New Cars Launch In November: నవంబరులో విడుదల కానున్న కార్లు ఇవే..!

ఫెస్టివల్ సీజన్ వస్తుందంటే చాలు.. మార్కెట్లోకి కొత్త కార్లు రిలీజవుతుంటాయి. కొత్త మోడళ్లతో.. ఆఫర్లతో విపణి లో అడుగుపెడతాయి. మరి ఈ నవంబర్ లో వచ్చే కార్ల గురించి తెలుసుకుందామా..

news18
Updated: October 29, 2020, 1:59 PM IST
New Cars Launch In November: నవంబరులో విడుదల కానున్న కార్లు ఇవే..!
  • News18
  • Last Updated: October 29, 2020, 1:59 PM IST
  • Share this:
పండగ సీజన్ లో నూతన కారును విడుదల చేస్తే పబ్లిసిటీతో పాటు మంచి విక్రయాలు అందుకుంటాయి. ఈ నేపథ్యంలో నవంబరులో పలు కార్ల తయారీ సంస్థలు తమ వాహనాలను భారత విపణిలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అంతేకాకుండా మరికొన్ని సంస్థలను తమ కొత్త కార్ల మోడళ్లను ఆవిష్కరించనున్నాయి. మరి నవంబరు 2020లో ఆవిష్కరించనున్న కార్లతో పాటు.. మార్కెట్ లోకి విడుదల కానున్న వాహనాలపై ఓ లుక్కేద్దా రండి.

హ్యూండాయ్ ఐ20..

నవంబరు 5న తన ఐ20 మోడల్ ను విడుదల చేసేందుకు హ్యుండాయ్ సంస్థ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ వాహనానికి సంబంధించిన డిజైన్, స్కెచ్ లను బహిర్గత పరిచింది. మూడో తరం ఐ20 మోడల్ గా భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కారు చెన్నై ప్లాంట్లో తయారు చేశారు. 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ మోటార్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మోటార్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతో రాబోతుందని అంచా వేస్తున్నారు. ఫీచర్ల దగ్గరకొస్తే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు, క్యాస్కేడింగ్ గ్రిల్, జెడ్ ఆకారంలోని ఎల్ఈడీ టెయిల్ లైట్లు, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, అతిపెద్ద టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, సెకండ్ రో ఏసీ వెంట్స్ లాంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

new cars, cars, car sales, new model cars, November Launching Vehicles, November 2020 Released cars Festive season Cars, festival offers for cars

మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ 43 ఏఎంజీ 4మ్యాటిక్ కూపే..
ఇటీవలే జీఎల్సీ 43 ఏఎంజీ 4మ్యాటిక్ కూపే మోడల్ ను స్థానికంగా అసెంబుల్ చేయడమే కాకుండా తదితర మోడళ్లను విడుదల చేస్తామని మెర్సిడెజ్ బెంజ్ ఇటీవలే ప్రకటించింది. తాజాగా ఈ కారును నవంబరు 3న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మేడ్ ఇన్ ఇండియా రూపొందిన ఈ కారు మొదటి సీకేడీ యూనిట్ గా గుర్తింపుతెచ్చుకుంది. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ 43 ఏఎంజీ 4మ్యాటిక్ కూపే మోడల్ 3.0-లీటర్ వీ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 385 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 520 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.9 సెకండ్లలోనే అందుకుంటుంది. వచ్చే వారం ఈ కారుకు సంబంధించిన ధరను బహిర్గత పరచనుంది సంస్థ. ఎక్స్ షోరూంలో దీని ధర దాదాపు రూ.80 లక్షలు ఉండే అవకాశమున్నట్లు అంచనా.

ఆడీ ఎస్5 స్పోర్ట్ బ్యాక్..ఆడీ క్యూ ఎస్ యూవీని లాంచ్ చేసినప్పుడే తన తర్వాతి మోడల్ ఎస్5 స్పోర్ట్ బ్యాక్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిందీ జర్మన్ సంస్థ. తాజాగా ఈ కారును పండగ సీజన్లోనే విడుదల చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 3.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి 349 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 500 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం తో పవర్ నాలుగు చక్రాలకు పవర్ ను షేర్ చేస్తుంది. ఫీచర్ల దగ్గరకొస్తే ఆడీ ఎస్5 స్పోర్ట్ బ్యాక్ ఎల్ఈడీ లైటింగ్, క్వాడ్ టిప్ ఎక్సాహాస్ట్, ప్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, వర్చువల్ కాక్ పిట్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆల్కాంత్రా, కార్బన్ ఫైబర్ ఇన్ సర్ట్, ఫోర్ డ్రైవ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.

new cars, cars, car sales, new model cars, November Launching Vehicles, November 2020 Released cars Festive season Cars, festival offers for cars

శాంగ్ యాంగ్ రెక్స్ టాన్ ఫేస్ లిఫ్ట్..
మాహీంద్రా సంస్థ మార్కీ శాంగ్ యాంగ్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రెక్స్ టాన్ ఫేస్ లిఫ్ట్ ను విడదల చేయాలని నిశ్చయించింది. ఈ మోడల్ కు చెందిన మార్పులను వెబ్ సైట్ లో బహిర్గత పరిచింది. రెక్స్ టాన్ ఫేస్ లిఫ్ట్ మోడల్లో అతిపెద్ద బ్లాక్ గ్రిల్, సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు. పునరుద్ధరించిన ఫ్రంట్, రియర్ బంపర్లు, అల్లాయ్ వీల్స్, టీ ఆకారంలోని ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఇందులో ఉన్నాయి. అంతర్భాగాన్ని పరిశీలిస్తే పోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, న్యూ గేర్ లీవర్, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, రెండు ఇంటీరియర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ బ్లైండ్ స్పాడ్ మానిటారింగ్, లేన్ చెక్ కలిగి ఉంది.

పవర్టెయిన్ సిస్టం శాంగ్ యాంగ్ రెక్స్ టాన్ ఫేస్ లిఫ్ట్ మోడల్లో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉండి 178 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 420 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ మోడల్ రియర్ వీల్ డ్రైవ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ సెటప్ తో పనిచేస్తుంది.
Published by: Srinivas Munigala
First published: October 29, 2020, 1:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading