హోమ్ /వార్తలు /బిజినెస్ /

Financial Planning: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది... ఈ ఏడాదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Financial Planning: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది... ఈ ఏడాదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Financial Planning: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది... ఈ ఏడాదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Financial Planning: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది... ఈ ఏడాదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Financial Planning | కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పుడు మొదలుపెడితేనే చివర్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనుకున్నా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కష్టాల్లోనే ఉంది. ఫలితంగా అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి పెద్ద కంపెనీలతో సహా ఐటీ కంపెనీలు భారీ తొలగింపులు చేపడుతున్నాయి. ఈ సంవత్సరంలోనూ ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో కొత్త ఆర్థిక సంవత్సరం (Financial Year) ఏప్రిల్ ఒకటితో మొదలైనందున ఆర్థిక స్థితిగతులను సమీక్షించడానికి, ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక వేయడానికి ఇదే మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. వారి ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్వెస్ట్‌మెంట్స్‌

2023లో ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరంగా మారింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితులలో మీరు మీ పెట్టుబడులను సమీక్షించుకోవాలి. ఈక్విటీ, డెట్, బంగారం, అంతర్జాతీయ పెట్టుబడులలో మీ పోర్ట్‌ఫోలియో విస్తరించి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీ పోర్ట్‌ఫోలియోను అంచనా వేయడానికి ఆస్తి కేటాయింపు పరీక్ష (Asset Allocation Test)ను నిర్వహించుకోవాలి.

Salary Hike: జీతం పెరుగుతుందని ఎదురుచూస్తున్నారా? ఈసారి నిరాశ తప్పదు

మీ ఆర్థిక లక్ష్యాలు లేదా రిస్క్‌లకు సంబంధించి తగిన మార్పులను చేసుకునేటట్లు ప్రతి ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి ఆస్తి కేటాయింపు పరీక్ష చేసుకోవడం మంచిది. అంతేకాకుండా, ఏప్రిల్ 1న సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ని ప్రారంభించాలి. లేదా మీకు వీలైతే, మీరు పొందే వార్షిక ఇంక్రిమెంట్‌లను పరిగణనలోకి తీసుకుని మీ ప్రస్తుత SIPని టాప్ అప్ చేయాలి.

ఇన్సూరెన్స్

ఆరోగ్య, జీవిత బీమా కవరేజీ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అలా లేని పక్షంలో మంచి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయాలి. అలాగే, పెద్దగా ప్రయోజనాలు చేకూర్చని బీమా పాలసీలను విక్రయించాలి. ఇటీవలే వివాహం చేసుకొని ఉంటే లేదా ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలనుకుంటుంటే, మీ ఆరోగ్య బీమా పాలసీలో మీ జీవిత భాగస్వామిని తప్పకుండా చేర్చుకోవాలి. మీపై ఆధారపడే వారు ఉంటే.. ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ కవర్, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ని కొనుగోలు చేయడం మంచిది.

New Scheme: అన్ని పోస్ట్ ఆఫీసుల్లో మహిళలకు కొత్త స్కీమ్... ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

వడ్డీ రేటు తగ్గింపు కోసం బ్యాంకుతో చర్చలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022, మే నుంచి రెపో రేట్లను 2.5% పెంచింది. దీనివల్ల సాధారణ గ్రహీతలు, ఫ్లోటింగ్-రేట్‌తో హోమ్ లోన్స్ తీసుకున్న వ్యక్తులపై అధిక భారం పడింది. అయితే ఇలాంటి రుణాలు తీసుకున్న వారు తక్కువ వడ్డీ రేటు కోసం బ్యాంక్‌తో చర్చలు జరపవచ్చు. అలానే రేట్లలో వ్యత్యాసం స్వల్పంగా ఉన్నా, తక్కువ వడ్డీ రేట్లు ఉన్న వేరే బ్యాంక్‌కే లోన్‌ను బదిలీ చేయాలి. ఈ విధంగా భారం తగ్గించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్స్ పరిశీలించడం చాలా ముఖ్యం.

తెలివిగా ఖర్చు పెట్టాలి

మీ ఖర్చులు పెరగకుండా చూసుకోవడానికి బడ్జెట్‌ను రూపొందించాలి. దానికి కట్టుబడి ఉంటూ, మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. ఎలాంటి ఎర్రర్‌లు లేవని నిర్ధారించుకోవడానికి మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. మెరుగైన లోన్ రేట్లను పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయాలి.

ట్యాక్స్‌లు

మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేయాలి. ముందస్తు పన్నులను కూడా చెల్లించాలి.

First published:

Tags: Income tax, Insurance, Personal Finance, TAX SAVING

ఉత్తమ కథలు