Home /News /business /

NEW CAR LAUNCHES IN INDIA IN DECEMBER 2020 MK GH

December New Cars: డిసెంబర్ లో సందడి చేయనున్న New cars ఇవే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ను ముంచెత్తేందుకు ఓ రేంజ్ లో సరికొత్త కార్ మోడల్స్ రెడీ అవుతున్నాయి. ఇలా కన్ఫర్మ్ అయిన లిస్ట్ లో ఉన్న మోడల్స్ SUV, Luxury sedan, a sub-4 metre SUV, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సెడాన్ అనే లీకులు గట్టిగా వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ను ముంచెత్తేందుకు ఓ రేంజ్ లో సరికొత్త కార్ మోడల్స్ రెడీ అవుతున్నాయి. ఇలా కన్ఫర్మ్ అయిన లిస్ట్ లో ఉన్న మోడల్స్ SUV, Luxury sedan, a sub-4 metre SUV, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సెడాన్ అనే లీకులు గట్టిగా వస్తున్నాయి.

Nissan Magnite

నిస్సాన్ మాగ్నెట్ తో Maruti Suzuki Vitara Brezza, Hyundai Venue, Kia Sonet, Toyota Urban Cruiser, Honda WRV, Tata Nexon, Ford EcoSport కు చెక్ పెట్టేందుకు నిస్సాన్ రెడీ అయింది. డిసెంబర్ 2న మ్యాగ్నెట్ ధరలు ప్రకటించనున్నారు. 1.0లీటర్ ఇంజిన్ పవర్ తో ఉన్న Magnite పై మంచి అంచనాలున్నాయి. ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్ స్టాండర్డ్ గా ఉండగా, హయ్యర్ వేరియంట్స లో CVT యూనిట్ ను అందుబాటులోకి తెచ్చింది. 4 వేరియంట్లలో ఈ నిస్సాన్ మ్యాగ్నెట్ అందుబాటులోకి రానుంది. జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ కు ఇండియాలో మంచి రివ్యూలు, రేటింగ్సు వచ్చి, మధ్యతరగతి వారిని సైతం నిస్సాన్ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ అయిన మాగ్నెట్ పై ఇండియన్ మార్కెట్లో చాలా మంచి బజ్ వచ్చింది.

ప్రతీకాత్మకచిత్రం


New Force Gurkha

ఢిల్లీలో జరిగిన Auto Expo 2020లో సెకెండ్ జెన్ పోర్స్ గూర్ఖా ను తొలిసారి షోకేజ్ చేశారు. అప్ డేటెడ్ Force Motors ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది. BS6-compliant 2.2 litre diesel engineతో, ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పోర్స్ గూర్ఖా ఆకట్టుకునేలా ఉంది. ఆల్ న్యూ ఎక్స్ టీరియర్ డిజైన్స్, కొత్త డ్యాష్ బోర్డ్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టంతో వావ్ అనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. ఫోర్స్ మోటర్స్ అంటే ఇండియన్స్ కు మొదటి నుంచి ఉన్న క్రేజ్ వేరు. ధర కాస్త ఎక్కువైనా వీటికి మన విపణిలో ఏమాత్రం డిమాండ్ తగ్గకపోవటమే ఇందుకు నిదర్శనం.

Mercedes-Benz-A-Class Limousine

CLA-Class కు కొనసాగింపుగా వస్తున్న కొత్త మెర్సిడెజ్ బెంజ్ ఏ క్సాల్ లుక్ 2020 ఆటో ఎక్స్ పోలో రివీల్ చేశారు. అతి త్వరలో మార్కెట్లో అడుగుపెట్టేందుకు న్యూ మెర్క్ ముస్తాబు అయింది. AMG వేరియంట్ ఉన్న 2.0లీటర్ టర్బో పెట్రోల్ మోటర్, 2.0లీటర్ పెట్రోల్, డీజల్ మోటర్స్ మోడల్స్ ఇది అందుబాటులోకి రానుంది. ఇటీవలే కంపెనీ బ్రాండ్లలో భాగంగా అఫిషియల్ వెబ్ సైట్లో కూడా ఫీచర్లైన MBUX system, panoramic sunroof, all LED lighting, cruise control, wireless charging, widescreen display, dual-zone climate control వంటివి మెర్క్ లో ఉండనున్నాయి.

Mercedes, Mercedes benz, Mercedes benz new model, AMG GLE 53 4MATIC+ Coupe, EQ Boost starter, మెర్సిడెస్- బెంజ్‌, జిఎల్ఇ ఎఎమ్జి 4 మాటిక్ ప్లస్ కూపే, హై-వోల్టేజ్ హైబ్రిడ్ టెక్నాలజీ
ప్రతీకాత్మకచిత్రం


Audi S5 Sportback

ఆడి అంటే మన ఇండియన్స్ కు మోస్ట్ ఫేవరెట్ కార్స్ లో ఒకటిగా మారింది. చిన్న పట్టణాల్లో సైతం ఆడి కార్లు జోరందుకుంటున్నాయి. తాము రిలీజ్ చేయబోతున్న కొత్త మోడల్ పై ఆడి ఇండియా అక్టోబర్ లోనే టీజర్ వదిలింది. Q2SUV లాంచింగ్ టైంలోనే ఇది టాక్ ఆఫ్ ఆటోమొబైల్ వరల్డ్ గా నిలిచింది. S5 Sportback S5 Sportback ఈ నెలలో మన మార్కెట్లో లాంచ్ కానుంది. CBU యూనిట్ తో ఉన్న ఈ మోడల్ ధర కోటి రూపాయల పైమాటే. S5 Sportback ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉండనున్నాయి. 3.0 లీటర్ ట్విన్ టర్బో V6 engine, 349bhp ప్రొడ్యూస్ చేసేలా, 500Nm టార్క్ తో ఈ కార్ ఆడి లవర్స్ ను ఊరించేలా ఉండనుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Automobiles, CAR, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు