హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vehicle Insurance: న్యూ ఇండియా అస్యూరెన్స్ కొత్త పాలసీ ‘పే యాజ్ యు డ్రైవ్’..తీసుకుంటే అదిరే బెనిఫిట్స్!

Vehicle Insurance: న్యూ ఇండియా అస్యూరెన్స్ కొత్త పాలసీ ‘పే యాజ్ యు డ్రైవ్’..తీసుకుంటే అదిరే బెనిఫిట్స్!

Vehicle Insurance: న్యూ ఇండియా అస్యూరెన్స్ కొత్త పాలసీ ‘పే యాజ్ యు డ్రైవ్’..తీసుకుంటే అదిరే బెనిఫిట్స్!

Vehicle Insurance: న్యూ ఇండియా అస్యూరెన్స్ కొత్త పాలసీ ‘పే యాజ్ యు డ్రైవ్’..తీసుకుంటే అదిరే బెనిఫిట్స్!

Vehicle Insurance: న్యూ ఇండియా అస్యూరెన్స్ (NIA), మరో కొత్త పాలసీని లాంచ్ చేసింది. ‘పే యాజ్ యు డ్రైవ్’ (PAYD) వెహికల్ ఇన్సూరెన్స్‌ను సంస్థ పరిచయం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలో వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీల ప్రాధాన్యంపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు. దీంతో ప్రధాన కంపెనీలు సరికొత్త పాలసీలను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో అతిపెద్ద నాన్-లైఫ్ ఇన్సూరెన్స్, ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీగా పేరున్న న్యూ ఇండియా అస్యూరెన్స్ (NIA), మరో కొత్త పాలసీని లాంచ్ చేసింది. ‘పే యాజ్ యు డ్రైవ్’ (PAYD) వెహికల్ ఇన్సూరెన్స్‌ను సంస్థ పరిచయం చేసింది. ఈ కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో వాహన వినియోగం ఆధారంగా ప్రీమియం వసూలు చేస్తారు. ఇందులో థర్డ్ పార్టీ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ వంటి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి.

* ఫీచర్లు

- వెహికల్‌ను నిర్దిష్ట కిలోమీటర్లకు మించి నడపకపోతే, పాలసీ రెన్యువల్‌పై డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ బేసిక్ ఓన్ డ్యామేజ్ ప్రీమియంపై వర్తిస్తుంది. అంటే కస్టమర్లు ఈ మేరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

- వాహనాన్ని కిలోమీటర్ థ్రెషోల్డ్ లిమిట్‌కు మించి నడిపినా సరే, పాలసీ డ్యూరేషన్ ఉన్నంత వరకు కవరేజీ కొనసాగుతుంది.

- ఏదైనా సందర్భంలో క్లెయిమ్ చేసుకున్నప్పటికీ ‘పే యాజ్ యు డ్రైవ్’ డిస్కౌంట్ కొనసాగుతుంది.

- యాడ్ ఆన్స్ సాయంతో పాలసీ ప్రయోజనాలను పెంచుకోవచ్చు. నిల్ డిప్రిసియేషన్, ఇంజిన్ ప్రొటెక్షన్, రిటర్న్ టు ఇన్‌వాయిస్‌, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి యాడ్-ఆన్స్‌ ద్వారా పాలసీని మెరుగుపరచవచ్చు. ఇవి అదనపు ప్రీమియంతో అందుబాటులో ఉంటాయి.

పాలసీ లాంచింగ్ సందర్భంగా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నీర్జా కపూర్ మాట్లాడారు. PAYD పాలసీ అనేది వేర్వేరు ప్రయోజనాలు పొందగలిగే సింపుల్, ఫ్లెక్సిబుల్ ప్రొడక్ట్ అని చెప్పారు. తాజా పాలసీ కస్టమర్ల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తుందని చెప్పారు. వెహికల్ మేనేజ్‌మెంట్‌పై కస్టమర్ పెట్టే ఖర్చులను తగ్గించేలా పాలసీని డిజైన్ చేశామని, మార్కెట్లో ఉన్న అతి తక్కువ పాలసీలో తమ ప్రొడక్ట్ ఒకటని వెల్లడించారు. రోడ్లపై తిరిగే అన్-ఇన్సూర్డ్, అండర్-ఇన్సూర్డ్ వెహికల్స్‌తో సంబంధం ఉండే రిస్క్‌ను తాజా పాలసీ తగ్గిస్తుందని నీర్జా కపూర్ వివరించారు.

ఇది కూడా చదవండి : ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాలు రోడ్డెక్కవు.. స్పష్టం చేసిన నితిన్ గడ్కరీ

* వారికి ఎక్కువ బెనిఫిట్స్

ఇన్సూరెన్స్ కంపెనీలు టెలిమాటిక్స్ బేస్డ్ మోటార్ ఇన్సూరెన్స్ కవర్స్ ప్రారంభించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల అనుమతించింది. ఈ విభాగంలో ‘పే యాజ్ యు డ్రైవ్’ (PAYD), ‘పే హౌ యు డ్రైవ్’ (PHYD) వంటివి ఉన్నాయి. వీటి ద్వారా వాహన యజమానులు తమ వెహికల్‌ ఇన్సూరెన్స్ ఖర్చును తగ్గించుకోవచ్చు. అవసరాలకు తగ్గట్లు పాలసీలు ఎంచుకునే అవకాశం ఉంటుంది. వాహనాలను ఎక్కువగా ఉపయోగించని వారు వీటితో ప్రయోజనం పొందవచ్చు.

First published:

Tags: Bike, Motor insurance, Personal Finance

ఉత్తమ కథలు