హైదరాబాద్ సమీపంలో Independent House రూ.24 లక్షలు...Duplex Villa రూ. 39 లక్షలకే...

హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తే మాత్రం షాద్ నగర్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు 24 నుంచి 60 లక్షల రేంజిలో లభిస్తున్నాయి.

news18-telugu
Updated: October 24, 2020, 12:01 PM IST
హైదరాబాద్ సమీపంలో Independent House రూ.24 లక్షలు...Duplex Villa రూ. 39 లక్షలకే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
సొంతిల్లు కొనాలనే ఆలోచన ఉందా...అయితే ధరలను చూసి భయపడుతున్నారా.. హైదరాబాద్‌లో ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు ఎక్కడెక్కడ వస్తున్నాయో తెలియక తికమకపడుతున్నారా...అయితే సొంతింటి కల నెరవేర్చుకునే వారి కోసం హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోని షాద్ నగర్ పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూత వేటు దూరంలోనే ఉన్న షాద్ నగర్ పట్టణం ప్రస్తుతం తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైమ్ లొకేషన్ గా మారింది. ముఖ్యంగా నగరానికి అన్ని రకాలుగా కనెక్టివిటీ ఉన్న షాద్ నగర్ లో మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇండిపెండెంట్ ఇల్లు లభ్యం అవుతున్నాయి. ముఖ్యంగా విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, లే అవుట్‌ వెంచర్ల పెద్ద ఎత్తున నిర్మాణం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో మీ బడ్జెట్ కు అనుగుణంగా ఫ్లాట్‌లు మొదలు ప్రీమియం విల్లాల వరకు ఇక్కడ లభిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్‌ లాజిస్టిక్స్ హబ్ గా రూపొందుతోంది. మీరు హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తే మాత్రం షాద్ నగర్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు 24 నుంచి 60 లక్షల రేంజిలో లభిస్తున్నాయి.

ధరలు ఇలా ఉన్నాయి...

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలో కొత్తగా రెండు వెంచర్లు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ రూ.24 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్, కేవలం రూ.39 లక్షలకే డూప్లెక్స్ విల్లాలను విక్రయించనుంది.

లొకేషన్ అడ్వాంటేజ్...
షంషాబాద్ ఎయిర్ పోర్టుకు అత్యంత సమీపంలో ఉన్న ఫరూక్ నగర్ బెంగుళూరు జాతీయ రహదారికి సమీపంలో ఉంది. ప్రస్తుతం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఫ్యాబ్ సిటీ, నానోటెక్ పార్క్, ముచ్చర్ల ఐటీ క్లస్టర్ తోపాటు ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు కూడా ఈ ప్రాంతానికి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అలాగే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున లాజిస్టిక్స్ పరిశ్రమలతో పాటు, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు అత్యంత సమీపంలోనే ఉండటం విశేషం. షాద్ నగర్ నుంచి హైదరాబాద్ లోని ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్న వారికి బస్సు, ఎంఎంటీఎస్, అలాగే జాతీయ రహదారి అందుబాటులో ఉన్నాయి.

బ్యాంకు రుణం పొందండిలా....
కేవలం రూ. 25 లక్షలకే ఈ ప్రాంతంలో 900 sq ft నుంచి 1100 SQ.ft 2 BHK ఫ్లాట్స్ లభిస్తున్నాయి. అంతేకాదు అన్ని ప్రముఖ బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు లభిస్తున్నాయి. డీటీసీపీ అప్రూవ్డ్ లే అవుట్స్ కావడంతో మీ స్థిరాస్తికి భవిష్యత్తులో మంచి విలువ లభించడం ఖాయంగా ఉంది. ఈ ప్రాంతంలో స్థిరాస్థి పుంజుకోవడం కూడా మీకు కలిసి వచ్చే అంశమే.

గమనిక : పైన పేర్కొన్న ధరలు, ఇతర వివరాలు కేవలం పాఠకుల అవగాహన, సమాచారం కోసం మాత్రమే పేర్కొనడం జరిగింది.
Published by: Krishna Adithya
First published: October 24, 2020, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading