Home /News /business /

NEW INCOME TAX EXEMPTION RULES FOR EXPENSES ON COVID 19 TREATMENT UMG GH

Exemption Rules: కోవిడ్-19 ట్రీట్‌మెంట్ ఖర్చులపై ట్యాక్స్‌ క్లెయిమ్ చేస్తున్నారా..? అయితే, ఈ కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే..!

కోవిడ్-19 ట్రీట్‌మెంట్ ఖర్చులపై ట్యాక్స్‌ క్లెయిమ్ చేస్తున్నారా..?

కోవిడ్-19 ట్రీట్‌మెంట్ ఖర్చులపై ట్యాక్స్‌ క్లెయిమ్ చేస్తున్నారా..?

కోవిడ్ -19 చికిత్స కోసం వ్యక్తులు పొందిన డబ్బు లేదా కోవిడ్ -19 కారణంగా మరణించిన కుటుంబ సభ్యులు పొందిన ఎక్స్‌గ్రేషియాకు ఆదాయపు పన్ను నుంచి ఎగ్జమ్షన్‌ ఉంటుందని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశాన్ని బడ్జెట్ 2022లో కూడా ప్రస్తావించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
కోవిడ్-19 చికిత్స ఖర్చులపై ఎగ్జమ్షన్‌ క్లెయిమ్ చేయడానికి ఒక ఫారమ్‌ను, కొత్త షరతులను ప్రకటించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT). 2022 ఆగస్టు 5న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కోవిడ్-19 చికిత్స కోసం యజమాని లేదా బంధువుల నుంచి అప్పుగా తీసుకొన్న డబ్బుపై ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ క్లెయిమ్ చేయడానికి యజమానికి కొన్ని డాక్యుమెంట్స్‌ను ఆదాయ పన్ను శాఖకు ఒక ఫారమ్‌ను సమర్పించాలి.

కోవిడ్ -19 చికిత్స కోసం వ్యక్తులు పొందిన డబ్బు లేదా కోవిడ్ -19 కారణంగా మరణించిన కుటుంబ సభ్యులు పొందిన ఎక్స్‌గ్రేషియాకు ఆదాయపు పన్ను నుంచి ఎగ్జమ్షన్‌ ఉంటుందని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశాన్ని బడ్జెట్ 2022లో కూడా ప్రస్తావించింది. ఈ ఎగ్జమ్షన్‌ ఆర్థిక సంవత్సరం 2019-20 నుంచి అమల్లోకి వస్తుంది.

ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్.. ఆ ఫోన్‌లు ఇండియాలో బ్యాన్..? ఇక బడ్జెట్ మొబైల్స్ కష్టమే.. ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే..!


* కొత్త నోటిఫికేషన్ ఏం చెబుతోంది
ఆగస్టు 5 నోటిఫికేషన్ ప్రకారం.. కోవిడ్-19 చికిత్స కోసం డబ్బు పొందిన ఉద్యోగులు ఈ కింది డాక్యుమెంట్స్‌ను వారి యజమానికి సమర్పించాలి:

- వ్యక్తి లేదా అతని కుటుంబ సభ్యుని కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్, లేదా ఆసుపత్రిలో పరిశోధనల ద్వారా కోవిడ్-19 పాజిటివ్ అని వైద్యపరంగా నిర్ధారించిన రిపోర్ట్ లేదా కొవిడ్‌ చికిత్స చేస్తున్న వైద్యుడు ఇన్-పేషెంట్ ఫెసిలిటీ

- కోవిడ్-19 పాజిటివ్‌ వచ్చిన తర్వాత ఆరు నెలల్లోపు కోవిడ్‌-19 లేదా కోవిడ్-19కి సంబంధించిన అనారోగ్యం కారణంగా వ్యక్తి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వైద్య నిర్ధారణ లేదా చికిత్సకు సంబంధించిన అన్ని అవసరమైన డాక్యుమెంట్స్.

- కోవిడ్-19 చికిత్స లేదా కోవిడ్-19కి సంబంధించిన అనారోగ్యం లేదా వ్యక్తి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన మొత్తం ఖర్చుల డాక్యుమెంట్స్.

నోటిఫికేషన్ ప్రకారం.. ఒక వ్యక్తి తన వైద్య చికిత్స కోసం లేదా వారి కుటుంబంలోని ఏ సభ్యుని చికిత్స కోసం అయినా, కోవిడ్-19కి సంబంధించిన ఏదైనా అనారోగ్యానికి సంబంధించిన ఖర్చులను, క్లాజ్ (XII) స్టేట్‌మెంట్‌ను ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 56లోని సబ్-సెక్షన్ (2)లోని క్లాజ్ (X)కి సంబంధించిన మొదటి నిబంధన ధ్రువీకరిస్తుంది. ఫారమ్ నంబర్ 1లో ఈ వివరాలు ఉంటాయి.



* ఫారమ్ నం.1 లోని వివరాలు ఇవే..

- PAN

- COVID-19 పాజిటివ్ నిర్ధారణ వివరాలు

- ఏదైనా వ్యక్తి నుంచి రిసీవ్ చేసుకున్న డబ్బు

- డబ్బు పొందిన వ్యక్తి పేరు, చిరునామా, పాన్

- డబ్బు అందుకున్న ఆర్థిక సంవత్సరం.

* ఒక వ్యక్తి మరణించిన సందర్భంలో, ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌కు కింది షరతులు వర్తిస్తాయి:
వ్యక్తి మరణం పాజిటివ్ అని నిర్ధారించిన తేదీ నుంచి లేదా వైద్యపరంగా కోవిడ్-19 కేసుగా పేర్కొన్న తేదీ నుంచి ఆరు నెలలలోపు అయి ఉండాలి.

* వ్యక్తి కుటుంబ సభ్యులు ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..
వ్యక్తి కోవిడ్‌-19 పాజిటివ్ రిపోర్ట్, లేదా వైద్య నివేదిక ఆసుపత్రిలో లేదా చికిత్స పొందుతున్న వైద్యుని ద్వారా ఇన్‌పేషెంట్ ఫెసిలిటీ పరిశోధనల ద్వారా కోవిడ్‌ -19 పాజిటివ్ అని వైద్యపరంగా నిర్ధారించిన వివరాలు. వైద్య నిపుణుడు లేదా ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం జారీ చేసిన వైద్య నివేదిక లేదా డెత్ సర్టిఫికెట్.
Published by:Mahesh
First published:

Tags: Covid-19, IT Returns, TAX SAVING, Taxes

తదుపరి వార్తలు