జర్మన్ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లోకి మరో లగ్జరీ కారును లాంచ్ చేసింది. మెర్సిడెస్ బెంజ్(mercedes benz) ఏఎమ్‌జి ఏ45 ఎస్‌ని ఆవిష్కరించింది. ఈ కారును రూ. 79.50 లక్షల ధర (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ సంస్థ ప్రస్తుతం భారత మార్కెట్లో 13 ఏఎంజీ మోడల్స్‌ను విక్రయిస్తోంది. ఇప్పుడు వీటి సరసన ఈ కొత్త వేరియంట్ వచ్చి చేరనుంది. మెర్సిడెస్ ఎంట్రీ లెవల్ సిరీస్ అయిన A క్లాస్ నుంచి వచ్చిన ఈ హై పర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌గా పేర్కొంది. దీన్ని ప్రత్యేకమైన డ్రైవింగ్ డైనమిక్స్, పర్ఫార్మెన్స్తో అభివృద్ది చేసింది. ఈ లగ్జరీ కారులో కొత్తగా డెవలప్ చేసిన 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ (Petrol) ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 421 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారు కేవలం 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్టంగా గంటకు 270 కిమీ వేగంతో ప్రయాణించగలదు. డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో ఏఎమ్‌జి స్పెసిఫిక్ రేడియేటర్ గ్రిల్, ఏరోడైనమిక్ బోనెట్, పవర్ డోమ్‌లు, మల్టీ బీమ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, విశాలమైన ఫ్రంట్ వింగ్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, ఏఎమ్‌జి బ్రాండ్ అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ను చేర్చింది. ఇవన్నీ కొత్త ఏ45 ఎస్ 4 మ్యాటిక్ ప్లస్ హ్యాచ్‌బ్యాక్‌కు స్టైలిష్ లుక్‌ను ఇచ్చాయి.
ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. ఈ కారు బయట కనిపించే స్పోర్టీ ఎలిమెంట్స్‌ను లోపలి భాగంలోనూ అందించింది. అధిక నాణ్యత కలిగిన మెటీరియల్స్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఏఎమ్‌జి స్పెసిఫిక్ స్పోర్ట్ సీట్లు, నలుపు రంగు ARTICO మ్యాన్ మేడ్ లెథర్, DINAMICA మైక్రోఫైబర్ కలయికతో రూపొందించిన అప్ హోలెస్ట్రీ వంటివి అందించింది. ఇక దీనిపైన ఎరుపు రంగులో ఉండే డబుల్ టాప్ స్టిచింగ్ వంటి విలక్షణమైన ఏఎమ్‌జి బ్రాండ్ స్పెసిఫిక్ హైలైట్‌లను ఇంటీరియర్స్ డిజైన్‌ను చేర్చింది.
Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?
K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?
* గంటకు 270 కిలోమీటర్ల వేగం..
ఈ కారు లోపలి భాగంలో స్పోర్టీనెస్‌ను మరింత పెంచడం కోసం ఎరుపు రంగులో ఉండే సీట్ బెల్ట్‌లు, డ్యాష్‌బోర్డుపై రెడ్ కలర్ యాక్సెంట్స్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవం కోసం ఈ కారులో హెడ్ అప్ డిస్ప్లే విండ్ స్క్రీన్‌ను అమర్చింది. ఇది కారు లోపలి భాగాన్ని డిజిటల్ కాక్‌పిట్‌గా మారుస్తుంది. ప్రయాణికుల వినోదాన్ని మరింత పెంచేందుకు ఈ కారులో 12 స్పీకర్లు, 590 వాట్ల అవుట్‌పుట్‌తో కూడిన హై ఎండ్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌ను అందించింది. ఇక, ఈ కారు సన్ ఎల్లో, పోలార్ వైట్, మౌంటైన్ గ్రే, డిజైనో పటగోనియా రెడ్, డిజైనో మౌంటైన్ గ్రే మాగ్నో, కాస్మోస్ బ్లాక్ కలర్ ఆప్షనల్లో అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mercedes-Benz