Income Tax Rules: ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్... ఇవాళ్టి నుంచే అమలులోకి

Income Tax Rules | ఏప్రిల్ 1... ఆర్థిక సంవత్సరం మొదటి రోజు. ఈ రోజునే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి.

news18-telugu
Updated: April 1, 2020, 1:24 PM IST
Income Tax Rules: ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్... ఇవాళ్టి నుంచే అమలులోకి
TDS, TCS చెల్లింపులు 25 శాతానికి తగ్గింపు. దీని వల్ల రూ.50,000 కోట్ల నగదు లభ్యత
  • Share this:
మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంటారా? ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పించేప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్స్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు 5% పన్ను, రూ.5,00,000 నుంచి రూ.7,50,000 వరకు 10% పన్ను, రూ.7,50,000 నుంచి రూ.10,00,000 వరకు 15% పన్ను, రూ.10,00,000 నుంచి రూ.12,50,000 వరకు 20% పన్ను, రూ.12,50,000 నుంచి రూ.15,00,000 వరకు 25% పన్ను, రూ.15,00,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి 30% పన్ను చెల్లించాలని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఈ కొత్త ట్యాక్స్ శ్లాబ్ ఎంచుకున్నవారికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. తమ ఆదాయం ఎంతో లెక్కేసుకొని నేరుగా ట్యాక్స్ చెల్లిస్తే చాలు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన ఈ కొత్త ట్యాక్స్ శ్లాబ్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అనేక నియమనిబంధనలకు గడువు పొడిగించింది. 2018-19 ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేవారికి, పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి జూన్ 30 వరకు అవకాశమిచ్చింది. కానీ ఆర్థిక సంవత్సరం మాత్రం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుందని కేంద్రం ప్రకటించింది. కాబట్టి ఏప్రిల్ 1న కొత్త ట్యాక్స్ శ్లాబ్ అమలులోకి వచ్చింది. అయితే పాత ట్యాక్స్ శ్లాబ్ కూడా ఉంటుంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏదైనా ఒక శ్లాబ్ ఎంచుకోవచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్‌తో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈపీఎఫ్, పెన్షన్ ఫండ్‌లో ఏడాదికి రూ.7.5 లక్షలు పొదుపు దాటితే పన్ను చెల్లించాలి. 2020 మార్చి 31 లోపు మొదటి సారి రూ.45 లక్షల వరకు ఇల్లు తీసుకునే వారికి అదనంగా రూ.1.5 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ప్రస్తుతం రూ.2 లక్షల ట్యాక్స్ రిబేట్ ఉంది.

ఇవి కూడా చదవండి:

EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి... విత్‌డ్రా చేయండి ఇలా

Banks Merger: బ్యాంకుల విలీనం నేటి నుంచే అమలులోకి... మిగిలేవి ఈ బ్యాంకులే

Savings: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి షాక్... ఎవరికి ఎంత నష్టమంటే
First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading