హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Labour Laws: కొత్త లేబర్‌ కోడ్స్‌పై కేంద్రం కసరత్తు.. పని గంటలు, పీఎఫ్‌, వేతనాల్లో మార్పులు..

New Labour Laws: కొత్త లేబర్‌ కోడ్స్‌పై కేంద్రం కసరత్తు.. పని గంటలు, పీఎఫ్‌, వేతనాల్లో మార్పులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర కార్మిక శాఖ ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేయవచ్చని ఒక నివేదిక తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త లేబర్ కోడ్‌ల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది.

కేంద్ర కార్మిక శాఖ ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్‌లను(New Labour Code) అమలు చేయవచ్చని ఒక నివేదిక తెలిపింది. కేంద్ర ప్రభుత్వం(Central Government) నాలుగు కొత్త లేబర్ కోడ్‌ల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. దీనిద్వారా ఉద్యోగి జీతం, PF చెల్లింపులు, పని గంటల పరంగా కీలక మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Government) వీలైనంత త్వరగా లేబర్ కోడ్‌లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే అన్ని రాష్ట్రాలు ఇంకా నిబంధనలను సిద్ధం చేయనందున ఇది అమలులోకి రావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రానున్న మూడు నెలల్లో అమలు చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి :  వాట్సప్‌లో ఈ 10 ఫీచర్స్ వచ్చేస్తున్నాయి... వాడుకోండి ఇలా

* ఏ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి?

కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. పనిదినాలలో మార్పు అనేది అమలులోకి రానున్న ప్రధాన అంశంగా కనిపిస్తోంది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత.. కంపెనీ ఉద్యోగులు ఐదు రోజులకు బదులుగా నాలుగు రోజులు పని చేసే అవకాశాలు ఉన్నాయి. వారంలో మూడు రోజులు సెలవులు కల్పించనున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది.. పని గంటలు తగ్గించిన కారణంగా ఉద్యోగులు ఎనిమిది గంటలకు బదులుగా రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది.

కొత్త కార్మిక చట్టాలు తీసుకురాబోతున్న మరో ప్రధాన మార్పు ఏంటంటే.. టేక్ హోమ్ జీతం, ప్రావిడెంట్ ఫండ్‌లో ఉద్యోగులు, యజమాని జమ చేసే నిష్పత్తి. కొత్త కోడ్‌ల నిబంధన ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక వేతనం స్థూల జీతంలో 50 శాతం ఉండాలి. దీంతో ఉద్యోగి, యజమాని PF కంట్రిబ్యూషన్‌ పెరుగుతుంది. కొంతమంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారికి టేక్ హోమ్ జీతం తగ్గుతుంది. కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం పదవీ విరమణ తర్వాత పొందే డబ్బుతో పాటు గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది.

దీనిపై గతేడాది ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ నాలుగు లేబర్ కోడ్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2022-23లో అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో రాష్ట్రాలు వీటిపై ముసాయిదా నిబంధనలను ఖరారు చేశాయి. ఫిబ్రవరి 2021లో ఈ కోడ్‌లకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. అయితే లేబర్ అనేది ఉమ్మడి సబ్జెక్ట్ కాబట్టి, వీటిని కూడా రాష్ట్రాలు ఒకే సారి అమలు చేయాలని కేంద్రం కోరుతోంది.’ అని చెప్పారు.

Explained: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మళ్లీ ఘర్షణలు.. మిడ్‌ఈస్ట్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి..?


వేతనాల కోడ్‌ 2019, ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ కోడ్‌ 2020, కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ అనే నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 8న నోటిఫై చేసింది. 2020 సెప్టెంబర్ 29న దాదాపు 13 రాష్ట్రాలు ఇప్పటికే వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌పై డ్రాఫ్ట్ నియమాలను ముందే ప్రచురించాయి. ఆ జాబితాలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, మణిపూర్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌ ఉన్నాయి.

First published:

Tags: Business, Central Government, Employees, Labour, Un employement

ఉత్తమ కథలు