Lamborghini: లంబోర్ఘిని కౌంటాచ్ మోడల్ లాంచింగ్​కు సన్నాహాలు.. కేవలం 112 యూనిట్లకు మాత్రమే పరిమితం

ప్రతీకాత్మకచిత్రం

యాభై ఏళ్ల క్రితం విడుదలైన ఒరిజినల్ లంబోర్ఘిని కౌంటాచ్ కారు ప్రీమియం రేంజ్​ స్పోర్ట్స్​ కారుగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అ?

  • Share this:
ప్రీమియం స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని నుంచి విడుదలయ్యే కార్లకు ఉండే క్రేజ్​ అంతా ఇంతా కాదు. టాప్​ సెలబ్రెటీలు, అత్యంత ధనవంతులు మాత్రమే ఉపయోగించే ఈ కార్లలో కళ్లు చెదిరే ఫీచర్లు ఉంటాయి. ఈ ఇటాలియన్​ కార్ల బ్రాండ్ నుంచి కౌంటాచ్ అనే మొదటి మోడల్​ లాంచ్​ అయ్యి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ బ్రాండ్​1971లో నిర్వహించిన జెనీవా ఆటో షో కార్యక్రమంలో క్రిస్టెన్డ్ కౌంటాచ్ LPI 800-4 లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు విడుదలైంది. దీంతో ఈ మోడల్​ విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో దీనికి కొనసాగింపుగా సరికొత్త మోడల్​ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్ కేవలం 112 యూనిట్లకు మాత్రమే పరిమితం అవుతుందని లంబోర్ఘిని పేర్కొంది. అంటే, ప్రపంచవ్యాప్తంగా కేవలం 112 కౌంటాచ్ న్యూ మోడల్​ కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

యాభై ఏళ్ల క్రితం విడుదలైన ఒరిజినల్ లంబోర్ఘిని కౌంటాచ్ కారు ప్రీమియం రేంజ్​ స్పోర్ట్స్​ కారుగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అందుకే, దీన్ని మరోసారి విడుదల చేసేందుకు సంస్థ సన్నద్ధమవుతోంది. విడుదలకు సిద్దంగా ఉన్న కొత్త మోడల్​లో అనేక అప్​డేట్​ ఫీచర్లను చేర్చనుంది. దీనిలో ఆధునిక హెడ్‌ల్యాంప్‌, స్లీక్ గ్రిల్​ను కూడా అమర్చనుంది. కొత్త కౌంటాచ్​లోని ఆధునిక టెయిల్‌లైట్​ ఫీచర్లు సియాన్‌ మోడల్​ను గుర్తు చేస్తాయి.

దీని సైడ్ ఎయిర్ ఇన్‌టేక్‌లు కారుకు అట్రాక్టివ్​ లుక్​ అందిస్తాయి. అంతేకాదు, దీనిలోని పెరిస్కోప్ రూఫ్​ కారుకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పెరిస్కోప్​ రూఫ్​ పాత కౌంటాచ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీనిలో శక్తివంతమైన ఏరోడైనమిక్ సైడ్​ డోర్స్​ను చేర్చింది. ఇక, దీనిలోని క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులు, కార్బన్ ఫైబర్ రియర్ డిఫ్యూజర్‌లు ఈ స్పోర్ట్స్ కారుకు అదనపు డిజైన్‌ను జోడిస్తాయి.

మెరుపు వేగంతో ప్రయాణం..

లంబోర్ఘిని కౌంటాచ్ కొత్త మోడల్​ 6.5 లీటర్ V12 ఇంజిన్​తో పనిచేస్తుంది. ఇది 769 బీహెచ్​పీ, 720 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 48-వోల్ట్ ఈ-మోటార్‌తో జతచేసి ఉంటుంది. దీని గేర్‌బాక్స్‌ నేరుగా 33.5 బిహెచ్‌పి, 35 ఎన్ఎమ్‌ల టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సూపర్ కెపాసిటర్ ద్వారా శక్తినిస్తుంది. ఇదే పవర్‌ట్రెయిన్ ఇంజిన్​ను సియాన్‌ మోడల్​లో కూడా ఉపయోగించారు. ఈ స్పోర్ట్స్ కారు 7 -స్పీడ్ ISR గేర్‌బాక్స్, ఫోర్-వీల్-డ్రైవ్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కౌంటాచ్‌ వేరియంట్​ను స్టార్ట్​ చేయగానే 100 కి.మీ./గం. వేగాన్ని చేరుకోగలదు. ఇక, 2.8 సెకన్లలో 355 కి.మీ./గంట గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది.
Published by:Krishna Adithya
First published: