన్నొవేటివ్ ప్రొడక్ట్స్ ఏవో చూద్దాం.:

అవుట్ ఆఫ్ పాకెట్ ఖర్చుల కవరేజీకి OPD ప్రొడక్ట్స్
కోవిడ్-19 తర్వాత హెల్త్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో బీమా కంపెనీలు కూడా సాధారణ ఆరోగ్య బీమా ఆఫర్‌లలో అంతరాన్ని ఎక్కువగా గుర్తిస్తున్నాయి. ఫార్మసీ బిల్లులు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, డయాగ్నస్టిక్ టెస్ట్ కాస్ట్ వంటి అవుట్ ఆఫ్ పాకెట్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌ను కవర్ చేయడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ICICI లాంబార్డ్, బజాజ్ అలియాంజ్, మణిపాల్ సిగ్నా, ఆదిత్య బిర్లా హెల్త్ వంటి అనేక బీమా సంస్థలు ఇప్పటికే OPD కవర్లను అందిస్తున్నాయి. వీటి సంఖ్య త్వరలో పెరగబోతోంది. ఈ ధోరణి మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Airlines Fares: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఫ్లయిట్ చార్జీలు.. ఎప్పటినుంచంటే !


Pay-as-you-drive
IRDAI ఆమోదించిన మూడు మోటార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్స్.. బేస్ పాలసీకి పే-యాజ్-యు-డ్రైవ్, పే-హౌ-యు-డ్రైవ్, మోటర్ ఫ్లోటర్ వంటి వాటిని అన్ని సాధారణ బీమా కంపెనీలు త్వరలో అందించే అవకాశం ఉంది. ఈ యాడ్-ఆన్‌లతో పాలసీ హోల్డర్‌లకు తక్కువ ప్రీమియం ఖర్చు అవుతుంది. కార్లను పరిమిత ప్రయోజనాల కోసం ఉపయోగించే వారికి ఇవి ప్రీమియం భారాన్ని తగ్గిస్తాయి. ఎక్కువ వాహనాలు ఉన్న పాలసీదారులకు మోటార్ ఫ్లోటర్ యాడ్-ఆన్ ఒకే కామన్ పాలసీలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా వినియోగంలో ఉన్న వాహనాలకు మాత్రమే ప్రీమియం వర్తిస్తుంది.

మోటార్ పాలసీ హోల్డర్స్‌కు వాల్యూ యాడెడ్ సర్వీసెస్‌
సాధారణ బీమా సంస్థలు కోర్ మోటార్ ఇన్సూరెన్స్ కవర్‌కు మించి విలువ ఆధారిత సేవలను అందించడంపై దృష్టి సారిస్తాయి. కార్ చెకప్స్, మెయింటెనెన్స్ మెంబర్‌షిప్, వాష్ వంటివి కూడా పాలసీల్లో కవర్ అవుతాయి. ఇవన్నీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్‌గా అందుబాటులో ఉంటాయి.



రిస్క్‌పై అవగాహన ఉండాల్సిందే..
బీమా సంస్థలు రూపొందించిన ఇన్నొవేటివ్ ప్రొడక్ట్స్.. మీ పాలసీకి విలువను జోడించే అవకాశం ఉంది. అయితే కొత్త ప్రొడక్ట్స్, యాడ్-ఆన్స్ అనేవి IRDAI ముందస్తు పరిశీలన లేకుండానే మార్కెట్లోకి విడుదల అవుతాయి కాబట్టి, పాలసీదారులు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బీమా కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకే భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి పాలసీదారులు తాము సైన్ అప్ చేస్తున్న ప్రొడక్ట్స్‌కు సంబంధించిన అన్ని ఫీచర్లు, మినహాయింపు నిబంధనలను అర్థం చేసుకున్నాకే ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Icici lombard, Insurance, Irdai, Life Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు