హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Bike Launch: ఇండియాలో సరికొత్త బైక్ లాంచ్‌.. అదిరిపోయిన బైక్‌ ఫీచర్స్..

New Bike Launch: ఇండియాలో సరికొత్త బైక్ లాంచ్‌.. అదిరిపోయిన బైక్‌ ఫీచర్స్..

New Bike Launch: ఇండియాలో సరికొత్త బైక్ లాంచ్‌..  అదిరిపోయిన బైక్‌ ఫీచర్స్..

New Bike Launch: ఇండియాలో సరికొత్త బైక్ లాంచ్‌.. అదిరిపోయిన బైక్‌ ఫీచర్స్..

భారత్‌లో జావా యెజ్డీ(Jawa Yezdi) అత్యుత్తమ బైక్‌లను లాంచ్‌ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇటీవల 'జావా 42 బాబర్‌' (Jawa 42 Bobber) పేరుతో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. జావా 42 బాబర్‌ రూ.2,06,500 (ఎక్స్-షోరూమ్) స్టార్టింగ్‌ ప్రైస్‌తో అందుబాటులో ఉంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

భారత్‌లో జావా యెజ్డీ(Jawa Yezdi) అత్యుత్తమ బైక్‌లను లాంచ్‌ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇటీవల 'జావా 42 బాబర్‌' (Jawa 42 Bobber) పేరుతో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. జావా 42 బాబర్‌ రూ.2,06,500 (ఎక్స్-షోరూమ్) స్టార్టింగ్‌ ప్రైస్‌తో అందుబాటులో ఉంది. టాప్-ఎండ్ మోడల్ ధర రూ.2,09,000(ఎక్స్-షోరూమ్)గా ఉంది. భారతీయ మార్కెట్లో కంపెనీ అత్యంత సరసమైన బాబర్-స్టైల్‌ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. జావా 42 బాబర్ మోటార్‌సైకిల్ మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్, డ్యూయల్-టోన్ జాస్పర్ రెడ్‌ వంటి మూడు కలర్‌ వేరియంట్లలో లభిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు(Features), ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్‌ను అందరూ ఇష్టపడుతున్నారు. డెలివరీలు వచ్చే వారం నుంచి కంపెనీ చేపట్టే అవకాశం ఉంది.

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

* ధరలు ఇలా..

జావా 42 బాబర్‌ మిస్టిక్ కాపర్ వేరియంట్ ధర రూ. 2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అదే విధంగా జావా 42 బాబర్‌ మూన్‌స్టోన్ వైట్ వేరియంట్‌ రూ. 2.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభిస్తోంది. జావా 42 బాబర్‌ జాస్పర్ రెడ్ వేరియంట్‌ రూ.2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది.

* అట్రాక్టివ్ ఫీచర్స్ ఇవే..

జావా 42 బాబర్‌ చూడగానే అట్రాక్టివ్‌ లుక్‌లో కనిపిస్తుంది. ఇందులో కొత్త రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, కొత్త ఫ్యూయల్ ట్యాంక్, పూర్తిగా రీడిజైన్ చేసిన అడ్జస్టబుల్ సీటు బైక్‌కు స్టైలిస్ లుక్ తీసుకొచ్చాయి. బైక్ వెనుక ఫెండర్‌పై చిన్న లగేజ్ ర్యాక్ కూడా అమర్చారు. ఈ జావా 42 బాబర్‌లో వీల్‌బేస్ కొంత ఎక్కువగా ఉంటుంది. రైడర్ మోకాలి రక్షణ కోసం ట్యాంక్ ప్యాడ్స్‌తో కూడిన మోకాలి రెసెస్‌ వంటి న్యూ ఫ్యూయల్ ట్యాంక్ ఫీచర్సు ఇందులో ఉన్నాయి. బైక్ ఫెండర్స్, సైడ్ ప్యానెల్స్ గ్లోస్ బ్లాక్‌లో ఫినిష్ చేశారు.

* కాన్‌ట్రాస్టింగ్ LCD స్క్రీన్‌

జావా 42 బాబర్‌‌లో ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, హెడ్‌ల్యాంప్ అనేవి గతేడాది వచ్చిన జావా 42 నుంచి ప్రేరణ పొందినట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఫ్రంట్ ఎండ్ మస్క్యూలర్ తిరిగినట్లుగా కనిపించేలా డిజైన్ చేసినట్లు క్లాసిక్ లెజెండ్స్ జావా తెలిపింది. కాన్‌ట్రాస్టింగ్ LCD స్క్రీన్‌తో డిజిటల్ క్లాక్ కన్సోల్ ముఖ్యమైన సమాచారాన్ని అందిచడంతో పాటు చూడముచ్చగా ఉంటుంది. దీని చుట్టూ LED లైటింగ్ ఉంటుంది. ఫంక్షన్లను నియంత్రించడానికి ఈ మోటార్ సైకిల్ కొత్త స్విచ్ గేర్‌ను కూడా ఉంది.

* టూ -స్టెప్ అడ్జెస్టబుల్ ఫీచర్

జావా 42 బాబర్ సీటు పూర్తిగా కొత్తగా డిజైన్ చేశారు. పాన్, కుషనింగ్, అప్హోల్స్టరీతో దీన్ని రీడిజైన్ చేశారు. కొత్త హ్యాండిల్ బార్, కొత్త ఫార్వర్డ్ ఫుట్ కంట్రోల్స్, సీట్ వంటివి కొత్త రైడర్ ట్రయాంగిల్‌ అనుభూతిని ఇస్తాయి. టూ -స్టెప్ అడ్జస్టబుల్ ఫీచర్‌‌తో సీట్ ఉంటుంది. రైడర్ ప్రాధాన్యత బట్టి దీన్ని ముందుకు, వెనుకకు అడ్జెస్ట్ చేయవచ్చు.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

* బెస్ట్‌ సస్పెన్షన్ సెటప్

ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. జావా పెరాక్‌లోని 334సీసీ ఇంజన్‌‌ను ఇందులోనూ ఉపయోగించారు. ఇది 30.64 హెచ్‌పి పవర్, 32.64 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ అమర్చారు. దీంతో ఈ బైక్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందించడానికి అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ స్పోక్డ్ వీల్స్‌తో వస్తుంది.

Published by:Veera Babu
First published:

Tags: Bike, Bike rides, Business

ఉత్తమ కథలు