Home /News /business /

NEW GEN MARUTI SUZUKI CELERIO BOOKINGS IN INDIA OPEN MK GH

Celerio bookings: భారత్‌లో ప్రారంభమైన న్యూ జెనరేషన్ మారుతి సుజుకి సెలెరియో కారు బుకింగ్స్

Celerio

Celerio

భారత్‌లో న్యూ జెనరేషన్ మారుతి సుజుకి సెలెరియో బుకింగ్స్‌ ప్రారంభించినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మారుతి సుజుకి వెబ్‌సైట్ల ద్వారా లేదా డీలర్ల వద్ద టోకెన్ అమౌంట్‌గా రూ.11,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.

ఇంకా చదవండి ...
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి భారత్ మార్కెట్లో న్యూ జెనరేషన్‌ 2021 మోడల్ సెలెరియో బుకింగ్స్ ప్రారంభించింది. చాలా కాలంగా తయారీలో ఉన్న ఈ కారును ఈ నెలలోనే లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ఇటీవల తెలిపారు. దీని ధరను ఈనెల 10న ప్రకటించనున్నారు. ఈ క్రమంలో భారత్‌లో న్యూ జెనరేషన్ మారుతి సుజుకి సెలెరియో బుకింగ్స్‌ ప్రారంభించినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మారుతి సుజుకి వెబ్‌సైట్ల ద్వారా లేదా డీలర్ల వద్ద టోకెన్ అమౌంట్‌గా రూ.11,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. కొత్త తరం మోడల్‌లో హ్యాచ్ బ్యాక్ అంటే బ్యాక్ డోర్ చాలా పైకి ఎత్తడం వీలవుతుంది. దీని ద్వారా ఏవైనా లోడ్ చేసుకోవడం ఈజీ అవుతుందని కంపెనీ ప్రకటించింది.

ఇవి చదవండి.. Top electric scooters in india 2021: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..టాప్ 5 చాయిస్ ఇవే...

మారుతి సుజుకి సెలెరియో ధరలు రూ. 4.80-6.20 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సరికొత్త సెలెరియోను కె సిరీస్ 1.0 లీటర్ డ్యుయల్ జెట్ ఇంజన్ (వేరియబుల్ వాల్వ్ టైమింగ్)తో అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ ఇంజన్ కంటే ఇది సమర్థంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఐడల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఏర్పాటు వల్ల మైలేజీ పెరుగుతుందని మారుతి సుజుకీ తెలిపింది. దేశంలో ఇదే అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన కారుగా మారుతుందని కంపెనీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి చదవండి.. Xiaomi: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి త్వరలోనే Electric Car విడుదల...

ప్రస్తుతం ఉన్న మోడల్స్‌తో పోలిస్తే న్యూ జెన్ మారుతి సుజుకి సెలెరియో భిన్నమైన డిజైన్‌తో వస్తోంది. ఇది మధ్యలో క్రోమ్ బార్‌తో.. లోగో నుంచి సెట్‌బ్యాక్ హెడ్ ల్యాంప్‌ల వరకు కర్వీ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. LED హెడ్ లైట్లు, చిల్ సెల్డ్ ఫ్రంట్ బంపర్, ఫ్లేర్ వీల్ ఆర్చ్‌లతో ఈ కారును డిజైన్‌ చేసినట్లు కంపెనీ టీజర్‌లో వెల్లడించింది. న్యూ జెన్ మారుతి సుజుకి సెలెరియో హర్టెక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న మోడళ్ల కన్నా ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ల సదుపాయాలు కూడా ఉన్నాయి.

న్యూ జెన్ మారుతి సుజుకి సెలెరియో ప్రత్యేకమైన స్టైల్, ఆటో గేర్ సిస్టమ్ టెక్నాలజీతో మార్కెట్లో సంచలనంగా మారనుందని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. బ్రాండ్ సెలెరియో ఆధునిక డిజైన్, ఆచరణలో కొత్త తరం సాంకేతికతకు నిదర్శనంగా నిలవనుందన్నారు. పట్టణ వినియోగదారుల వ్యక్తిత్వానికి సరిపోతుందన్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు