MG Astor: హాట్ కేకుల్లా అమ్ముడైన ఎంజీ ఆస్టర్​.. కేవలం 20 నిమిషాల్లోనే 5 వేల కార్లు సేల్

ప్రతీకాత్మక చిత్రం

MG Cars: బుకింగ్స్​ ప్రారంభించిన కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5,000 యూనిట్లు హాట్​కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ ఏడాది గాను మొత్తం 5 వేల MG Astor కార్లను అమ్మకానికి పెట్టగా.. అవన్నీ నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Share this:
MG Astor Cars: ప్రముఖ బ్రిటీష్​ ఆటోమొబైల్ దిగ్గజం మోరిస్ గ్యారేజ్(MG) ఈ నెల​ 11న ఎంజీ ఆస్టర్ ​ ఎస్​యూవీ (MG STOR SUV)ని లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మిడ్​ సైజ్​ ఎస్​యూవీ బుకింగ్స్​ గురువారం ప్రారంభించగా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. బుకింగ్స్​ ప్రారంభించిన కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5,000 యూనిట్లు హాట్​కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ ఏడాది గాను మొత్తం 5 వేల MG Astor కార్లను అమ్మకానికి పెట్టగా.. అవన్నీ నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాదికి సంబంధించిన బుకింగ్స్ క్లోజ్ అవ్వడంతో వీటిని కొనాలనుకునే కస్టమర్లు వచ్చే ఏడాదికి వరకు నిరీక్షించాల్సి ఉంటుంది. దీంట్లో ఏఐ వంటి అడ్వాన్స్​డ్​ ఫీచర్లను అందించడంతో రూ. 25 వేల ప్రీబుకింగ్​ ఫీజు చెల్లించి ఎగబడి మరీ కొన్నారు. బుకింగ్​ చేసుకున్న కస్టమర్లకు నవంబర్​లో కారు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ డిజైన్ స్కెచ్‌లను విడుదల చేసిన హ్యూందాయ్‌

ఎమ్​జీ ఆస్టర్​ భారత మార్కెట్​ (Indian Market)లో రూ. 9.78 లక్షల నుంచి రూ. 17.38 లక్షల మధ్య విడుదలైంది. వేరియంట్​ను బట్టి ధరలో మార్పులు ఉంటాయి. కస్టమర్ల నుంచి అనూహ్య స్పందనపై ఎంజీ మోటార్​ ఇండియా ఎండీ రాజీవ్​ చాబా మాట్లాడుతూ “ఎంజీ ఆస్టర్ అనేది ప్రీమియం మిడ్-సెగ్మెంట్ ఎస్​యూవీ వాహనం. దీనిలో సొగసైన ఎక్స్‌టీరియర్‌, విలాసవంతమైన ఇంటీరియర్‌, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని అందించాం. ఆటోమొబైల్​ పరిశ్రమ (Automobile Industry) ప్రస్తుతం ఎదుర్కొంటున్న గ్లోబల్ చిప్ సంక్షోభం కారణంగా, ఈ సంవత్సరం పరిమిత సంఖ్యలోనే కార్లను తయారు చేస్తున్నాం. వచ్చే ఏడాది క్యూ 1 నుంచి ఎక్కువ కార్లను ఉత్పత్తి చేసి విక్రయించాలని భావిస్తున్నాం. అప్పటిలోగా పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం.’’ అని చెప్పారు.

బైక్ కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారా..? క్లెయిమ్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుందో

భారత్​లో తొలి ఏఐ పవర్​ కారు..

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో తొలి ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ కారుగా ఎమ్​జీ ఆస్టర్​ నిలవనుంది. ఈ కారు ఇంటీరియర్స్​లో భాగంగా 10.1 అంగుళాల టచ్​ స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​ను అందించింది. ఇది జియో ఈ–సిమ్​తో కనెక్టింగ్​ సదుపాయంతో వస్తుంది. కారులో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత రోబోట్​ వ్యక్తిగత సహాయకుడిగా వినియోగదారుడికి వాయిస్​ ఆదేశాలతో సమాధానమిస్తుంది. ఇది వికీపీడియా, జోక్స్​, న్యూస్​, చిట్​ చాట్, నావిగేషన్​, మ్యూజిక్​ సెలక్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published: