Home Loan: చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. ఇందుకు పెద్ద మొత్తంలో నగదు అవసరం కాబట్టి ఎక్కువగా లోన్‌పై ఆధారపడతారు. హోమ్ లోన్(Home loan) తీసుకున్న తర్వాత, సంపాదనలో కొంత మొత్తాన్ని ప్రతి నెలా ఈఎంఐ(EMI)గా కడుతుంటారు. అయితే లోన్ తీసుకొన్న ప్రారంభ సంవత్సరాల్లో ఈఎంఐ భారాన్ని తగ్గించే ఒక సరికొత్త ఆఫర్‌ను లాంచ్ చేసింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. హోమ్ లోన్ కస్టమర్ల కోసం మై EMI అనే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ కింద హోమ్ లోన్ అప్లికెంట్స్, లోన్ టెన్యూర్ ప్రారంభ సంవత్సరాల్లో తమకు తగిన EMI మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఇది ఇండియన్ మార్కెట్లో అత్యంత వైవిధ్యభరితమైన NBFCలలో ఒకటి. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 58 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ తీసుకొచ్చిన లేటెస్ట్ స్కీమ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
0.1 శాతం ఈఎంఐ
మై ఈఎంఐ ప్లాన్ ప్రకారం కస్టమర్లు లోన్ మొత్తంలో 0.1 శాతం వరకు EMIగా చెల్లించవచ్చని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఈ EMI రూ.4,999తో ప్రారంభమవుతుందని తెలిపింది. గరిష్టంగా 3 సంవత్సరాల కాలానికి లేదా ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు, ఈ రెండింట్లో ఏది ముందుగా వస్తే దాన్ని లబ్ధిదారులు అనుసరించాల్సి ఉంటుంది. అసలు లోన్ EMI టెన్యూర్ ఈ వ్యవధి తర్వాత ప్రారంభమవుతుందని, రుణగ్రహీతలు ప్రారంభ వ్యవధిలో ఆర్థిక భారాన్ని మోయకుండా ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని సంస్థ స్పష్టం చేసింది.
ఉదాహరణకు ఇల్లు కొనడానికి రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే, ఈ మొత్తంలో కేవలం 0.1% మాత్రమే EMIగా చెల్లిస్తే సరిపోతుంది. మొదటి మూడేళ్లపాటు నెలకు రూ.5000 EMIగా చెల్లించాల్సి ఉంటుంది. అసలు EMI అనేది మూడు సంవత్సరాల లోన్ టెన్యూర్ లేదా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే దాన్ని అనుసరించాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో కొత్త ఫ్లాట్/హౌస్‌ని బుక్ చేసుకునే కస్టమర్లకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Youngest IAS: ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్.. చిన్న వయసులోనే సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక..
8.20 శాతం వడ్డీతో హోమ్ లోన్
My EMI ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.20 శాతం నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 5 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ జీతం, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు ఉపయోగపడుతుంది. దరఖాస్తుదారులు తమ వడ్డీ రేటును ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అంటే RBI రెపో రేటుతో లింక్ చేసే ఆప్షన్ నుంచి కూడా ప్రయోజనం పొందుతారని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
అయితే హోమ్ లోన్ విషయంలో అసలు EMIని ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా చెల్లించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరింత ఆలస్యం అయితే ఎక్కువ వడ్డీలను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే My EMI ఆఫర్‌ను తీసుకుంటే, అది మొత్తం లోన్ అవుట్గోపై ఎలా ప్రభావం చూపుతుందో ముందుగా లెక్కించాలని సలహా ఇస్తున్నారు. ప్రాజెక్ట్ గురించి కచ్చితంగా తెలిసినప్పటికీ పూర్తి EMIలను చెల్లించడం ప్రారంభించడానికి తగినంత నిధులు లేనప్పుడు లోన్ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bajaj finance, Home loan