Home /News /business /

NEW GOLD LOAN SCHEME AT 6 5 INTEREST RATE LAUNCHES BY MUTHOOTTU MINI FINANCIERS AK GH

Muthoottu Mini Financiers: ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ నుంచి కొత్త స్కీమ్.. 6.5% వడ్డీ రేటుతో కొత్త గోల్డ్ లోన్ పథకం ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ సరికొత్త గోల్డ్ లోన్ స్కీమ్‌ ప్రారంభించింది. ‘సూపర్ ఆఫర్’ పేరుతో కేవలం 6.5% వడ్డీ రేటుతో కొత్త గోల్డ్ లోన్ స్కీమ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

తాత్కాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రుణాలు తీసుకునే పద్ధతి చాలాకాలం నుంచి వస్తోంది. గతంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బంగారంపై తక్కువ మొత్తాల్లో రుణాలు ఇచ్చేవి. ఇప్పుడు మాత్రం తక్కువ వడ్డీ రేట్లతో దాదాపు బంగారానికి సమానమైన రుణ మొత్తాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ సరికొత్త గోల్డ్ లోన్ స్కీమ్‌ ప్రారంభించింది. ‘సూపర్ ఆఫర్’ పేరుతో కేవలం 6.5% వడ్డీ రేటుతో కొత్త గోల్డ్ లోన్ స్కీమ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

అత్యుత్తమ వడ్డీ రేట్లతో బంగారంపై గరిష్ట రుణ మొత్తాన్ని ఈ ఆఫర్ ద్వారా పొందవచ్చు. కస్టమర్ల నుంచి ఎలాంటి హిడెన్ చార్జెస్ (hidden charges) వసూలు చేయకుండా అధిక రుణాలు అందించేందుకు ముత్తూట్‌ మినీ ఓ ప్లాన్ కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటగా గోల్డ్ లోన్ ఆఫర్ ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

ఈ పథకం లాంచ్ చేసిన సందర్భంగా ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాథ్యూ ముత్తూట్ మాట్లాడారు. "ముత్తూట్ మినీ సంస్థ కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉంది. సంస్థ ప్రారంభిస్తున్న అన్ని కార్యక్రమాలకు కస్టమర్లే మూలస్తంభం. మా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నంలో ‘సూపర్ ఆఫర్’ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. మహమ్మారి సమయంలో బంగారు రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ప్రారంభించాం. ఈ పథకంతో కస్టమర్లు తక్కువ వడ్డీ రేట్లతో బంగారు రుణాలు పొంద గలుగుతారు" అని డైరెక్టర్ మాథ్యూ తెలిపారు.

భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకింగేతర సంస్థల్లో ఒకటిగా ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్ నిలుస్తోంది. ముత్తూట్ మినీకి ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 8 జోనల్ ఆఫీసులు 800కు పైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా 3000+ మంది ఉద్యోగులతో సేవలు అందిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆస్తుల నిర్వహణ (AUM) 18 శాతం, వడ్డీ ఆదాయం 17.50 శాతం చొప్పున పెరిగింది. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ (PBT) ఏకంగా 65 శాతం పెరిగింది. ముత్తూట్ మినీ 10 మరో 4 రుణ బ్యాంకులతో కలిసి మొత్తం 10 బ్యాంకులతో రుణాలను అందజేస్తోంది. ఇది పబ్లిక్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్(Non-Convertible Debenture-NCDs) ఇష్యూకి వెళ్లి రూ. 700 కోట్లు సమీకరించింది.

ఇటీవల ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ 15వ ఇష్యూ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీలు) రూ. 108 కోట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. 15వ ఇష్యూ రూ.125 కోట్ల బేస్ ఇష్యూ సైజు కలిగి ఉంది. ఇది ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌ను నిలుపుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ బీ ప్లస్‌తో ఎన్సీడీ స్థిరమైన కేర్ రేటింగ్స్ రేటింగ్ తో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యింది. ఎన్సీడీ ఇష్యూ వివిధ రకాల సర్టిఫికేషన్ ఆప్షన్స్ కలిగి ఉంది. దీని వార్షిక కూపన్ రేటు 8.75% - 10% వరకు ఉంటుంది.

Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ? మీరు రోజూ తినే ఆహారంలో ఈ మూడు కచ్చితంగా ఉండేలా చూసుకోండి

Huzurabad: సాయంత్రం వరకే ఛాన్స్.. ఏదో ఒకటి చెప్పండి.. మాజీమంత్రికి కాంగ్రెస్ డెడ్‌లైన్

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ ను 1921లో మాథ్యూ ముత్తూట్(Mathew Muthoottu) సామాన్యుడి ఫైనాన్షియర్‌గా స్థాపించారు. శతాబ్ద కాలంలో ఇది భారతదేశ వ్యాప్తంగా 800+ బ్రాంచ్‌లతో ఒక పెద్ద కంపెనీగా అవతరించింది. బహుళ రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ నిజాయితీ అనే సూత్రంతో ఈ కంపెనీ మరింత విస్తరిస్తోంది. కస్టమర్లకు అత్యంత సులభంగా గోల్డ్ లోన్ అందేలా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ వంటి చాలా రాష్ట్రాల్లో మనీ ట్రాన్స్‌ఫర్, రీఛార్జ్, బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, ట్రావెల్ & టూరిజం సర్వీసులను అందిస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Gold loans

తదుపరి వార్తలు