Home /News /business /

NEW MARUTI SUZUKI ALTO K10 INDIA LAUNCH ON AUGUST 18 TAKE A LOOK AT MODERN FEATURES AND PRICE GH SRD

Maruti Suzuki Alto K10: అదిరిపోయే ఫీచర్లతో ఆగస్టు 18న కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 రిలీజ్.. ధర ఎంతంటే..

Maruti Suzuki Alto K10

Maruti Suzuki Alto K10

Maruti Suzuki Alto K10: మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఆల్టో కె10ని మారుతి సుజుకి సెలెరియో మాదిరిగానే హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఈ కొత్త కారు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టో 800తో పాటు విక్రయిస్తారు.

ఇంకా చదవండి ...
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) అదిరిపోయే ఎంట్రీ లెవల్ కార్లు పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది. అయితే ఈ రోజుల్లో కొనుగోలుదారులకు హ్యాచ్‌బ్యాక్‌ కార్లపై ఆసక్తి తగ్గింది. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు మంచి హ్యాచ్‌బ్యాక్‌ కారు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2022 మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10)ని ఆగస్టు 18న ఇండియాలో రిలీజ్ చేస్తోంది. భారతదేశంలోని ఓల్డ్ హ్యాచ్‌బ్యాక్‌లలో సుజుకి ఆల్టో ఒకటి. దానిని మోస్ట్ అడ్వాన్స్‌డ్‌ అప్‌డేట్స్‌తో ఆల్టో K10గా మారుతి సుజుకి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారుకు సంబంధించి అనేక టీజర్లను కంపెనీ విడుదల చేసింది. అలానే కారు వివరాలను వెల్లడిస్తూ హైప్‌ను పెంచుతోంది. లాంచ్‌కు ముందు ఈ కారుకు సంబంధించిన పలు ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* 12 వేరియంట్లలో అందుబాటులోకి..
మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఆల్టో కె10ని మారుతి సుజుకి సెలెరియో మాదిరిగానే హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఈ కొత్త కారు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టో 800తో పాటు విక్రయిస్తారు. ఈ కారు 12 వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇందులో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT), మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT) వేరియంట్లు ఉంటాయి.మారుతి సుజుకి ఆల్టో K10 టాప్-ఎండ్ వేరియంట్లు కళ్లు చెదిరే ఫీచర్లతో వస్తాయి. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల రియర్ వ్యూ మిర్రర్స్‌ (OVRM), పవర్ విండోలు, రిమోట్ కీని ఆఫర్ చేశారు. ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. రూ. 11,000 టోకెన్ అమౌంట్‌గా చెల్లించాలని కంపెనీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి : పెరగనున్న హోమ్ లోన్ EMIలు.. లోన్ భారాన్ని తగ్గించుకునే నాలుగు వ్యూహాలు ఇవే..!

మారుతి సుజుకి ఆల్టో K10 ఎక్స్‌టీరియర్స్ కూడా ఇంటీరియర్స్ వలె చాలా అందంగా కనిపిస్తాయి. రకరకాల కలర్ ఆప్షన్స్, డిజైన్ అప్‌డేట్లు ఈ కారులో పొందవచ్చు. కొత్త ఆల్టో కె10 ఎర్త్ గోల్డ్, సిల్కీ వైట్, స్పీడీ బ్లూ, సాలిడ్ వైట్, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అవుతుంది. ఇందులో వెనుకవైపు పార్కింగ్ సెన్సార్లు, ABS డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు అందించారు. ఈ కారు హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, స్క్వేర్డ్ టెయిల్ ల్యాంప్‌లు, ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్లతో వస్తుంది.

* రూ.3.50 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ధర
2022 మారుతి సుజుకి ఆల్టో కె10 1.0-లీటర్ కె10సి డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. మారుతి సెలెరియో, ఎస్-ప్రెస్సోలో ఇదే పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ నిమిషానికి 6,000 రివల్యూషన్‌ల వద్ద గరిష్టంగా 67 హార్స్‌పవర్‌ను, నిమిషానికి 3,500 రివల్యూషన్‌ల వద్ద గరిష్టంగా 89 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT లతో ఆల్టో కె10 ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కారు ధర రూ.3.50 లక్షల నుంచి రూ.7 లక్షలు ఉండొచ్చని అంచనా.
Published by:Sridhar Reddy
First published:

Tags: Cars, Maruthi, MARUTI SUZUKI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు