Home /News /business /

NEW INCOME TAX RETURN ITR FILING PORTAL TO BE LAUNCHED HERES WHAT CHANGES MK GH

New e–portal: జూన్​ 7న ప్రారంభం కానున్న కొత్త ‘ఈ–ఫైలింగ్​’ పోర్టల్​.. పన్ను చెల్లింపులు మరింత సులభతరం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదాయపు పన్ను రిటర్న్స్​ మరింత సులభతరం చేయడానికి సరికొత్త ఫీచర్లతో కూడిన పోర్టల్​ను ప్రారంభించనుంది ఐటీ మంత్రిత్వ శాఖ. జూన్​ 7న కొత్త ‘ఈ–ఫైలింగ్​ 2.0’ పోర్టల్​ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఆదాయపు పన్ను రిటర్న్స్​ మరింత సులభతరం చేయడానికి సరికొత్త ఫీచర్లతో కూడిన పోర్టల్​ను ప్రారంభించనుంది ఐటీ మంత్రిత్వ శాఖ. జూన్​ 7న కొత్త ‘ఈ–ఫైలింగ్​ 2.0’ పోర్టల్​ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఈ–ఫైలింగ్​ పోర్టల్​ http://incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్త ఈ–ఫైలింగ్​ పోర్టల్ www.incometax.gov.in ను ప్రారంభించనుంది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ ట్వీట్​ చేసింది. ఈ–ఫైలింగ్ 2.0 పోర్టల్ ముఖ్యమైన ఫీచర్లను ఐటీ శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరించింది. ఈ పోర్టల్​ను మొబైల్​ ఫోన్​లోనూ సులభంగా ఉపయోగించుకునేలా యాప్​ను కూడా రూపొందిస్తుంది.

ఈ కొత్త పోర్టల్​ ప్రారంభించటానికి ముందు.. అంటే జూన్ 1 నుంచి 6 మధ్య ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. జూన్​ 7న కొత్త ఈ–ఫైలింగ్​ వెబ్​ పోర్టల్​ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు యూజర్​ మాన్యువల్​, వీడియో వంటివి చేర్చింది. బేసిక్​ కంప్యూటర్​ నాలెడ్జ్​ ఉంటే చాలు.. ఈ వీడియోల సహాయంతో సొంతగా ఈ–ఫైలింగ్​ చేయవచ్చు.

ఈ ఆన్​లైన్​​ పోర్టల్​లో పన్ను చెల్లింపుల కోసం మల్టిపుల్​ ఆప్షన్లను పొందుపర్చింది. ఈ ఫారమ్​లో మీరు ఇచ్చిన వివరాలు ముందే ఫిల్​ చేసి ఉంటాయి. తద్వారా మీరు మళ్లీ అన్ని వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఈ కొత్త పోర్టల్​ సురక్షితమైన లాగిన్​, చాట్​బాట్​, హెల్ప్​ డెస్క్​ సపోర్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లతో వస్తుంది.

జూన్​ 7న అందుబాటులోకి..
కొత్త పోర్టల్​ పన్ను చెల్లింపుదారులకు మరింత సరళతరంగా ఉంటుందని, ఇందులో పొందుపర్చిన ఫీచర్లు మరింత యూజర్​ ఫ్రెండ్లీగా ఉంటాయని ఐటీ శాఖ స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్​లను దాఖలు చేసిన వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా దీన్ని రూపొందించినట్లు సీబీడీటీ తెలిపింది. తమ ఐటీ మొత్తాన్ని వెంటనే రీఫండ్​ చేసేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. సింగిల్​ డాష్​బోర్డ్​ మీదే అన్ని రకాల అప్​లోడ్స్​, పెండిగ్స్​ తెలుసుకునే విధంగా దీన్ని రూపొందించినట్లు వివరించింది. నెట్​ బ్యాంకింగ్​, యూపీఐ, ఆర్టీజీఎస్​, ఎన్​ఈఎఫ్​టీ, ఇతర మల్టిపుల్​ పేమెంట్​ ఆప్షన్లను ఇందులో పొందుపర్చామని, దీని వల్ల టాక్స్​ పేయర్లు త్వరితగతిన తమ అకౌంట్లను చెక్​ చేసుకునే వీలుందని ఐటీ శాఖ వెల్లడించింది.
Published by:Krishna Adithya
First published:

Tags: Income tax

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు